MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Life
  • Jowar Roti: జొన్న రొట్టెతో ఈ 5 కూరలు తింటే డబుల్ బెనిఫిట్! ఒకసారి ట్రై చేయండి

Jowar Roti: జొన్న రొట్టెతో ఈ 5 కూరలు తింటే డబుల్ బెనిఫిట్! ఒకసారి ట్రై చేయండి

Jowar Roti: ప్రస్తుతం చాలామంది అన్నానికి బదులు జొన్న రొట్టె తినడానికి ఇష్టపడుతున్నారు. అయితే జొన్నరొట్టెను సరైన కూరతో తింటే శరీరానికి మరిన్ని పోషకాలు అందుతాయి అంటున్నారు నిపుణులు. మరి జొన్నరొట్టెతో ఎలాంటి కూరలు తింటే ఆరోగ్యానికి మంచిదో చూద్దాం.

2 Min read
Author : Kavitha G
Published : Aug 10 2026, 03:43 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
జొన్న రొట్టెతో తినాల్సిన కూరలు
Image Credit : AI

జొన్న రొట్టెతో తినాల్సిన కూరలు

ఇటీవలి కాలంలో చాలామంది హెల్తీ ఫుడ్ వైపు మొగ్గుచూపుతున్నారు. అలా ఆరోగ్యానికి మేలు చేసేవాటిలో జొన్నలు ముందు వరుసలో ఉంటాయి. వీటిలో ఫైబర్, రెసిస్టెంట్ స్టార్చ్, వివిధ రకాల ఫైటో కెమికల్స్, ఫీనాలిక్ సమ్మేళనాలు ఎక్కువగా ఉంటాయి. జొన్న రొట్టెలను సరైన కూరలతో కలిపి తింటే ఆరోగ్యానికి మరింత మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అవేంటో చూద్దాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఆకుకూరలు
Image Credit : Pixabay

ఆకుకూరలు

పాలకూర, తోటకూర, మెంతికూర, చుక్కకూర వంటి ఆకుకూరలను తక్కువ నూనెతో వండుకుని జొన్నరొట్టెతో కలిపి తీసుకోవచ్చు. ఆకుకూరలు.. విటమిన్లు, ఖనిజాలు, ఫైటోన్యూట్రియెంట్లను అందిస్తాయి. ఒకే రకమైన కూరను ప్రతిరోజూ తినడం కంటే రంగులు, రకాలు మార్చుతూ కూరగాయలను తీసుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన పోషకాలు లభిస్తాయని నిపుణులు సూచిస్తున్నారు.

Related Articles

Related image1
Jowar Roti: జొన్న రొట్టె ఉదయం తినాలా? రాత్రి తినాలా? ఏ టైంలో తింటే మంచిది?
Related image2
Jowar Roti: 30 రోజులు అన్నం మానేసి జొన్న రొట్టె తింటే ఏమవుతుందో తెలుసా?
35
పప్పులు
Image Credit : Pinterest

పప్పులు

జొన్న రొట్టెతో పాటు కందిపప్పు, పెసరపప్పు, మినప్పప్పు లేదా శనగపప్పును తగిన మోతాదులో తీసుకోవడం వల్ల శరీరానికి ప్రోటీన్ కూడా అందుతుంది. ఆరోగ్యకరమైన భోజనంలో ధాన్యాలతో పాటు పప్పులు, గింజలు వంటి ఆరోగ్యకరమైన ప్రోటీన్ వనరులను చేర్చుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. జొన్నరొట్టెతో పప్పు కూర రుచితో పాటు పోషక విలువలను కూడా పెంచుతుందని చెబుతున్నారు.

45
బీన్స్ వంటి కూరలు
Image Credit : Freepik

బీన్స్ వంటి కూరలు

బీన్స్, చిక్కుడు వంటి వాటిని ఎక్కువగా వేయించకుండా తక్కువ నూనెతో వండుకుంటే జొన్నరొట్టెకు మంచి సైడ్ డిష్‌ అవుతుంది. కూరగాయలను ఎక్కువగా, జొన్న రొట్టెను తగిన మోతాదులో తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

రంగు రంగుల కూరగాయలు

వంకాయ, క్యారెట్, క్యాప్సికమ్, టమాట వంటి రంగు రంగుల కూరగాయలను ఆహారంలో మార్చి మార్చి తినడం ద్వారా మొక్కల నుంచి లభించే ఫైటో న్యూట్రియెంట్లు అందే అవకాశం ఉంటుంది. జొన్నలో కూడా ఫీనాలిక్ సమ్మేళనాలు, ఇతర బయోయాక్టివ్ పదార్థాలు ఉన్నాయని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి.

55
నీటిశాతం ఎక్కువగా ఉండే కూరగాయలు
Image Credit : Getty

నీటిశాతం ఎక్కువగా ఉండే కూరగాయలు

సొరకాయ, బీరకాయ, దొండకాయ వంటి నీటి శాతం ఎక్కువగా ఉండే కూరగాయలను తక్కువ నూనె, తక్కువ ఉప్పుతో వండుకుని జొన్నరొట్టెతో తీసుకోవచ్చు. ముఖ్యంగా భోజనంలో కూరగాయల పరిమాణాన్ని పెంచడం ద్వారా ప్లేట్‌లో ధాన్యంతో పాటు మొక్కల ఆధారిత ఆహారానికి ప్రాధాన్యం ఇవ్వవచ్చని నిపుణులు చెబుతున్నారు.

జొన్నరొట్టె ఆరోగ్యానికి మంచిదే అయినప్పుటికీ మోతాదుకు మించి తినకూడదు. జొన్న రొట్టెలో కూడా కార్బోహైడ్రేట్లు, కేలరీలు ఉంటాయి. రొట్టె పరిమాణం, దానితో తీసుకునే కూర, పప్పు, నూనె వంటి మొత్తం భోజనాన్ని బట్టి పోషక విలువ మారుతుంది. ముఖ్యంగా ప్రత్యేకమైన ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
ఆహారం
ఆరోగ్యం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Rakhi: మార్కెట్లో కొనే అవసరం లేకుండా, ఇంట్లోనే రాఖీ తయారు చేసేయండిలా
Recommended image2
Bangles:ఎంత చూసినా తనివి తీరని గాజుల డిజైన్లు.. చీరల మీదకు అదిరిపోతాయి
Recommended image3
Matheran: మిట్ట మధ్యాహ్నమే చీకట్లు పడే ప్రదేశం ఇది.. మన దేశంలో ఎక్కడ ఉందో తెలుసా?
Related Stories
Recommended image1
Jowar Roti: జొన్న రొట్టె ఉదయం తినాలా? రాత్రి తినాలా? ఏ టైంలో తింటే మంచిది?
Recommended image2
Jowar Roti: 30 రోజులు అన్నం మానేసి జొన్న రొట్టె తింటే ఏమవుతుందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved