MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Life
  • Best Morning Routine: పొద్దున్నే ఈ 5 పనులు చేస్తే రోజంతా ఫుల్ హ్యాపీగా ఉంటారు!

Best Morning Routine: పొద్దున్నే ఈ 5 పనులు చేస్తే రోజంతా ఫుల్ హ్యాపీగా ఉంటారు!

Best Morning Routine: ఉదయం లేచిన వెంటనే చేసే కొన్ని పనులు మీ రోజు ఎలా ఉండబోతుందో నిర్ణయిస్తాయి. నిద్రలేవగానే హడావుడిగా చేసే కొన్ని పనులు రోజంతా అలసట, చిరాకుకు కారణం కావచ్చు. కానీ ఈ 5 పనులు చేస్తే రోజంతా పాజిటివ్ గా, హ్యాపీగా ఉండొచ్చు. అవేంటో చూద్దాం.

2 Min read
Author : Kavitha G
Published : Aug 13 2026, 02:36 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ఉదయాన్నే తప్పక చేయాల్సిన పనులు
Image Credit : stockPhoto

ఉదయాన్నే తప్పక చేయాల్సిన పనులు

మన రోజు ఎలా ప్రారంభమవుతుందో, ఆ రోజు మొత్తం మన మానసిక స్థితి కూడా చాలావరకు అలాగే ఉంటుంది. ఉదయం లేవగానే ఒత్తిడి, ఆందోళన, హడావుడితో రోజును మొదలుపెడితే రోజంతా అలసట, చిరాకు వెంటాడుతుంటాయి. కానీ కొన్ని చిన్న చిన్న అలవాట్లను ఉదయం పాటిస్తే మన శరీరంతో పాటు మనసు కూడా ఉత్సాహంగా ఉంటుంది. అంతేకాదు, పని మీద ఏకాగ్రత పెరగడం, ఒత్తిడి తగ్గడం, రోజంతా పాజిటివ్‌గా ఉండడం వంటి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. అందుకే ప్రతి ఒక్కరూ ఉదయం తప్పకుండా చేయాల్సిన ఐదు పనులేంటో తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
ఒక గ్లాస్ వాటర్ తాగడం
Image Credit : Getty

ఒక గ్లాస్ వాటర్ తాగడం

రాత్రంతా నిద్రపోయిన తర్వాత మన శరీరం కొంత మేర డీహైడ్రేషన్‌కు గురవుతుంది. అందుకే ఉదయం నిద్రలేవగానే ఒకటి లేదా రెండు గ్లాసుల గోరువెచ్చని నీరు తాగడం చాలా మంచిది. ఇది శరీరంలో జీవక్రియలను చురుకుగా చేస్తుంది. జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేయడంలో సహాయపడుతుంది. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపించడంలో చక్కగా పనిచేస్తుంది. ఉదయాన్నే నీరు తాగడం వల్ల మెదడు పనితీరు కూడా మెరుగుపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

Related Articles

Related image1
Parenting: మగపిల్లలతో ప్రతి తండ్రి కచ్చితంగా చెప్పాల్సిన 5 మాటలు ఇవే..!
Related image2
Jowar Roti: జొన్న రొట్టెతో ఈ 5 కూరలు తింటే డబుల్ బెనిఫిట్! ఒకసారి ట్రై చేయండి
36
20 నిమిషాల వ్యాయామం
Image Credit : Getty

20 నిమిషాల వ్యాయామం

ఉదయం కొద్దిసేపు నడవడం, యోగా చేయడం లేదా తేలికపాటి వ్యాయామం చేయడం వల్ల శరీరంలో ఎండార్ఫిన్స్ అనే హ్యాపీ హార్మోన్స్ విడుదల అవుతాయి. ఇవి మన మానసిక స్థితిని మెరుగుపరచడంతో పాటు ఒత్తిడిని తగ్గిస్తాయి. అలాగే రక్తప్రసరణ మెరుగుపడి రోజంతా ఉత్సాహంగా ఉండేలా చేస్తాయి. ఎక్కువ సమయం లేకపోతే కనీసం 15 నుంచి 20 నిమిషాలు నడవడం లేదా స్ట్రెచింగ్ చేయడం అలవాటు చేసుకుంటే శారీరకంగా, మానసికంగా ఎంతో తేడా కనిపిస్తుంది.

46
ఫోన్‌కు దూరంగా ఉండడం
Image Credit : stockPhoto

ఫోన్‌కు దూరంగా ఉండడం

చాలామంది నిద్రలేచిన వెంటనే మొబైల్ తీసుకుని సోషల్ మీడియా, వాట్సాప్ లేదా వార్తలు చూడటం మొదలుపెడతారు. దీంతో తెలియకుండానే మెదడు ఒత్తిడికి గురవుతుంది. ఇతరుల జీవితాలతో పోల్చుకోవడం, ప్రతికూల వార్తలు చూడటం వల్ల ఉదయం నుంచే మనసు భారంగా మారే అవకాశం ఉంటుంది. అందుకే కనీసం మొదటి 30 నిమిషాలు ఫోన్‌కు దూరంగా ఉండండి. ఆ సమయాన్ని కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు, ధ్యానం చేయడానికి లేదా ప్రశాంతంగా టీ తాగేందుకు ఉపయోగిస్తే రోజంతా మానసిక ప్రశాంతత ఉంటుంది.

56
హెల్తీ బ్రేక్ ఫాస్ట్
Image Credit : stockPhoto

హెల్తీ బ్రేక్ ఫాస్ట్

బ్రేక్‌ఫాస్ట్‌ను చాలా మంది నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ ఉదయం తీసుకునే ఆహారమే రోజంతా శక్తిని అందించే ప్రధాన ఇంధనం. పండ్లు, గుడ్లు, పాలు, నట్స్, మొలకలు లేదా ప్రోటీన్ ఎక్కువగా ఉండే బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటే శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. దీంతో అలసట తగ్గి, పని మీద దృష్టి పెరుగుతుంది. ఆకలి కారణంగా వచ్చే చిరాకు కూడా తగ్గుతుంది.

66
పనులను ప్లాన్ చేసుకోవడం
Image Credit : our own

పనులను ప్లాన్ చేసుకోవడం

ఉదయం ఐదు నిమిషాలు సమయం కేటాయించి ఆ రోజు చేయాల్సిన ముఖ్యమైన పనులను రాసుకోవడం లేదా మనసులో ప్లాన్ చేసుకోవడం చాలా మంచి అలవాటు. ఇలా చేయడం వల్ల ఏ పని ముందు చేయాలి, ఏది తర్వాత చేయాలి అనే స్పష్టత వస్తుంది. పనులపై ఒత్తిడి తగ్గి, సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోవచ్చు. ఒక పని పూర్తయిన తర్వాత కలిగే సంతృప్తి కూడా మనలో ఆనందాన్ని పెంచుతుంది. రోజును ప్రణాళికతో ప్రారంభించిన వారు సాధారణంగా ఎక్కువ ఉత్పాదకతతో పని చేస్తారని అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
ఆరోగ్యం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Period Diet: పీరియడ్స్ టైంలో ఇలాంటి ఫుడ్ తీసుకుంటే చాలా మంచిది!
Recommended image2
భారతీయులు ఎంజాయ్ చేయడానికి బ్యాంకాక్‌కు ఎందుకు వెళ్తారు?
Recommended image3
Blouse:ట్రెండింగ్ బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్స్..చీర అందాన్ని పెంచుతాయి
Related Stories
Recommended image1
Parenting: మగపిల్లలతో ప్రతి తండ్రి కచ్చితంగా చెప్పాల్సిన 5 మాటలు ఇవే..!
Recommended image2
Jowar Roti: జొన్న రొట్టెతో ఈ 5 కూరలు తింటే డబుల్ బెనిఫిట్! ఒకసారి ట్రై చేయండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved