MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Sports
  • T20 World Cup Final : టీమిండియా పాత గాయాలను కెలికిన పాకిస్థాన్.. అక్తర్ బాబు నీకుంది ఇక !

T20 World Cup Final : టీమిండియా పాత గాయాలను కెలికిన పాకిస్థాన్.. అక్తర్ బాబు నీకుంది ఇక !

T20 World Cup 2026 Final: అహ్మదాబాద్‌లో భారత్-న్యూజిలాండ్ మధ్య జరగనుంది. టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్‌కు ముందు పాకిస్థాన్ మాజీ ప్లేయర్ షోయబ్ అక్తర్ 2023 ప్రపంచకప్ ఓటమిని గుర్తు చేస్తూ టీమ్ ఇండియాపై ఒత్తిడి పెంచే వ్యాఖ్యలు చేశారు.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Mar 08 2026, 11:20 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ఇండియా vs న్యూజిలాండ్ ఫైనల్: అక్తర్ షాకింగ్ కామెంట్స్ వైరల్
Image Credit : Getty

ఇండియా vs న్యూజిలాండ్ ఫైనల్: అక్తర్ షాకింగ్ కామెంట్స్ వైరల్

ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026 క్లైమాక్స్ దశకు చేరుకుంది. ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య టైటిల్ పోరు జరగనుంది. అయితే, ఈ హై వోల్టేజ్ మ్యాచ్‌కు ముందు పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ టీమ్ ఇండియా పాత గాయాలను మళ్లీ గుర్తు చేశారు. 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్‌లో ఇదే మైదానంలో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఎదుర్కొన్న ఘోర పరాజయాన్ని ప్రస్తావిస్తూ అక్తర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
భారత్ పై 150 కోట్ల మంది ఒత్తిడి
Image Credit : our own

భారత్ పై 150 కోట్ల మంది ఒత్తిడి

ట్యాప్‌మాడ్ షో గేమ్ ఆన్ హై లో అక్తర్ మాట్లాడుతూ.. భారత్‌పై భారీ అంచనాల భారం ఉంటుందని పేర్కొన్నారు. "భారత్ ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది, కానీ వారిపై 150 కోట్ల మంది ప్రజల ఆశల ఒత్తిడి ఉంది. 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్‌లో అహ్మదాబాద్‌లోనే ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓడిపోయిన విషయాన్ని మర్చిపోకూడదు. ఆ ఓటమి జ్ఞాపకాలు, ప్రేక్షకుల అంచనాలు భారత ఆటగాళ్లపై మానసిక ఒత్తిడిని పెంచుతాయి" అని అక్తర్ అన్నారు.

36
IND vs NZ : పిచ్ పరిస్థితి ఏంటి? స్కోరు అంచనాలు ఇవే
Image Credit : X@BCCI

IND vs NZ : పిచ్ పరిస్థితి ఏంటి? స్కోరు అంచనాలు ఇవే

అహ్మదాబాద్ పిచ్ స్వభావాన్ని బట్టి మ్యాచ్ ఫలితం మారుతుందని అక్తర్ అభిప్రాయపడ్డారు. ఒకవేళ వికెట్ స్పిన్నర్లకు అనుకూలిస్తే, 175 నుండి 200 పరుగుల స్కోరు సవాల్‌గా మారుతుందని ఆయన అన్నారు. "న్యూజిలాండ్ గనుక మొదట బ్యాటింగ్ చేసి 225 లేదా 250 పరుగులు చేస్తే, భారత్ తీవ్రమైన ఒత్తిడికి లోనవుతుంది. టీమ్ ఇండియా సర్వసన్నద్ధంగా వస్తుందని నాకు తెలుసు, కానీ క్రికెట్ శ్రేయస్సు దృష్ట్యా న్యూజిలాండ్ ఈసారి టైటిల్ గెలవాలని నేను కోరుకుంటున్నాను" అని అక్తర్ తన మనసులోని మాటను బయటపెట్టారు.

46
న్యూజిలాండ్‌కు సానుకూల అంశాలు
Image Credit : Getty

న్యూజిలాండ్‌కు సానుకూల అంశాలు

మరో పాక్ మాజీ బౌలర్ ఉమర్ గుల్ కూడా అక్తర్ వ్యాఖ్యలతో ఏకీభవించారు. కివీస్ జట్టుకు భారత్‌లో ఆడిన అనుభవం మెండుగా ఉందని ఆయన గుర్తు చేశారు. "న్యూజిలాండ్ బౌలింగ్ విభాగం చాలా బలంగా కనిపిస్తోంది. ఇటీవల వారు భారత్‌లో టెస్ట్ సిరీస్ గెలిచి ఉండటం వారికి ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. ఇక్కడి స్పిన్ ట్రాక్‌లపై వారికి అవగాహన ఉంది. భారత్ భారీ జనాభా కలిగిన దేశం కాబట్టి, ఆ ఒత్తిడి మైదానంలో ఆటగాళ్లపై ప్రభావం చూపుతుంది" అని గుల్ పేర్కొన్నారు.

56
గ్లెన్ ఫిలిప్స్ ఆసక్తికర వ్యాఖ్యలు
Image Credit : X@BCCI

గ్లెన్ ఫిలిప్స్ ఆసక్తికర వ్యాఖ్యలు

న్యూజిలాండ్ ఆల్ రౌండర్ గ్లెన్ ఫిలిప్స్ కూడా ఫైనల్ ముందు స్పందించారు. భారత ప్రతిభను ఆయన ప్రశంసించారు. "భారత్ దగ్గర అపారమైన టాలెంట్ ఉంది, వారు ఒకేసారి రెండు మూడు బలమైన జట్లను తయారు చేయగలరు. మా దేశ జనాభా తక్కువ కాబట్టి మాకు పరిమితమైన వనరులే ఉన్నాయి. కానీ మేము కలిసికట్టుగా పోరాడి విజయం సాధిస్తాం" అని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుత టోర్నీలో భారత్ ఎదుర్కొన్న ఏకైక ఓటమి కూడా ఇదే అహ్మదాబాద్ స్టేడియంలో దక్షిణాఫ్రికాపై రావడం గమనార్హం.

66
సూర్యకుమార్ సేన చరిత్ర సృష్టిస్తుందా?
Image Credit : X@BCCI

సూర్యకుమార్ సేన చరిత్ర సృష్టిస్తుందా?

సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టు వరుసగా రెండోసారి టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను ముద్దాడాలని పట్టుదలతో ఉంది. గత ఏడాది కాలంగా టీమ్ ఇండియా అద్భుతమైన ఫామ్‌లో ఉంది. అయితే, అక్తర్, గుల్ చెప్పినట్లుగా 150 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలను మోస్తూ, పాత గాయాలను అధిగమించి భారత్ విశ్వవిజేతగా నిలుస్తుందా? లేక న్యూజిలాండ్ మొదటిసారి టీ20 ప్రపంచకప్ నెగ్గి చరిత్ర సృష్టిస్తుందా? అనేది ఆదివారం రాత్రి 7 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌తో తేలిపోనుంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఐసీసీ టీ20 ప్రపంచ కప్
క్రీడలు
క్రికెట్
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Abhishek Sharma: ఒకేఒక్క ఇన్నింగ్స్ తో 7 రికార్డులు బద్దలు కొట్టిన అభిషేక్ శర్మ
Recommended image2
IND vs AFG 3rd T20: ఆఫ్ఘన్‌ను చిత్తుగా ఓడించిన టీమిండియా.. 127 పరుగులతో భారీ విజయం
Recommended image3
దంచుడే.. దంచుడు.. 30 బంతుల్లోనే సెంచ‌రీతో అభిషేక్ శర్మ విధ్వంసం
Related Stories
Recommended image1
T20 World Cup టెన్షన్ లో భారత్.. న్యూజిలాండ్‌పై బుమ్రా మ్యాజిక్ పనిచేయదా? కారణమేంటి?
Recommended image2
T20 World Cup 2026 Final : సూర్య భాయ్ స్కెచ్ రెడీ.. కివీస్‌పై భారత్ గెలిచే ఛాన్స్ ఎంత?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved