MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Spices: బ్రిటీష్ వాళ్లు వెళ్తూ వెళ్తూ.. మన దేశం నుంచి ఏం తీసుకొని వెళ్లారో తెలుసా?

Spices: బ్రిటీష్ వాళ్లు వెళ్తూ వెళ్తూ.. మన దేశం నుంచి ఏం తీసుకొని వెళ్లారో తెలుసా?

Spices:బ్రిటీష్ వారు మన దేశాన్ని చాలా సంవత్సరాల పాటు పాలించిన విషయం తెలిసిందే. స్వతంత్రం తర్వాత వారు తిరిగి వాళ్ల దేశానికి వెళ్తూ వెళ్తూ.. మన దేశం నుంచి కొన్నింటిని తీసుకొని వెళ్లారు. వాటిల్లో మసాలా దినసులు కూడా ఉన్నాయి.

2 Min read
Author : ramya Sridhar
Published : Oct 29 2026, 06:12 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
బ్రిటీష్ వారు తీసుకెళ్లిన మసాలాలు..
Image Credit : chat GPT

బ్రిటీష్ వారు తీసుకెళ్లిన మసాలాలు..

మధ్య యుగ కాలంలో యూరప్ దేశాలకు మన భారతదేశం అంటే ఒక అద్భుతమైన ప్రపంచం. ఇక్కడి సుగంధ ద్రవ్యాల కోసం ఫ్రెంచ్, ఇంగ్లీష్, డచ్ దేశాల మధ్య భీకరమైన వ్యాపార యుద్ధాలే జరిగాయి. చివరకి మన దేశంలో దొరికే మసాలాల కోసమే.. మన దేశాన్ని వలస రాజ్యంగా మార్చుకున్నారు. భారతీయ వంటలకు ప్రత్యేకమైన రుచి, వాసననుు అందించే మసాలాలపై వారి కన్నుపడింది. అందుకే, 1947లో మన దేశాన్ని విడిచిపెట్టి వెళ్లేటప్పుడు.. బ్రిటీష్ వారు ఇక్కడి మసాలా దినుసులను తమ దేశానికి ఎగుమతి చేసుకున్నారు. వాటిని ఇప్పటికీ, తమ యూరోపియన్ వంటల్లో విరివిగా వాడుతూ ఉంటారు. ఆ మసాలాలు ఏంటో చూద్దాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
1.జీలకర్ర...
Image Credit : Getty

1.జీలకర్ర...

ప్రపంచ జీలకర్ర ఉత్పత్తిలో ఏకంగా 70 శాతం మన భారత దేశానిదే. బ్రిటీష్ వారు తమ దేశంలోని చాలా రకాల మాంసం వంటకాల్లో ఈ జీలకర్రను ఉపయోగిస్తారు. అంతేకాదు, ఫ్రాన్స్ లోని కొన్ని సంప్రదాయ రొట్టెలు, లీడెన్ చీజ్ తయారీలోనూ దీనిని వాడతారు.

నల్ల మిరియాలు..

ఒకప్పుడు మిరియాలు ఎంత విలువైనవంటే.. వాటిని కరెన్సీలా, తాకట్టు వస్తువులా కూడా వాడేవారు. డచ్ భాషలో "మిరియం అంత ఖరీదైనది" అని అర్థం. అంటే..దాని విలువ ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ప్రపంచ మసాలా వ్యాపారంలో ఐదో వంతు మిరియాలదే వాటా. బ్రిటిష్ వారు స్కోన్లు , హాట్‌పాట్‌లు, మాంసాహార వంటకాల్లో దీనిని తప్పనిసరిగా వాడతారు.

34
దాల్చిన చెక్క..
Image Credit : Getty

దాల్చిన చెక్క..

మన దేశం నుంచి వారు తీసుకెళ్లిన మరో ముఖ్యమైన మసాలా దాల్చినచెక్క. బ్రిటిష్ వారు కబాబ్‌లు, కర్రీల తయారీతో పాటు కేకులు బేకింగ్ చేయడానికి, కాఫీ లేదా హాట్ చాక్లెట్ వంటి వేడి పానీయాలకు అద్భుతమైన సువాసన కోసం దీనిని విరివిగా ఉపయోగిస్తారు.

44
పసుపు :
Image Credit : Getty

పసుపు :

మన సాంప్రదాయ 'పసుపు పాలు' ఇప్పుడు స్టార్‌బక్స్ వంటి గ్లోబల్ కేఫ్‌లలో 'టర్మరిక్ లాటే' రూపంలో ప్రపంచాన్ని ఊపుతెస్తున్నాయి. ఆయుర్వేదం శతాబ్దాలుగా చెబుతున్న పసుపులోని ఔషధ గుణాలను ఇప్పుడు పాశ్చాత్య దేశాలు గుర్తించాయి. బ్రిటిష్ వారు చేపల కూరలు, సూప్‌లు, పిలాఫ్‌లతో పాటు పచ్చళ్లకు ఆకర్షణీయమైన రంగు, రుచి కోసం పసుపును ఉపయోగిస్తున్నారు.

ధనియాల పొడి :

బ్రిటిష్ వారు మన దేశంలో గడిపిన 200 ఏళ్ల కాలంలో ధనియాల పొడి మాయలో పడిపోయారు. స్థానికులు భరించలేని కారాన్ని తగ్గించడానికి గరం మసాలాలో ధనియాల పొడిని కలిపి అద్భుతమైన సువాసనను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం లండన్‌లోని హై-ఎండ్ రెస్టారెంట్లలో డెజర్ట్‌లకు సిట్రస్ ఫ్లేవర్ ఇవ్వడానికి, బెల్జియన్ వీట్ బీర్ల తయారీలోనూ దీనిని ఉపయోగిస్తున్నారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
భారత దేశం
జీవనశైలి
 
3rd TEST • SA vs AUS
Live
SASA
(7.1 ov) 329 & 31/1
AUSAUS
429
Day 3 - Session 2
Schedule ›
4th T20 • NZ vs IND 2026
NZNZ
Fri, 30 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
1st T20 • NZ vs IND 2026
Result
NZNZ
225/4
INDIND
230/6
IND beat NZ by 4 wickets
Schedule ›
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Hair Growth: మన జుట్టు నెలకు ఎన్ని సెంటీమీటర్ల పొడవు పెరుగుతుందో తెలుసా?
Recommended image2
Beauty Foods: రోజూ ఈ 6 ఫుడ్స్ తింటే...యవ్వనంగా కనిపించడం పక్కా
Recommended image3
Parenting: సెలబ్రిటీలు పిల్లలకు తమ స్టార్ డమ్ గురించి ఎందుకు చెప్పరు?
Related Stories
Recommended image1
Vodka: వోడ్కా లో నీళ్లు ఎందుకు కలపరు..? అసలు వోడ్కానీ దేనితో తయారు చేస్తారు?
Recommended image2
Millionaire Village: మన దేశంలోనే అత్యంత ధనిక గ్రామం... పేదరికం నుంచి మలీనియర్ గ్రామంగా ఎలా మారింది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved