MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Parenting: మగపిల్లలతో ప్రతి తండ్రి కచ్చితంగా చెప్పాల్సిన 5 మాటలు ఇవే..!

Parenting: మగపిల్లలతో ప్రతి తండ్రి కచ్చితంగా చెప్పాల్సిన 5 మాటలు ఇవే..!

Parenting: ఒక అబ్బాయి జీవితంలో తండ్రి మాటలకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. తండ్రి చెప్పే ఒక్కో మాట కొడుకు ఆలోచనా విధానం, భవిష్యత్ పై ఎంతో ప్రభావం చూపుతుంది. అందుకే చిన్ననాటి నుంచే కొడుకుతో కొన్ని విషయాలు స్పష్టంగా మాట్లాడటం అవసరం. అవేంటో చూద్దాం.

2 Min read
Author : Kavitha G
Published : Aug 12 2026, 06:47 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
మగపిల్లలకు తండ్రి చెప్పాల్సిన మాటలు
Image Credit : chat GPT

మగపిల్లలకు తండ్రి చెప్పాల్సిన మాటలు

పిల్లల పెంపకంలో తండ్రి పాత్ర ప్రత్యేకమైంది. ముఖ్యంగా మగపిల్లలు పెరుగుతున్న కొద్దీ తమ భావాలను బయటకు చెప్పకుండా లోపలే దాచుకుంటారు. ఇలాంటి సమయంలో తండ్రి చెప్పే కొన్ని మాటలు వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచడమే కాకుండా, జీవితాన్ని చూసే విధానాన్ని కూడా మార్చగలవు. డబ్బు, చదువు, కెరీర్ గురించి చెప్పే సలహాలతో పాటు కొన్ని విలువలను నేర్పడం కూడా తండ్రి బాధ్యతే. అందుకే ప్రతి తండ్రి తన కొడుకుతో చెప్పాల్సిన 5 ముఖ్యమైన మాటల గురించి ఇక్కడ చూద్దాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
నువ్వు ఎలా ఉన్నా, నేను నిన్ను ప్రేమిస్తానని చెప్పడం
Image Credit : AI

నువ్వు ఎలా ఉన్నా, నేను నిన్ను ప్రేమిస్తానని చెప్పడం

పిల్లలకు తల్లిదండ్రుల ప్రేమ వారి విజయాలపై మాత్రమే ఆధారపడి ఉండదనే నమ్మకం అవసరం. పరీక్షల్లో మంచి మార్కులు వచ్చినప్పుడు మాత్రమే ప్రశంసించడం, గెలిచినప్పుడు మాత్రమే ఆనందించడం వల్ల పిల్లల్లో “నేను సాధిస్తేనే నాన్నకు నచ్చుతాను” అనే భావన ఏర్పడవచ్చు. కాబట్టి కొడుకు విజయం సాధించినప్పుడు మాత్రమే కాకుండా, ఓడిపోయినప్పుడు, తప్పు చేసినప్పుడు, నిరాశలో ఉన్నప్పుడు కూడా తండ్రి అతని పక్కన నిలబడాలి. నువ్వు ఎలా ఉన్నా, నీ మీద నా ప్రేమ మారదు అని చెప్పడం ద్వారా పిల్లవాడికి భద్రతా భావన కలుగుతుంది.

Related Articles

Related image1
Parenting: పిల్లలకు రోజుకో కథ చెప్తే వారిలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసా?
Related image2
Parenting: ప్రతి తల్లి తన కూతురికి పొరపాటున కూడా చెప్పకూడని 5 మాటలు ఇవే!
36
ఫీలింగ్స్ ని బయటకు చెప్పమని నేర్పడం
Image Credit : Getty

ఫీలింగ్స్ ని బయటకు చెప్పమని నేర్పడం

బాధ, భయం, కోపం, నిరాశ, ఒంటరితనం వంటి భావాలు అబ్బాయిలకు కూడా ఉంటాయి. వాటిని దాచిపెట్టడం బలానికి సంకేతం కాదు. తన మనసులో ఉన్నది తండ్రితో చెప్పగలిగే వాతావరణం ఇంట్లో ఉండాలి. కొడుకు బాధగా ఉన్నప్పుడు వెంటనే “ఇంత చిన్న విషయానికే ఎందుకు ఏడుస్తున్నావు?” అని కొట్టిపారేయకుండా, నువ్వు ప్రతి విషయం నాతో చెప్పుకోవచ్చు, నేను నీకు తోడుగా ఉంటాను అనే భరోసా కల్పించాలి.

46
తప్పును అంగీకరించమని చెప్పడం
Image Credit : Getty

తప్పును అంగీకరించమని చెప్పడం

పిల్లలు తప్పులు చేయడం సహజం. చదువులో, ఆటలో, స్నేహాల్లో కావచ్చు ఇలా ప్రతి అనుభవం వారికి ఒక పాఠమే. తప్పు చేసిన ప్రతిసారీ తండ్రి కోపంతో మందలిస్తే, పిల్లవాడు భయంతో నిజం దాచడం మొదలు పెట్టవచ్చు. దానికి బదులుగా జరిగిన తప్పును అర్థం చేసుకునేలా మాట్లాడాలి. “ఏం జరిగింది? తర్వాత ఇలా జరగకుండా ఏం చేయొచ్చు?” అని ప్రశ్నించడం ద్వారా సమస్య పరిష్కార నైపుణ్యాన్ని పెంచవచ్చు. తప్పును అంగీకరించడం బలహీనత కాదని, అవసరమైతే క్షమాపణ చెప్పడం కూడా గొప్ప గుణమేనని తండ్రి తన ప్రవర్తన ద్వారా పిల్లాడికి చూపించాలి.

56
ప్రతి ఒక్కరినీ గౌరవించమని నేర్పడం
Image Credit : Getty

ప్రతి ఒక్కరినీ గౌరవించమని నేర్పడం

ఒక మంచి మనిషిగా ఎదగడానికి చదువు, ఉద్యోగం, డబ్బు మాత్రమే సరిపోవు. ఇతరులను ఎలా చూస్తాడు, ఎలా మాట్లాడతాడు, వారి హద్దులను ఎంత గౌరవిస్తాడు అన్నది కూడా ముఖ్యమే. ఇంట్లో తల్లిని, అక్కాచెల్లెళ్లను, స్నేహితులను, పనివారిని, వృద్ధులను గౌరవంగా చూసే అలవాటును తండ్రి తన ప్రవర్తనతో నేర్పాలి. ముఖ్యంగా మహిళల పట్ల గౌరవం, వారి వ్యక్తిగత హద్దులను అర్థం చేసుకోవడం చిన్నప్పటి నుంచే నేర్పాలి.

66
నిర్ణయ సామార్థ్యాన్ని పెంచడం
Image Credit : chat GPT

నిర్ణయ సామార్థ్యాన్ని పెంచడం

తండ్రి తన కొడుకు కోసం ప్రతి నిర్ణయం తీసుకోవడం కంటే, సరైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని పెంచడం ముఖ్యం. ఏం చదువుకోవాలి, ఏ రంగంలోకి వెళ్లాలి? ఎలాంటి వారితో స్నేహం చేయాలి వంటి విషయాల్లో తండ్రి మార్గనిర్దేశం చేయవచ్చు. కానీ పిల్లవాడి ఆసక్తి, ప్రతిభ, అభిప్రాయాలకు కూడా విలువ ఇవ్వాలి. “నేను నీకు దారి చూపిస్తాను కానీ.. నీ జీవితాన్ని నువ్వే నిర్మించుకో వంటి మాటలు తండ్రి చెప్పడం ద్వారా అవసరమైనప్పుడు తండ్రి తనకు అండగా ఉంటాడనే నమ్మకం పిల్లల్లో కలుగుతుంది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
చిన్నారుల సంరక్షణ
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
Latest Videos
Recommended Stories
Recommended image1
Coriander Leaves: వంటల్లో కొత్తిమీర ఎందుకు వేయాలో తెలుసా?
Recommended image2
Fish: సముద్రపు చేప, నదిలో చేప... రెండింటిలో ఏది ఆరోగ్యానికి మంచిది?
Recommended image3
Sarees: వావ్ అనిపించే వర్క్ శారీస్.. డిజైన్లు చూస్తే ఫిదా కావాల్సిందే!
Related Stories
Recommended image1
Parenting: పిల్లలకు రోజుకో కథ చెప్తే వారిలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసా?
Recommended image2
Parenting: ప్రతి తల్లి తన కూతురికి పొరపాటున కూడా చెప్పకూడని 5 మాటలు ఇవే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved