- Home
- Districts News
- Hyderabad
- Tirumala: హైదరాబాద్ టూ తిరుమల ఫ్లైట్ జర్నీ.. ఒక్క రోజులో శ్రీవారి దర్శనం చేసుకొని రావొచ్చు. బెస్ట్ టూర్ ప్యాకేజీ
Tirumala: హైదరాబాద్ టూ తిరుమల ఫ్లైట్ జర్నీ.. ఒక్క రోజులో శ్రీవారి దర్శనం చేసుకొని రావొచ్చు. బెస్ట్ టూర్ ప్యాకేజీ
కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటారు. అయితే ఒక్క రోజులో దర్శనం చేసుకుని తిరిగి రావడం కష్టం. అలాంటి వారి కోసమే తెలంగాణ టూరిజం ప్రత్యేక టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది.

తెలంగాణ టూరిజం స్పెషల్ ప్యాకేజీ
తెలంగాణ రాష్ట్రంలోని తిరుమల శ్రీవారి భక్తులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. టూరిజం శాఖ ఆధ్వర్యంలో ఒక్కరోజులో తిరుమల వెళ్లి, స్వామివారిని దర్శించుకుని అదే రోజు తిరిగి వచ్చే ప్రత్యేక టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకువచ్చింది. సాధారణంగా రెండు రోజుల సమయం తీసుకునే ఈ యాత్రను తెలంగాణ టూరిజం ఒక్క రోజులోనే పూర్తి చేయనుంది.
టూర్ వివరాలు ఇలా ఉంటాయి
ఈ ప్యాకేజీ ప్రకారం, ప్రయాణం ఉదయం 6.55 గంటలకు హైదరాబాద్ విమానాశ్రయం నుంచి ప్రారంభమవుతుంది. ప్రయాణికులు రేణిగుంటకు ఫ్లయిట్‌లో చేరి, అక్కడి నుంచి కారులో తిరుపతి హోటల్‌కు తీసుకెళ్తారు. అక్కడ ఫ్రెషప్ అయ్యాక తిరుమలకు వెళ్లి మధ్యాహ్నం 1 గంటలోపు శ్రీవారి దర్శనాన్ని పూర్తి చేస్తారు. తిరిగి తిరుపతికి చేరుకుని హోటల్‌లో విశ్రాంతి తీసుకునే అవకాశం ఉంటుంది.
పద్మావతి అమ్మవారి దర్శనం
తిరుమల దర్శనం అనంతరం ప్రయాణికులు తిరుచానూర్‌కు వెళ్లి పద్మావతి అమ్మవారిని దర్శించుకునే అవకాశం ఉంటుంది. ఈ కార్యక్రమం ముగిశాక తిరిగి రేణిగుంట విమానాశ్రయానికి తీసుకెళ్లి సాయంత్రం 6.35కు హైదరాబాదు రిటర్న్ ఫ్లైట్‌కు ఎక్కిస్తారు. రాత్రి 7.45కి హైదరాబాద్ చేరుకుంటారు.
ప్యాకేజీ ధరలు
ఈ వన్ డే టూర్ ధర ఒక్కొక్కరికి రూ. 12,499గా నిర్ణయించారు. ఇందులో విమాన టికెట్, కారులో ప్రయాణం, తిరుమల, తిరుచానూర్‌లో ప్రత్యేక దర్శనాల ఏర్పాట్లు, హోటల్ ఫ్రెషప్ ఫెసిలిటీ అన్నీ ఉంటాయి. భక్తుల సమయాన్ని ఆదా చేయడంతో పాటు కంఫర్ట్‌ను కూడా అందించడమే ఈ ప్యాకేజీ ప్రత్యేకత.
రెండు రోజుల టూర్ ప్యాకేజీ కూడా అందుబాటులో
వన్ డే టూర్‌తో పాటు, రెండు రోజుల టూర్ ప్యాకేజీ కూడా అందుబాటులో ఉంది. ఈ ప్యాకేజీ ఖర్చు రూ. 15,499గా నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం తెలంగాణ టూరిజం వెబ్‌సైట్‌ను సందర్శించండి.