Employment Opportunities : యువతకు బంపరాఫర్ .. ఈ రంగంలో ఇక లక్షలాది ఉద్యోగాలు
Employment Opportunities : దేశంలోని యువతీయువకులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. రాబోయే ఏడాది కాలంలో లక్షలాది ఉద్యోగాల భర్తీ దిశగా చర్యలు తీసుకుంటామని ప్రకటించింది.

ఇక ఉద్యోగాలే ఉద్యోగాలు
Jobs : ఈ ఏడాది వైద్యారోగ్య రంగాల్లో భారీగా ఉద్యోగాల భర్తీ జరగనుంది. ఇందుకు అనుకూలంగా యువతీయువకులను తీర్చిదిద్దేందుకు కేంద్రం ప్రభుత్వం సిద్దమయ్యింది. ఇందుకు సంబంధించి ఇవాళ (ఫిబ్రవరి 1, ఆదివారం) ప్రవేశపెట్టిన బడ్జెట్ 2026 లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటనలు చేశారు.
ఆరోగ్య రంగాన్ని కేవలం ప్రజలకు వైద్యం అందించేదిగానే చూడటం లేదని... దీన్ని ప్రభుత్వం కీలక ఉపాధి రంగంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించిందన్నారు ఆర్థికమంత్రి. ఈ క్రమంలోనే కేర్ ఎకోసిస్టమ్, అలైడ్ హెల్త్ ప్రొఫెషనల్స్, మానసిక ఆరోగ్యం, ఆయుష్ వ్యవస్థల విస్తరణ ద్వారా లక్షలాదిమంది యువతీయువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా పునాది వేయనున్నట్లు మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
1. కేర్ ఎకోసిస్టమ్ – 1.5 లక్షలమందికి శిక్షణ
బడ్జెట్ 2026లో వృద్ధులు, దీర్ఘకాలిక రోగులు, దివ్యాంగుల సంరక్షణ కోసం కేర్ ఎకోసిస్టమ్ నిర్మాణంకు ప్రాధాన్యం ఇచ్చినట్లు ఆర్థికమంత్రి తెలిపారు. ఈ క్రమంలో 1.5 లక్షల మల్టీ–స్కిల్డ్ కేర్‌గివర్లకు శిక్షణ అందించనున్నట్లు బడ్జెట్‌లో ప్రకటించారు. దీని ద్వారా హోమ్ కేర్ వర్కర్లు, నర్సింగ్ అసిస్టెంట్లు, ఇతర కేర్ సిబ్బందికి పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు ఏర్పడనున్నాయని మంత్రి ప్రకటించారు.
2. అలైడ్ హెల్త్ ప్రొఫెషనల్స్ (AHP) లకు శిక్షణ
బడ్జెట్‌లో పది ఎంపిక చేసిన విభాగాల్లో అలైడ్ హెల్త్ ప్రొఫెషనల్స్ (AHPs) కోసం కొత్త సంస్థల ఏర్పాటు, ఉన్న సంస్థల అప్‌గ్రేడ్ చేయనున్నట్లు మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దీని వల్ల ల్యాబ్ టెక్నీషియన్లు, డయాగ్నస్టిక్ సిబ్బంది, ఫిజియోథెరపిస్టులు, పారా మెడికల్ వర్కర్లకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి.
3. మానసిక ఆరోగ్య రంగంలో నియామకాలు
జిల్లా ఆసుపత్రుల్లో ఎమర్జెన్సీ ఆండ్ ట్రామా కేర్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఇవి మానసిక వైద్యులు, క్లినికల్ సైకాలజిస్టులు, నర్సులు, సోషల్ వర్కర్లకు ఉద్యోగ అవకాశాలను కల్పించనున్నాయి. ఇక రాంచీ, తేజ్‌పూర్‌లలో జాతీయ మానసిక ఆరోగ్య సంస్థలు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు.
4. ఆయుష్ రంగంలో ఉపాధి విస్తరణ
బడ్జెట్ 2026లో 3 కొత్త ఆల్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ ఆయుర్వేద (IIA) లు ఏర్పాటు చేయనున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఆయుష్ ఫార్మసీలు, మెడిసిన్స్ టెస్టింగ్ ల్యాబ్‌లను అప్‌గ్రేడ్ చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో ఆయుర్వేద, యోగా, యూనానీ, సిద్ధా వైద్యులు, పరిశోధకులు, ఫార్మసిస్టులకు ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి.
5. మెడికల్ టూరిజం
ప్రైవేట్ రంగంతో కలిసి మెడికల్ వాల్యూ టూరిజం హబ్‌లు ఏర్పాటు చేయనున్నట్లు బడ్జెట్ 2026 ప్రసంగంలో మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దీని వల్ల ఆసుపత్రులు, డయాగ్నస్టిక్ సెంటర్లు, హెల్త్ మేనేజ్‌మెంట్, కేర్ సేవల రంగాల్లో కొత్త ఉద్యోగాలు సృష్టి కానున్నాయి.

