- Home
- International
- World’s Longest Bridge : ప్రపంచంలోనే లాంగెస్ట్ బ్రిడ్జ్ ఇదే.. దీని పొడవు ఎంతో తెలిస్తే షాక్ అవుతారు!
World’s Longest Bridge : ప్రపంచంలోనే లాంగెస్ట్ బ్రిడ్జ్ ఇదే.. దీని పొడవు ఎంతో తెలిస్తే షాక్ అవుతారు!
The World’s Longest Bridge : చైనాలోని డాన్యాంగ్-కున్షాన్ గ్రాండ్ బ్రిడ్జ్ ప్రపంచంలోనే అత్యంత పొడవైనది. భూకంపాలు వచ్చినా చెక్కుచెదరని వంతెనగా గుర్తింపు పొందింది. 164.8 కిలోమీటర్ల పొడవైన ఈ వంతెన విశేషాలు, నిర్మాణ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

ప్రపంచంలోనే అత్యంత పొడవైన వంతెన ఇదే.. దీనిపై నడిస్తే అలసిపోతారు కానీ దారి మాత్రం ఆగదు
ప్రపంచవ్యాప్తంగా చిన్నవి, పెద్దవి అని తేడా లేకుండా వేల సంఖ్యలో వంతెనలు ఉన్నాయి. నదులు, లోయలు లేదా సముద్రాల మీదుగా నిర్మించిన ఈ వంతెనలు నగరాలు, పట్టణాలు, గ్రామాలను ఒకదానితో ఒకటి కలపడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
అయితే, మీరు ఎప్పుడైనా ప్రపంచంలోనే అత్యంత పొడవైన వంతెన గురించి విన్నారా? సాధారణంగా వంతెనపై ప్రయాణం కొద్ది సేపట్లో ముగుస్తుంది. కానీ ఈ వంతెన అలా కాదు. దీనిపై నడుచుకుంటూ వెళ్తే మనిషి అలసిపోతాడు తప్ప, వంతెన మాత్రం ఇప్పట్లో చివరికి రాదు. అందుకే ఇది ప్రపంచంలో అత్యంత పోడవైన వంతెనగా ఘనత సాధించింది. అదే డాన్యాంగ్-కున్షాన్ గ్రాండ్ బ్రిడ్జ్.
డాన్యాంగ్-కున్షాన్ గ్రాండ్ బ్రిడ్జ్
ప్రంచంలోనే అత్యంత పొడవైన వంతెన పేరు డాన్యాంగ్-కున్షాన్ గ్రాండ్ బ్రిడ్జ్ (Danyang-Kunshan Grand Bridge). ఈ వంతెన పొరుగు దేశమైన చైనాలో ఉంది. ఇంజనీరింగ్ అద్భుతంగా గుర్తింపు పొందింది. ఈ నిర్మాణాన్ని ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత పొడవైన వంతెనగా పరిగణిస్తారు. ఇది కేవలం రోడ్డు మార్గం కోసం మాత్రమే కాదు, ఇది చైనాలోని బీజింగ్-షాంఘై హై-స్పీడ్ రైల్వే లైన్‌లో అత్యంత కీలకమైన భాగంగా ఉంది. చైనా రవాణా వ్యవస్థలో ఈ వంతెన ఒక ప్రధానమైన మైలురాయిగా నిలిచింది.
ఈ వంతెన పొడవు ఎంతో తెలుసా?
ఈ భారీ వంతెన చైనాలోని జియాంగ్సు (Jiangsu) ప్రావిన్స్‌లో నిర్మించారు. దీని పొడవు వింటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. డాన్యాంగ్-కున్షాన్ గ్రాండ్ బ్రిడ్జ్ మొత్తం పొడవు సుమారు 164.8 కిలోమీటర్లు. ఇంత భారీ పొడవు ఉండటం వల్లనే ఇది అనేక నగరాలు, ప్రాంతాలను ఒకదానితో ఒకటి అనుసంధానించగలుగుతోంది.
164 కిలోమీటర్ల పొడవు అంటే సాధారణ విషయం కాదు, ఇది రెండు వేర్వేరు నగరాల మధ్య దూరం అంత ఉంటుంది. అందుకే దీనిని ప్రపంచంలోనే అత్యంత పొడవైన వంతెనగా రికార్డులు చెబుతున్నాయి.
ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునే శక్తి
కేవలం పొడవులోనే కాదు, పటిష్ఠతలోనూ ఈ వంతెన సాటిలేనిది. ఈ వంతెన నిర్మాణం ఎంత బలంగా ఉందంటే, ఇది అనేక ప్రకృతి వైపరీత్యాలను సులభంగా తట్టుకోగలదు. తీవ్రమైన భూకంపాలు వచ్చినా, బలమైన గాలులు వీచినా, లేదా టైఫూన్ల వంటి తుపానులు సంభవించినా ఈ వంతెన చెక్కుచెదరకుండా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అంతటి దృఢమైన ఇంజనీరింగ్ ప్రమాణాలతో దీనిని నిర్మించారు. విపత్తుల సమయంలో కూడా ప్రయాణికులకు రక్షణ కల్పించేలా దీని డిజైన్ ఉండటం విశేషం.
ఈ వంతెన నిర్మాణం ఎప్పుడు పూర్తయింది?
ఇంతటి భారీ వంతెనను నిర్మించడానికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించారు. ఈ వంతెన నిర్మాణంలో కేబుల్-స్టేడ్ డిజైన్, బీమ్ టైప్ స్ట్రక్చర్, ప్రీఫాబ్రికేటెడ్ భాగాలను పెద్ద సంఖ్యలో ఉపయోగించారు. ఈ మెగా ప్రాజెక్ట్ నిర్మాణం 2006 సంవత్సరంలో ప్రారంభమైంది. వేలాది మంది కార్మికులు, ఇంజనీర్ల కృషితో సుమారు ఐదేళ్లపాటు నిర్మాణం కొనసాగింది. చివరికి 2011లో ఈ వంతెన నిర్మాణం పూర్తిగా పూర్తయ్యింది. ఆ తర్వాత దీనిని ప్రజల వినియోగం కోసం అందుబాటులోకి తెచ్చారు.
రవాణా వ్యవస్థలో డాన్యాంగ్-కున్షాన్ గ్రాండ్ బ్రిడ్జ్ కీలక పాత్ర
ప్రస్తుతం డాన్యాంగ్-కున్షాన్ గ్రాండ్ బ్రిడ్జ్ చైనా రవాణా వ్యవస్థలో ఒక ముఖ్యమైన భాగంగా మారిపోయింది. బీజింగ్, షాంఘై వంటి ప్రధాన నగరాల మధ్య హై-స్పీడ్ రైల్వే కనెక్టివిటీని ఇది సులభతరం చేసింది. ఈ వంతెన కారణంగా ప్రజల ప్రయాణం ఎంతో సులభంగా, వేగంగా మారింది. కొండలు, గుట్టలు, నదులు దాటుకుంటూ వెళ్లే ఈ వంతెనపై ప్రయాణం ఒక అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది. ఆధునిక ఇంజనీరింగ్ నైపుణ్యానికి ఇది ఒక నిలువెత్తు నిదర్శనం.
