Sweater: స్వెట్టర్ వేసుకొని పడుకుంటున్నారా? ఏం జరుగుతుందో తెలుసా?
Sweater: బయట చలి చంపేస్తోందని స్వెట్టర్ వేసుకుంటున్నారా? రాత్రిపూట కూడా స్వెట్టర్ వేసుకొని పడుకుంటున్నారా? ఏం జరుగుతుందో తెలుసా? ముఖ్యంగా చిన్న పిల్లలకు రాత్రిపూట స్వెట్టర్ వేయడం ఎంత ప్రమాదమో తెలుసా?

Sweater
రోజు రోజుకీ చలి పెరిగిపోతోంది. ఈ చలి తట్టుకోలేక చాలా మంది రోజూ స్వెట్టర్ వేసుకుంటూ ఉంటారు. రాత్రిపూట బయటకు వెళ్లే సమయంలో స్వెట్టర్ వేసుకోవడం ఒకే కానీ... పడుకొనేటప్పుడు కూడా దానిని వదిలిపెట్టడం లేదా? కానీ, రాత్రిపూట స్వెట్టర్ వేసుకోవడం ఆరోగ్యానికి మంచిదేనా? నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం....
స్వెట్టర్ లను దాదాపు ఉన్ని వస్త్రాలతో తయారు చేస్తారు. అందుకే మనం వేసుకున్నప్పుడు శరీరానికి వెచ్చగా ఉంటుంది. మనకు చలిని తట్టుకునే శక్తిని ఇస్తుంది. కానీ, రాత్రి నిద్రపోయేటప్పుడు వేసుకోవడం మాత్రం చాలా ప్రమాదం అని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలకు ఇది మరింత ప్రమాదకరం అని చెబుతున్నారు నోయిడాలోని మాక్స మల్టీ స్పెషాలిటీ సెంటర్ పీడియాట్రీషిన్ డాక్టర్ చారు కల్రా.
రాత్రిపూట స్వెట్టర్ ఎందుకు ధరించకూడదు..?
శరీర ఉష్ణోగ్రత అసమతుల్యం
రాత్రి ఉన్ని దుస్తులు ధరించడం వల్ల శరీరం నుంచి అధిక వేడి వెలుపలికి వెళుతుంది. చర్మం బాగా పొడిబారుతుంది. దద్దుర్లు, దురద వంటి సమస్యలు వస్తాయి.చిన్నపిల్లల్లో అయితే డీహైడ్రేషన్ వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది.
అలెర్జీలు పెరుగుతాయి
చర్మ అలెర్జీ లేదా ఎగ్జిమా ఉన్నవారు రాత్రి స్వెటర్ వేసుకుని నిద్రిస్తే సమస్య మరింత పెరుగుతుంది.
పిల్లల్లో అయితే, దుమ్ము కారణంగా రాత్రి దగ్గు, శ్వాస సమస్యలు ఎక్కువవుతాయి.
రక్తపోటు సమస్యలు..
స్వెట్టర్ వేసుకోవడం వల్ల వేడి ఎక్కువ అవుతుంది. దీని వల్ల చెమటలు ఎక్కువగా వస్తాయి. రాత్రిపూట బీపీ తగ్గడం, తల తిరగడం, నిద్రకు అంతరాయం కలిగిస్తుంది. హృదయ సంబంధిత సమస్యలున్నవారికి అయితే ఛాతిలో బరువు, శ్వాస ఇబ్బంది రావచ్చు.
ఉబ్బసం తీవ్రతరం అవుతుంది
ఉన్ని దుస్తుల్లో ఉండే మెత్తని నూలు కణాలు , దుమ్ము అలెర్జీ కారణం అవుతాయి. దీని కారణంగా ఉబ్బసం అటాక్స్ వచ్చే ప్రమాదం అధికంగా ఉంటుంది. అందుకే ఉబ్బసం ఉన్నవారు రాత్రి స్వెటర్లు తప్పనిసరిగా నివారించాలి.
బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు
స్వెటర్లు, సాక్స్ వేసుకుని నిద్రిస్తే చెమట ఎక్కువగా పడుతుంది. బాక్టీరియా పెరిగి ఇన్ఫెక్షన్లు రావచ్చు.
అందుకే పడుకునే ముందు వాటిని తీసేయడం తప్పనిసరి.
అయితే రాత్రి చలి ఎక్కువైతే ఏం చేయాలి?
కాటన్ దుస్తులు వేసుకుని నిద్రించండి. మందంగా ఉన్న దుప్పటి ఉపయోగించండి. హీటర్ వాడితే గది గాలి పొడిబారకుండా ఒక బౌల్‌లో నీరు పెట్టండి

