Vodka: వోడ్కా లో నీళ్లు ఎందుకు కలపరు..? అసలు వోడ్కానీ దేనితో తయారు చేస్తారు?
Vodka: పార్టీ ఏదైనా, పబ్ ఏదైనా.. ఇప్పుడు యూత్ ఫేవరెట్ లిస్ట్ లో ఫస్ట్ ఉండే పేరు 'వోడ్కా' . విస్కీ, బ్రాందీలకు దూరంగా ఉండే వారు కూడా వోడ్కా వైపే మొగ్గు చూపుతుంటారు. అసలు ఈ వోడ్కా దేనితో తయారు చేస్తారు?

వోడ్కా ఎలా తాగుతున్నారు?
అబ్బాయిలు, అమ్మాయిలు అనే తేడా లేకుండా... ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది ఇష్టపడే ఆల్కాహాల్ వోడ్కా. ఇది చూడటానికి అచ్చం వాటర్ లానే ఉంటుంది. ఒక రంగు ఉండదు, ప్రత్యేకమైన వాసన కూడా ఉండదు. కానీ, కిక్ మాత్రం ఇస్తుంది. నార్మల్ గా.. ఆల్కహాల్ ని నీరు, సోడా లేదా కూల్ డ్రింక్ లో కలుపుకొని తాగుతూ ఉంటారు. కానీ, వోడ్కాలో మాత్రం ఏదీ కలపరు. ముఖ్యంగా నీళ్లు కలపరు? ఎందుకు..? అసలు వోడ్కాని దేనితో తయారు చేస్తారు?
వోడ్కాను దేనితో తయారు చేస్తారు..?
చాలా మంది వోడ్కా కేవలం ప్లెయిన్ ఆల్కహాల్ అనుకుంటారు. కానీ, దీని తయారీ వెనక పెద్ద ప్రక్రియే ఉంది. వోడ్కాను ఎక్కువ శాతం పిండి పదార్థాలు , చక్కెర కలిగిన ధాన్యాలైన గోధుమలు , రై , బార్లీ , మొక్కజొన్న తో తయారు చేస్తారు. కొన్ని ప్రాంతాల్లో బంగాళాదుంపలు , ద్రాక్ష పండ్లు నుండి కూడా తయారు చేస్తారు. వీటిని ఫెర్మెంటేషన్ చేసిన తర్వాత మరబెట్టి వడపోసే ప్రక్రియ ద్వారా అత్యధిక ప్యూరిటీ కలిగిన ఆల్కహాల్‌గా మారుస్తారు. ఇందులో సాధారణంగా 40% ఆల్కహాల్ ఉంటుంది.
2. వోడ్కాలో నీళ్లు లేదా సోడా ఎందుకు కలపరు?
విస్కీ, బ్రాందీ లేదా రమ్‌లలో నీళ్లు, సోడా లేదా ఐస్ క్యూబ్స్ కలపడం చూస్తుంటాం. కానీ వోడ్కా విషయంలో మాత్రం చాలామంది నేరుగానే తాగుతుంటారు. దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి. వోడ్కా అనేది అత్యంత శుద్ధి చేసిన ఆల్కహాల్. నీళ్లు లేదా సోడా ఎక్కువగా కలిపితే దాని అసలైన ఘాటు, ఫ్లేవర్, కిక్ తగ్గిపోతాయి. యూరప్‌లో వోడ్కాను బాగా చల్లబరిచి, ఎలాంటి మిక్సింగ్ లేకుండా ఒక్కసారిగా 'షాట్' కొట్టడమే అసలైన పద్ధతిగా భావిస్తారు. అయితే, ఆధునిక పార్టీ కల్చర్‌లో దీనిని క్రాన్‌బెర్రీ జ్యూస్, ఆరెంజ్ జ్యూస్, స్ప్రైట్ లేదా టానిక్ వాటర్‌తో కలిపి రకరకాల కాక్‌టైల్స్ (Cocktails) రూపంలో కూడా విశేషంగా తాగుతుంటారు.
3. వోడ్కాని తాగే సరైన పద్ధతి ఏది?
వోడ్కా బాటిల్‌ను ఫ్రీజర్‌లో పెట్టి బాగా చల్లబరిచిన తర్వాతే షాట్ గ్లాసుల్లో పోసుకుని తాగుతారు. ఆల్కహాల్ శాతం ఎక్కువ ఉండటం వల్ల ఇది ఫ్రీజర్‌లో గడ్డకట్టదు. కేవలం ఐస్ క్యూబ్స్ మాత్రమే వేసుకుని సిప్ చేస్తూ కూడా తాగవచ్చు.
4. వోడ్కాను ప్రపంచానికి పరిచయం చేసింది ఎవరు?
వోడ్కాను ఎవరు ముందుగా కనిపెట్టారనే విషయంలో రష్యా, పోలాండ్ దేశాల మధ్య పెద్ద చర్చే నడుస్తుంది. పోలాండ్ చరిత్ర ప్రకారం 8వ లేదా 9వ శతాబ్దంలోనే దీని ఉత్పత్తి ప్రారంభమైందని చెబితే... రష్యాలో 14వ శతాబ్దం నాటికి ఇది ప్రాచుర్యంలోకి వచ్చింది. ప్రారంభంలో దీనిని తాగడానికి కాకుండా, ఓ ఔషధంగా మాత్రమే ఉపయోగించేవారు. ఆ తర్వాత కాలంలో ఇది అత్యంత ప్రజాదరణ పొందిన పానీయంగా మారి ప్రపంచమంతా వ్యాపించింది.

