MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • International
  • IND vs PAK : పాకిస్థాన్ సాయం కోరిన ఇండియా.. ఏం చేసిందో తెలుసా..?

IND vs PAK : పాకిస్థాన్ సాయం కోరిన ఇండియా.. ఏం చేసిందో తెలుసా..?

ఇండియా, పాకిస్థాన్ మధ్య ప్రస్తుతం పచ్చగడ్డి వేసినా భగ్గుమనే స్థాయిలో శత్రుత్వం ఉంది. ఇలాంటి సమయంలోనూ ఓ దేశం మరో దేశానికి సహకారం అందిస్తూ సోదరభావాన్ని చాటుతున్నాయి. తాజాగా అలాంటి ఘటనే చోటుచేసుకుంది. 

1 Min read
Author : Arun Kumar P
Published : May 05 2026, 03:23 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
12
భారత్ కు పాక్ సాయం..
Image Credit : Getty

భారత్ కు పాక్ సాయం..

India vs Pakistan : కుటుంబంలో గొడవలు సర్వసాధారణం... కానీ కుటుంబసభ్యులకు ఏదైనా ఆపద వస్తే అందరూ ఏకమవుతారు. ఇదే ఇండియా-పాకిస్థాన్ విషయంలో కూడా జరుగుతోంది... ఇరు దేశాలు బద్దశత్రువులైనా అవసరం అయినపుడు ఒకరికొకరు సాయం చేసుకుంటారు. ఇప్పటికే అనేక సందర్భాల్లో భారత్ సాయం చేసింది... ఇప్పుడు పాకిస్థాన్ వంతు వచ్చింది. భారతీయులు నడి సముద్రంలో ప్రమాదంలో చిక్కుకోగా మానవత్వంతో స్పందించిన పాక్ సాయం చేసింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
22
అసలేం జరిగింది..?
Image Credit : Gemini AI

అసలేం జరిగింది..?

ఇటీవల గుజరాత్‌లోని పోర్‌బందర్ పోర్ట్ నుండి మస్కట్ కు కార్గో షిప్‌ 'ఎంవి గౌతమ్' బయలుదేరింది. అయితే ఈ షిప్ అరేబియా సముద్రంలో ప్రయాణిస్తుండగా టెక్నికల్ ప్రాబ్లమ్‌ ఏర్పడింది... దీంతో కంట్రోల్ కోల్పోయి నీటిపై కొట్టుకుపోవడం మొదలైంది. ఇలా సముద్రం మధ్యలో ప్రమాదంలో చిక్కుకోవడంతో షిప్ లోని సిబ్బంది కంగారుపడిపోయారు... సాయం కోరగా పాకిస్థాన్ పాజిటివ్ గా స్పందించింది. మానవత్వాన్ని చాటుకుంటూ ప్రమాదంలో ఉన్న షిప్ సిబ్బందిని కాపాడింది పాక్ నేవి.

ప్రమాద సమయంలో ఎంవి గౌతమ్ షిప్ లో ఆరుగురు భారతీయులు, ఓ ఇండోనేషియా పౌరుడు ఉన్నారు. షిప్ ఆగిపోవడంతో మొదట ముంబైలోని మారిటైమ్ రెస్క్యూ కోఆర్డినేషన్ సెంటర్‌కు సమాచారం అందించారు సిబ్బంది. వాళ్లే పాకిస్థాన్‌కు సహాయం కోసం సమాచారం పంపారు. ఆ సమయంలో పాకిస్థాన్ నేవీకి చెందిన ఓ నిఘా నౌక అటువైపే పెట్రోలింగ్ చేస్తోంది. సమాచారం అందగానే పాక్ నేవీ అధికారులు వెంటనే 'ఎంవి గౌతమ్' దగ్గరకు చేరుకున్నారు. షిప్‌లోని సిబ్బందికి అవసరమైన మంచి నీళ్లు, ఆహారం, మందులు అందించారు.

ఇలా అంతర్జాతీయ జలాల్లో ప్రమాదాలు జరిగితే దగ్గర్లోని దేశం సహాయం అందించాలి. ఇలా అంతర్జాతీయ నిబంధనల ప్రకారమే పాకిస్థాన్ ఈ సహాయం చేసింది. గత నెలలో కూడా అరేబియా సముద్రంలో ఇలాంటి ఎమర్జెన్సీ కాల్ రావడంతో పాక్ నేవీ స్పందించి 18 మంది విదేశీ నావికులను కాపాడింది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
భారత దేశం
పాకిస్తాన్
ఏషియానెట్ న్యూస్
ప్రపంచం
వైరల్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
అమెరికాను వ‌ణించిన 9/11 అటాక్‌.. అస‌లా రోజు ఏం జ‌రిగింది? టైమ్ టూ టైమ్ పూర్తి వివ‌రాలు
Recommended image2
Nepal Floods: చుట్టూ సర్వనాశనం.. ఆ పచ్చని ఇల్లు మాత్రం ఎలా నిలబడింది? నేపాల్ వరదల్లో మిరాకిల్!
Recommended image3
Nepal Flash Floods: నేపాల్‌లో ఘోర ప్రళయం.. 903కు పెరిగిన మృతుల సంఖ్య, 4,200 మందికి పైగా గల్లంతు
Related Stories
Recommended image1
Pakistan Navy: భార‌త నౌక‌కు స‌హాయం చేసిన పాకిస్థాన్ నేవీ.. అస‌లేం జ‌రిగిందంటే.?
Recommended image2
T20 World Cup Final : టీమిండియా పాత గాయాలను కెలికిన పాకిస్థాన్.. అక్తర్ బాబు నీకుంది ఇక !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved