MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • International
  • Iran Israel war: ప్ర‌పంచం ఎప్పుడూ చూడని దాడులు చేస్తాం.. ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్

Iran Israel war: ప్ర‌పంచం ఎప్పుడూ చూడని దాడులు చేస్తాం.. ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్

Iran Israel war: అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన సైనిక దాడుల్లో ఇరాన్ సుప్రీం ఖ‌మేనీ మరణించినట్టు ఇరాన్ అధికారిక వర్గాలు ధృవీకరించాయి. ఈ ఘటనతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు ఒక్కసారిగా పెరిగాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది.

2 Min read
Author : Narender Vaitla
Published : Mar 01 2026, 11:13 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఖమేనీ ప్రాణాలు కోల్పోయినట్లు ధృవీకరణ
Image Credit : Getty

ఖమేనీ ప్రాణాలు కోల్పోయినట్లు ధృవీకరణ

అమెరికా–ఇజ్రాయెల్ దళాలు లక్ష్యంగా పెట్టుకున్న ప్రత్యేక ఆపరేషన్‌లో ఖమేనీ మరణించినట్లు ఇరాన్ ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ దాడుల్లో ఖమేనీతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక మీడియా తెలిపింది. ఖమేనీ చాలాకాలంగా అమెరికా, ఇజ్రాయెల్ దేశాలకు ప్రధాన వ్యూహాత్మక ప్రత్యర్థిగా గుర్తింపు పొందారు. ఆయనపై జరిగిన ఈ దాడిని ఇరాన్ నాయకత్వంపై నేరుగా జరిగిన దాడిగా భావిస్తున్నారు.

25
40 రోజుల సంతాపం ప్రకటించిన ఇరాన్ ప్రభుత్వం
Image Credit : Getty

40 రోజుల సంతాపం ప్రకటించిన ఇరాన్ ప్రభుత్వం

ఖమేనీ మరణాన్ని దేశానికి తీరని లోటుగా పేర్కొన్న ఇరాన్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా 40 రోజుల అధికారిక సంతాపాన్ని ప్రకటించింది. ఖమేనీని “విప్లవ నాయకుడు”గా అభివర్ణిస్తూ ప్రభుత్వ వర్గాలు నివాళులు అర్పించాయి. ఖమేనీ హత్యను మహా నేరంగా పేర్కొన్న ఇరాన్ కేబినెట్, దీనికి ధీటైనా ప్రతిస్పందన తప్పదని స్పష్టం చేసింది. సరైన సమాధానం ఇచ్చే వరకు వెనక్కి తగ్గబోమని హెచ్చరించింది.

Related Articles

Related image1
Ali Khamenei: నడి రోడ్డుపై 16 ఏళ్ల యువతి ఉరితీత.. ఖమేనీ మరణం ఆ కర్మ ఫలితమేనా.?
Related image2
Iran Israel War: ఇరాన్ సుప్రీం లీడ‌ర్ ఖ‌మేనీ చనిపోయాడు.. ట్రంప్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న, ఇరాన్ మీడియా సైతం
35
ప్రతీకారం తప్పదన్న రివల్యూషనరీ గార్డ్స్ హెచ్చరిక
Image Credit : X-@_Bruce__007

ప్రతీకారం తప్పదన్న రివల్యూషనరీ గార్డ్స్ హెచ్చరిక

ఇరాన్ సైనిక వ్యవస్థలో కీలకమైన ఇస్లామిక్ రివ‌ల్యూష‌న‌రీ గార్డ్ కార్ప్స్ ఖమేనీ మృతిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ సుప్రీం నేతను హత్య చేసిన వారికి కఠిన పరిణామాలు తప్పవని హెచ్చరించింది. ఇజ్రాయెల్, అమెరికా స్థావరాలపై భారీ స్థాయిలో ప్రతీకార దాడులకు సిద్ధమవుతున్నట్లు సంకేతాలు ఇచ్చింది. త్వరలోనే ప్రపంచం ఎప్పుడూ చూడని విధంగా దాడులు జరగవచ్చని పేర్కొంది.

45
కీలక నేతల మరణం… కొత్త కమాండర్ నియామకం
Image Credit : Asianet News

కీలక నేతల మరణం… కొత్త కమాండర్ నియామకం

ఈ దాడుల్లో ఖమేనీకి సన్నిహితంగా ఉన్న సీనియర్ నేత అలి షమ్ఖానితో పాటు ఐఆర్‌జీసీ చీఫ్ మొహమ్మద్ పాక్‌పూర్ కూడా మరణించినట్లు ఇరాన్ వెల్లడించింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఐఆర్‌జీసీకి కొత్త కమాండర్‌గా మాజీ రక్షణ మంత్రి అహ్మ‌ద్ వాహిదిని నియమించారు. సైనిక చర్యలు మరింత కఠినంగా కొనసాగుతాయని సంకేతాలు కనిపిస్తున్నాయి.

55
మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న యుద్ధ భయం
Image Credit : Social Media

మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న యుద్ధ భయం

ఖమేనీ మరణంతో అమెరికా–ఇజ్రాయెల్–ఇరాన్ మధ్య ఘర్షణ మరింత తీవ్రమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇరాన్ ప్రతీకార దాడులు జరిపితే పూర్తి స్థాయి యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం సైనిక కదలికలు వేగంగా పెరుగుతున్నాయి. ఇరాన్ ప్రకటించిన ప్రతీకార చర్యలు ఎప్పుడు ప్రారంభమవుతాయన్న దానిపై ప్రపంచం దృష్టి సారించింది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
యుద్ధం
ప్రపంచం

Latest Videos
Recommended Stories
Recommended image1
Khamenei Death: లైవ్‌లో కన్నీళ్లు పెట్టుకున్న యాంకర్.. ఖమేనీ మరణవార్త ప్రకటిస్తూ భావోద్వేగం
Recommended image2
Ali Khamenei: నడి రోడ్డుపై 16 ఏళ్ల యువతి ఉరితీత.. ఖమేనీ మరణం ఆ కర్మ ఫలితమేనా.?
Recommended image3
Flour Price: కిలో గోధుమ‌ పిండి ధ‌ర రూ. 200... చుక్క‌లు చూపిస్తోన్న ద్ర‌వ్యోల్బణం
Related Stories
Recommended image1
Ali Khamenei: నడి రోడ్డుపై 16 ఏళ్ల యువతి ఉరితీత.. ఖమేనీ మరణం ఆ కర్మ ఫలితమేనా.?
Recommended image2
Iran Israel War: ఇరాన్ సుప్రీం లీడ‌ర్ ఖ‌మేనీ చనిపోయాడు.. ట్రంప్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న, ఇరాన్ మీడియా సైతం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved