MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Life
  • ఒక వ్యక్తి ఆహారం లేకుండా ఎంతకాలం జీవించగలడు? ఫుడ్ లేకుండా శరీరానికి శక్తి ఎలా వస్తుంది?

ఒక వ్యక్తి ఆహారం లేకుండా ఎంతకాలం జీవించగలడు? ఫుడ్ లేకుండా శరీరానికి శక్తి ఎలా వస్తుంది?

కొన్ని గంటలు పాటూ ఆహారం తినకపోతేనే విపరీతంగా ఆకలి వేస్తుంది. అయితే ఎప్పుడైనా ఆలోచించారా? ఒక వ్యక్తి ఆహారం లేకుండా ఎన్ని రోజులు బతకగలడు అని. వైద్యులు ఏం చెప్పారో తెలుసుకోండి.

1 Min read
Author : Haritha Chappa
Published : Aug 13 2026, 01:51 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
ఆహారం తినకుండా ఎన్నిరోజులు బతకగలం?
Image Credit : Gemini Ai

ఆహారం తినకుండా ఎన్నిరోజులు బతకగలం?

మనం ప్రతిరోజూ మూడు పూటలా ఆహారం తింటాడు. ఒక్క పూట భోజనం ఆలస్యమైతేనే నీరసంగా అనిపిస్తుంది. కొందరు వ్యక్తులు ఉపవాసాలు ఉంటారు. అయితే ఎప్పుడైనా ఆలోచించారా? ఆహారం లభించని పరిస్థితులు వస్తే ఎన్ని రోజులు ఒక వ్యక్తి బతకగలడు? ఆ సమయంలో మానవ శరీరంలోని అవయవాలు శక్తిని ఎలా ఉత్పత్తి చేసుకుంటాయి? ఈ ప్రశ్నలకు వైద్యులు ఆసక్తికరమైన శాస్త్రీయ సమాధానాలను వెల్లడించారు. మానవ శరీరం ఒక అద్భుతమైన యంత్రంలా పనిచేస్తుంది. ఆహారం అందనప్పుడు అది ప్రత్యేక ఎమర్జెన్సీ మోడ్లోకి వెళ్లి శరీరానికి శక్తి ఇచ్చేందుకు ప్రయత్నిస్తుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
శక్తిని ఇలా అందిస్తుంది
Image Credit : Gemini AI

శక్తిని ఇలా అందిస్తుంది

ఆహారం అందడం ఆగిపోయిన మొదటి కొన్ని గంటల నుంచి కొద్ది రోజుల వరకు శరీరం శక్తిని పొందే ప్రక్రియ మొదలవుతుంది. సాధారణ రోజుల్లో మనం తినే ఆహారం ద్వారా లభించే 'గ్లూకోజ్' మనకు తక్షణ శక్తిని ఇస్తుంది. అయితే ఆహారం తీసుకోవడం ఆపేసిన మొదటి 12 నుంచి 24 గంటల్లో, కాలేయం, కండరాలలో ముందుగానే దాచిపెట్టిన 'గ్లైకోజెన్' నిల్వలను శరీరం విచ్ఛిన్నం చేయడం ప్రారంభిస్తుంది. ఈ గ్లైకోజెన్‌ను గ్లూకోజ్‌గా మార్చి మెదడుకు, ఇతర అవయవాలకు శక్తిని సరఫరా చేస్తుంది. కానీ, ఈ గ్లైకోజెన్ నిల్వలు కేవలం ఒక రోజు లేదా రెండు రోజులకు మాత్రమే సరిపోతాయి.

Related Articles

Related image1
మనదేశంలో నదులన్నీ ఆడవే... కానీ ఒకే ఒక్క మగ నది ఉంది, అదేంటో తెలుసా?
Related image2
బంగారం కన్నా ఖరీదైన మొక్క.. దీని ఆకులతోనే కోట్ల వ్యాపారం, మనదేశంలోనే దొరుకుతుంది
33
కొన్ని వారాలు బతకవచ్చు
Image Credit : Gemini AI

కొన్ని వారాలు బతకవచ్చు

రెండవ రోజు దాటిన తర్వాత శరీరంలో గ్లైకోజెన్ నిల్వలు ఖాళీ అయిపోతాయి. తరువాత శరీరం తన కణజాలాల్లోని కొవ్వు నిల్వలపై ఆధారపడుతుంది. ఈ దశను వైద్య పరిభాషలో 'కీటోసిస్' అంటారు. కాలేయం ఈ కొవ్వులను కరిగించి 'కీటోన్లు'గా మారుస్తుంది. ఈ కీటోన్లు రక్తం ద్వారా ప్రయాణించి మెదడుకు, గుండెకు గ్లూకోజ్‌కు ప్రత్యామ్నాయంగా శక్తిని అందిస్తాయి. శరీరంలో ఉన్న కొవ్వు నిల్వలను బట్టి ఒక మనిషి ఆహారం లేకుండా వారాల పాటూ జీవించగలడు. అయితే ఆహారం లేకుండా కొద్ది రోజులు బతగవచ్చు కానీ...'నీరు' లేకుండా మాత్రం 3 నుంచి 5 రోజుల కంటే ఎక్కువ కాలం బతకడం చాలా కష్టం.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Best Time to Workouts : ఉదయం వర్కౌట్స్ చేయడం మంచిదా? లేక సాయంత్రమా?
Recommended image2
Black Raisins: నానబెట్టిన నల్ల ఎండు ద్రాక్ష తింటే ఎన్ని లాభాలో తెలుసా?
Recommended image3
Chanakya Niti: చాణక్యుడి ప్రకారం ఈ 5 విషయాలు భార్యాభర్తల మధ్య గొడవలకు కారణమవుతాయి!
Related Stories
Recommended image1
మనదేశంలో నదులన్నీ ఆడవే... కానీ ఒకే ఒక్క మగ నది ఉంది, అదేంటో తెలుసా?
Recommended image2
బంగారం కన్నా ఖరీదైన మొక్క.. దీని ఆకులతోనే కోట్ల వ్యాపారం, మనదేశంలోనే దొరుకుతుంది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved