కోరికలు కలగడం లేదా..? కారణాలు ఇవే..
సాధారణంగా ఈ విషయంలో పురుషులే ఎక్కువ చొరవ చూపుతారు. మహిళలు మొదట్లో ఆసక్తి కనబర్చకపోయినా.. ఫోర్ ఫ్లే తర్వాత రతి క్రీడను ఆస్వాదిస్తారు. ముద్దులు, కౌగిలింతల తర్వాత మెల్లగా భాగస్వామికి సహకరిస్తారు.
శృంగారమనేది... దంపతులను శారీరకంగానూ, మానసికంగానూ దగ్గరచేసే ఓ ఔషదం. ఈ ప్రక్రియలో ఇద్దరూ ఆనందంగా గడిపితేనే... వారి జీవితం ఆనందంగా ఉంటుంది. ఇద్దరిలో ఏ ఒక్కరికి ఆసక్తి లేకపోయినా... అది తీయని అనుభూతిని ఇవ్వదు.
సాధారణంగా ఈ విషయంలో పురుషులే ఎక్కువ చొరవ చూపుతారు. మహిళలు మొదట్లో ఆసక్తి కనబర్చకపోయినా.. ఫోర్ ఫ్లే తర్వాత రతి క్రీడను ఆస్వాదిస్తారు. ముద్దులు, కౌగిలింతల తర్వాత మెల్లగా భాగస్వామికి సహకరిస్తారు.
అయితే... ఈ మధ్యకాలంలో జరిపిన ఓ సర్వేలో... చాలా మంది స్త్రీలు శృంగారం పట్ల ఆసక్తి చూపించడం లేదని తేలింది. దానికి కారణాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. స్త్రీలు ఆసక్తి చూపించకపోవడానికి వారిలో కోరికలు తగ్గగిపోవడమే అసలు కారణం అంటున్నారు నిపుణులు.
కలయిక సమయంలో తీవ్రమైన నొప్పి ఉండటం, భావప్రాప్తి పొందలేక పోవడం లాంటి కారణాలతో మహిళల్లో లైంగిక వాంఛలు, సెక్స్ పట్ల ఆసక్తి సన్నగిల్లుతాయి.
ఆర్థరైటిస్, కేన్సర్, డయాబెటిస్, హైబీపీ, నరాల సంబంధిత సమస్యలు మొదలైనవి మహిళల్లో లైంగిక వాంఛలను తగ్గిస్తాయి. వంధ్యత్వం కూడా సెక్స్ కోరికలు తగ్గడానికి కారణం అవుతుంది. దీనికి చికిత్స తీసుకున్నా లైంగిక కోరికలు తక్కువగానే ఉండొచ్చు.
మోతాదుకి మించి ఆల్కహాల్ తీసుకోవడం, అధిక పని ఒత్తిడితో అలసిపోవడం.. చిన్నపిల్లలు, వయసు మీద పడిన పెద్దల బాధ్యతలను చూసుకోవాల్సి రావడం కూడా లైంగిక వాంఛలు తగ్గడానికి కారణం అవుతాయి.
గర్భం దాల్చిన సమయంలో, కాన్పు తర్వాత, చంటి పిల్లలకు చనుబాలు ఇస్తున్నప్పుడు.. చాలా మంది మహిళలకు సెక్స్ పట్ల ఆసక్తి సన్నగిల్లుతుంది. హార్మోన్ల మార్పే దీనికి కారణం. అంతేకాదు మోనోపాజ్ దశకు దగ్గరపడిన సమయంలోనూ వారిలో ఆసక్తి తగ్గిపోతుంది.
చాలా మంది మహిళలు భాగస్వామితో మానసికంగా, భావోద్వేగ పరమైన అనుబంధాన్ని ఇష్టపడతారు. ఆ తర్వాతే సెక్స్‌కి ప్రాధాన్యం ఇస్తారు. కాబట్టి భాగస్వామితో ఏవైనా సమస్యలు ఉన్నా వారిలో లైంగిక వాంఛలు తగ్గుతాయి.
చాలా మంది మహిళలు భాగస్వామితో మానసికంగా, భావోద్వేగ పరమైన అనుబంధాన్ని ఇష్టపడతారు. ఆ తర్వాతే సెక్స్‌కి ప్రాధాన్యం ఇస్తారు. కాబట్టి భాగస్వామితో ఏవైనా సమస్యలు ఉన్నా వారిలో లైంగిక వాంఛలు తగ్గుతాయి.