బ్యూటీ టిప్ : ఉబ్బిన కళ్లను తగ్గించే అద్భుతమైన చిట్కాలు..
సర్వసాధారణమైన అందం సమస్యలలో ఒకటి ఉబ్బిన కళ్ళు, ఇది కళ్ళ చుట్టూ ఉన్న చర్మం ఉబ్బడం వల్ల జరుగుతుంది. దీనికి నిద్ర లేకపోవడం, అలసట, ఎక్కువగా ఏడవడం లాంటివాటివల్ల కూడా తరచుగా కళ్లు ఉబ్బుతుంటాయి.

ఇవి మీ మొహం అందాన్ని తగ్గించి.. మిమ్మల్ని నలుగురిలో ఇబ్బందికి గురి చేస్తాయి. మరి వీటినుంచి నివారణ ఎలా అంటే.. ఇంట్లోనే కొన్ని చిట్కాలతో వీటినుంచి బైటపడొచ్చు.
బంగాళాదుంపలు : ఆలుగడ్డలను ఫ్రిజ్ లోపెట్టి.. రెండు స్లైసులు కోసి వాటిని కళ్లమీద 10-15 నిమిషాలు ఉంచండి. దీంతో కళ్ళకు ఉపశమనం కలుగుతుంది. కళ్లలోనుంచి నీరు కారడాన్ని కూడా తగ్గిస్తుంది.

కీరా దోసకాయ : బంగాళాదుంపల లాగానే, ఉబ్బిన కళ్ళను తగ్గించడానికి కీరా దోసకాయలు కూడా బాగా ఉపయోగపడతాయి. దోసకాయ ముక్కలను ఫ్రిజ్లో ఉంచి, ఆ తరువాత కళ్ళ మీద 15 నిమిషాలు పెట్టుకోండి. ఇది కళ్ల ఉబ్బును తగ్గించడంలో తోడ్పడుతుంది.

కలబంద : అలోవేరా జెల్ మ్యాజిక్ చేస్తుంది. దీంట్లోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కళ్ళ క్రింద వాపును తగ్గించడంలో సహాయపడుతుంది. అండర్-ఐ బ్యాగ్స్ తగ్గించడానికి అలోవెరా జెల్ ను కాసేపు ఫ్రిజ్ లో పెట్టి ఆ తరువాత ఉబ్బిన కళ్ల ప్రాంతంలో పెడితే మంచి ప్రయోజనం ఉంటుంది.

బాగా నీరు తాగండి.. ఉబ్బిన కళ్లు.. లేదా కళ్ల కింద సంచులు తగ్గించుకోవాలంటే శరీరం డీ హైడ్రేట్ కాకుండా ఉండాలి. శరీరంలో తగ్గిన నీటి శాతం కూడా కళ్ల ఉబ్బుకు కారణమవుతాయి. దీనికోసం ఎక్కవ నీరు తాగండి. ముఖాన్ని తరచుగా చల్లటి నీటితో కడుక్కోండి. ఇది వాపును తగ్గించడంలో సహాయపడుతుంది.