MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Telangana
  • Half Day Schools : తెలుగు విద్యార్థులు ఎగిరిగంతేసే వార్త.. ఫిబ్రవరి 19 నుండే ఆ స్కూళ్లకు ఒంటిపూట

Half Day Schools : తెలుగు విద్యార్థులు ఎగిరిగంతేసే వార్త.. ఫిబ్రవరి 19 నుండే ఆ స్కూళ్లకు ఒంటిపూట

Half Day Schools : తెలంగాణ విద్యాశాఖ ఒంటిపూట బడులు, సమ్మర్ హాలిడేస్ పై క్లారిటీ ఇచ్చింది. రాష్ట్రంలోని ముస్లిం మైనారిటీ విద్యాసంస్థలకు కాస్త ముందుగా, ఇతర స్కూళ్లకు తర్వాత ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి.

2 Min read
Author : Arun Kumar P
Published : Feb 17 2026, 04:56 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
తెలుగు విద్యార్థులకు గుడ్ న్యూస్
Image Credit : Getty

తెలుగు విద్యార్థులకు గుడ్ న్యూస్

Half Day Schools : ఇక శీతాకాలం ముగిసినట్లే... ప్రస్తుతం చలి పూర్తిగా తగ్గిపోయి ఉక్కపోత మొదలయ్యింది. తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి... అప్పుడే ఎండలు మండిపోతున్నాయి. ఫిబ్రవరిలోనే పరిస్థితి ఇలా ఉందంటే మార్చిలో మరింత దారుణంగా ఉంటుంది... అందుకే విద్యార్థులకు ఈ ఎండలనుండి ఉపశమనం కల్పించే నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. ఎప్పటినుండి ఒంటిపూట బడులు నిర్వహించాలో ప్రభుత్వం ప్రకటించింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
తెలంగాణలో హాఫ్ డే స్కూల్స్ ఎప్పట్నుంచి..?
Image Credit : Getty

తెలంగాణలో హాఫ్ డే స్కూల్స్ ఎప్పట్నుంచి..?

తెలంగాణలో ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ విద్యాసంస్థలన్నీ మార్చి 16 నుండి కేవలం ఒకేపూట నడుస్తాయని విద్యాశాఖ ప్రకటించింది. ఉదయం తొందరగా ప్రారంభమై మధ్యాహ్నానికి క్లాసులు పూర్తిచేయాలని.. ఇందుకు తగినట్లు టైమ్ టేబుల్ రెడీ చేసుకోవాలని స్కూల్ యాజమాన్యాలకు ఆదేశించింది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు మాత్రమే స్కూళ్లు నడుస్తాయని... ఆ తర్వాత విద్యార్థులు ఇంటికి వెళ్లిపోవచ్చని పేర్కొంది.

అయితే మార్చి 14 నుండి తెలంగాణలో పదో తరగతి (SSC) పరీక్షలు ప్రారంభం అవుతాయి. ఈ నేపథ్యంలో పరీక్షా కేంద్రాలున్న స్కూళ్లకు మాత్రం టైమ్ టేబుల్ భిన్నంగా ఉంటుంది... వీరు మధ్యాహ్నం 1 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు క్లాసులు నిర్వహించుకోవచ్చని విద్యాశాఖ తెలిపింది.

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం యధావిధిగా కొనసాగుతుందని విద్యాశాఖ అధికారులు తెలిపారు. సాధారణంగా స్కూల్ వదలగానే అంటే 12:30 గంటలకు మధ్యాహ్న భోజనం అందిస్తారని.. పదో తరగతి ఎగ్జామ్ సెంటర్ కలిగిన స్కూల్స్ లో భోజనం తర్వాత క్లాసులు ప్రారంభం అవుతాయని అధికారులు తెలిపారు.

35
రంజాన్ నెలలో విద్యార్థులకు ప్రత్యేక వెసులుబాటు..
Image Credit : Getty

రంజాన్ నెలలో విద్యార్థులకు ప్రత్యేక వెసులుబాటు..

మరో రెండ్రోజుల్లో అంటే ఫిబ్రవరి 19 నుండి రంజాన్ నెల ప్రారంభం అవుతుంది... ఈ నెలంతా ముస్లింలు ఉపవాస దీక్ష చేపడుతుంటారు. ఈ నేపథ్యంలో తెలంగాణలోని ముస్లిం మైనారిటీ, ఉర్దూ మీడియం స్కూల్స్, కాలేజీల విద్యార్థులకు ప్రత్యేక వెసులుబాటు కల్పిస్తోంది ప్రభుత్వం. ఈ నెలరోజులు (ఫిబ్రవరి 19 నుండి మార్చి 20 వరకు) ఉర్దూ మీడియం విద్యాసంస్థలు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 1.30 గంటల వరకు మాత్రమే నడుస్తాయని ప్రకటించింది. మార్చి 20 తర్వాత ఉర్దూ మీడియం విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ వెల్లడించారు.

45
సమ్మర్ హాలిడేస్ ఎప్పటినుండి ఎప్పటివరకు..
Image Credit : Getty

సమ్మర్ హాలిడేస్ ఎప్పటినుండి ఎప్పటివరకు..

తెలంగాణలో ఈసారి వేసవి సెలవులు ఏప్రిల్ చివర్లో ప్రారంభం అవుతాయని విద్యాశాఖ ప్రకటించింది. ఏప్రిల్ 24 నుండి జూన్ 11 వరకు అన్ని విద్యాసంస్థలకు సెలవులు ఉంటాయని వెల్లడించింది... అంటే దాదాపు రెండు నెలలు వేసవి సెలవులు ఉండనున్నాయి. జూన్ 12న స్కూళ్లు రీఓపెన్ అవుతాయని... 2026–27 నూతన విద్యాసంవత్సరం ప్రారంభం అవుతుందని తెలంగాణ విద్యాశాఖ ప్రకటించింది.

55
ఉద్యోగులకు రంజాన్ నెలలో ప్రత్యేక అనుమతి...
Image Credit : pixabay

ఉద్యోగులకు రంజాన్ నెలలో ప్రత్యేక అనుమతి...

రంజాన్ నెలలో ముస్లిం ఉద్యోగులు కూడా ఉపవాస దీక్షలో ఉంటారు... కాబట్టి వీరికి ప్రత్యేక వెసులుబాటు కల్పిస్తుంటాయి తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు. తెలంగాణతో పాటు ఆంధ్ర ప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగాలు చేసే ముస్లింలు ఫిబ్రవరి 19 నుండి మార్చి 20 వరకు సాయంత్రం ఓ గంట ముందుగానే ఆఫీసులు, పని స్థలాల నుండి వెళ్లిపోవచ్చు... ఇలా ప్రార్థన చేసుకునేందుకు, ఉపవాసాన్ని విరమించేందుకు అవకాశం కల్పిస్తున్నారు. ముస్లిం ఉద్యోగులు మతపరమైన ఆచారాలు నిర్వహించుకోవడానికి ఈ అవకాశం కల్పిస్తున్నాయి తెలుగు ప్రభుత్వాలు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
విద్య
భారతదేశంలో ప్రభుత్వ సెలవులు
తెలంగాణ
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
హైదరాబాద్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bank Holidays : సెప్టెంబర్ 25 నుంచి 30 వరకు బ్యాంకులు బంద్‌.. ఏరోజు, ఎందుకు సెలవు?
Recommended image2
Farmer ID: రైతులకు బిగ్ అలర్ట్.. పీఎం కిసాన్, రైతు భరోసా ఆగిపోవద్దంటే వెంటనే ఇలా చేయండి
Recommended image3
Heavy Rains Alert: బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. ఈ ప్రాంతాల్లో వారం రోజులు వర్షాలే వర్షాలు
Related Stories
Recommended image1
ఉద్యోగులు, విద్యార్థులు ఎగిరిగంతేసే న్యూస్.. 2026 లో ఏకంగా 49 సెలవులు, పూర్తి హాలిడే లిస్ట్..!
Recommended image2
Public Holidays 2026 : రాబోయే సంవత్సరంలో సెలవుల సందడి.. నెలనెలా లాంగ్ వీకెండ్లు !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved