- Home
- International
- Baba vanga tsunami: జపాన్ బాబా వంగా జ్యోతిష్యం నిజమవుతోందా.? సునామీని ముందుగానే..
Baba vanga tsunami: జపాన్ బాబా వంగా జ్యోతిష్యం నిజమవుతోందా.? సునామీని ముందుగానే..
రష్యా కమ్చట్కా ద్వీపకల్ప తీరానికి సమీపంలో బుధవారం భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. ఈ ప్రకంపనలతో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. రష్యా, జపాన్‌తో పాటు మరికొన్ని దేశాలకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు.

సునామీ హెచ్చరికలు
రష్యా కమ్చట్కా ద్వీపకల్ప తీరానికి సమీపంలో బుధవారం భారీ భూకంపం సంభవించింది. ఈ ప్రకంపనలతో వచ్చిన సునామీ అలలు జపాన్ ఉత్తర ద్వీపం హొక్కైడో, రష్యా కురిల్ ద్వీపాలకు తాకాయి. ఈ సహజ విపత్తుకు సంబంధించిన అంశాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘జపాన్ బాబా వాంగా’ పేరుతో ప్రసిద్ధురాలైన ర్యో తత్సుకీ జోస్యంలో ఈ సునామీ గురించి ప్రస్తావించారు. ‘ద ఫ్యూచర్ ఐ సా (నేను దర్శించిన భవిష్యత్తు)’ పేరుతో రాసిన పుస్తకంలో ఆమె ఈ మేరకు ఎప్పుడో హెచ్చరించారని భవిష్యవాణిని గుర్తు చేస్తోంది.
1999లో చెప్పిన భవిష్యవాణి
‘జపాన్ కొత్త బాబా వంగా’గా పేరొందిన ర్యో తత్సుకి 1999లో ప్రచురించిన తన మంగా పుస్తకం “ది ఫ్యూచర్ ఐ సా”లో ఒక విశేష జోస్యం చెప్పింది. ఆమె భవిష్యవాణి ప్రకారం.. “2025 జూలై 5న జపాన్ దక్షిణ సముద్రాలు మరిగిపోతాయి” అని పేర్కొన్నారు. అయితే ఆ సమయంలో ఎలాంటి భూకంపం రాలేదు. కానీ ఇదే నెలలో 8.7 తీవ్రతతో వచ్చిన భూకంపం, ఆపై సునామీ సంభవించడం ఆమె చెప్పిన హెచ్చరిక సమయాన్ని గుర్తు చేసింది.
రష్యా కమ్చట్కా భూకంపం వివరాలు
బుధవారం ఉదయం 8.7 తీవ్రత గల భూకంపం రష్యా కమ్చట్కా ద్వీపకల్ప తీరంలో వచ్చింది. ఆ తర్వాత అమెరికా జియోలాజికల్ సర్వే (USGS) దీనిని 8.8 మాగ్నిట్యూడ్‌గా సవరించింది. ఇది ఆ ప్రాంతంలో 1952 తర్వాత వచ్చిన అతిపెద్ద భూకంపంగా రికార్డు అయ్యింది. ఈ ప్రకంపనల కారణంగా సముద్రంలో ఏర్పడిన అలలు జపాన్ హొక్కైడో, రష్యా కురిల్ ద్వీపాలకు దూసుకెళ్లాయి.
తత్సుకి గత జోస్యాలు నిజమైన సందర్భాలు
- ర్యో తత్సుకి వంగా పుస్తకంలో చెప్పిన పలు జోస్యాలు గతంలో నిజమయ్యాయి. అందులో ముఖ్యమైనవి:
- ప్రిన్సెస్ డయానా మరణం
- గాయకుడు ఫ్రెడీ మర్క్యూరీ మరణం
- 2020 దశకంలో కోవిడ్-19లాంటి మహమ్మారి వ్యాప్తి
జోస్యాలపై ప్రజల్లో చర్చ
ఇప్పుడు జరిగిన రష్యా భూకంపం, జపాన్ తీరాలను తాకిన సునామీతో ర్యో తత్సుకి పేరు మళ్లీ చర్చలోకి వచ్చింది. జూలై 5న కాకపోయినా జూలై నెలలోనే సంభవించిన ఈ విపత్తు ఆమె భవిష్యవాణిని నిజం చేసిందన్న చర్చ సోషల్ మీడియాలో నడుస్తోంది.