MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Telangana
  • హైదరాబాద్ శివారులో మరో ఆదిభట్ల రెడీ, రెండువేల కోట్లతో స్మార్ట్ సిటీ.. భవిష్యత్ లో రియల్ బూమ్ ఖాయం

హైదరాబాద్ శివారులో మరో ఆదిభట్ల రెడీ, రెండువేల కోట్లతో స్మార్ట్ సిటీ.. భవిష్యత్ లో రియల్ బూమ్ ఖాయం

హైదరాబాద్ సమీపంలో కేంద్ర ప్రభుత్వం NIMZ పేరిట భారీ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ కొనసాగుతోంది. ఇది పూర్తయితే ఆ ప్రాంతం మరో ఆదిభట్ల కావడం ఖాయం. ఈ స్థాయిలో డెవలప్ కాబోయే ప్రాంతమేదో తెలుసా?  

2 Min read
Author : Arun Kumar P
| Updated : Feb 19 2026, 10:08 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
జహిరాబాద్ లో రియల్ బూమ్
Image Credit : Gemini AI

జహిరాబాద్ లో రియల్ బూమ్

Hyderabad : తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ కేంద్రంగా అభివృద్ధి సాగుతోంది... ఇప్పటికే నగరానికి చుట్టుపక్కల జరగాల్సిన డెవలప్మెంట్ జరిగిపోయింది. ఇక భవిష్యత్ లో నగరానికి 50-100 కిలోమీటర్ల దూరంవరకు అభివృద్ధి విస్తరించనుంది... ఇందుకు తగినట్లుగానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్లాన్స్ చేస్తున్నాయి. ఇందులో భాగంగానే సంగారెడ్డి జిల్లా జహిరాబాద్ ను మరో ఆదిభట్ల, పటాన్ చెరు స్థాయిలో డెవలప్ చేసేందుకు ప్రభుత్వం సిద్దమయ్యింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
స్మార్ట్ సిటీగా జహిరాబాద్...
Image Credit : Gemini AI

స్మార్ట్ సిటీగా జహిరాబాద్...

కేంద్ర ప్రభుత్వం జహిరాబాద్ ప్రాంతంలో భారీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కు ప్రణాళికలు రూపొందించింది... NIMZ (నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ జోన్) ను ప్రకటించింది. తెలంగాణలో పెట్టుబడులకు ముందుకు వచ్చే వ్యాపారసంస్థలకు ఈ ప్రాంతంలో భూములు కేటాయించనున్నారు... ఇందుకోసం ఇప్పటికే భూసేకరణ ప్రారంభించారు. మొత్తం 12, 000 ఎకరాలకు పైగా భూమిని నిమ్జ్ ప్రాజెక్టులో భాగంగా సేకరిస్తున్నారు.

అయితే పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలంగా మౌలిక సదుపాయాలను కూడా కల్పిస్తోంది ప్రభుత్వం. ఇందుకోసమే జహిరాబాద్ ను ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీగా ప్రకటించింది. జాతీయ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి కార్యక్రమం (NICDP) కింద ఏకంగా 3,245 ఎకరాల్లో రూ.2,361 కోట్ల అంచనా వ్యయంతో స్మార్ట్ సిటీని అభివృద్ధి చేస్తోంది. ఇది పూర్తయితే జహిరాబాద్ రూపురేఖలు పూర్తిగా మారిపోతాయి.

36
జహిరాబాద్ లో రియల్ బూమ్ ఖాయం..
Image Credit : Gemini AI

జహిరాబాద్ లో రియల్ బూమ్ ఖాయం..

ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ, పరిశ్రమల ఏర్పాటు కోసం NIMZ ప్రాజెక్టు పనులు శరవేగంగా సాగుతుండటంతో జహిరాబాద్ పై రియల్టర్ల కన్ను పడింది. భవిష్యత్ లో ఈ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ బూమ్ ను ముందుగానే గుర్తించి ఇప్పుడే పెట్టుబడులు పెడుతున్నారు.

కేవలం పదేళ్ళకింద రెండుమూడు లక్షలు పలికిన ఎకరం భూమి నిమ్జ్ రాకతో కోటికి చేరింది. భవిష్యత్ లో భూముల ధరలకు రెక్కలువచ్చే అవకాశాలున్నాయి... అందుకే జహిరాబాద్ లో పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నారు. హైదరాబాద్-ముంబై హైవే కూడా జహిరాబాద్ లో రియల్ బూమ్ కు మరో కారణం అవుతోంది.

46
NIMZ అంటే ఏమిటి?
Image Credit : our own

NIMZ అంటే ఏమిటి?

నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ జోన్ (NIMZ) అనేది భారీ స్థాయిలో పరిశ్రమలు, తయారీ యూనిట్లు, లాజిస్టిక్స్, నివాస ప్రాంతాలు అన్నీ ఒకే చోట అభివృద్ధి చేసే మెగా ఇండస్ట్రియల్ జోన్. ఇది "మేక్ ఇన్ ఇండియా" కార్యక్రమంలో భాగంగా దేశంలో తయారీ రంగాన్ని బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కీలక పథకం.

జహీరాబాద్ NIMZ ప్రాజెక్ట్  వేల ఎకరాల్లో అభివృద్ధి చేయబడుతోంది. ఇందులో ఆటోమొబైల్, ఫార్మా, ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్ట్రానిక్స్, టెక్స్ టైల్ వంటి విభిన్న రంగాలకు చెందిన పరిశ్రమలు స్థాపించడానికి అవకాశాలు కల్పిస్తున్నారు. పరిశ్రమలతో పాటు నివాస సముదాయాలు, విద్యా సంస్థలు, ఆసుపత్రులు, రోడ్లు, నీటి సరఫరా, విద్యుత్ వంటి పూర్తి మౌలిక వసతులు కూడా అభివృద్ధి చేయబడతాయి.

56
స్మార్ట్ సిటీలో ఏమేం వస్తాయి..?
Image Credit : Gemini AI

స్మార్ట్ సిటీలో ఏమేం వస్తాయి..?

జహీరాబాద్ స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్‌ను అత్యాధునిక సదుపాయాలతో అభివృద్ధి చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్ ముఖ్య లక్షణాలు ఇలా ఉన్నాయి 

ప్రపంచ స్థాయి ఇండస్ట్రియల్ పార్కులు

స్మార్ట్ రోడ్లు, ట్రాఫిక్ మేనేజ్‌మెంట్

డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, హైస్పీడ్ కనెక్టివిటీ

గ్రీన్ ఎనర్జీ, సస్టైనబుల్ డెవలప్‌మెంట్

ఇండస్ట్రియల్, రెసిడెన్షియల్ జోన్ల సమగ్ర అభివృద్ధి

లాజిస్టిక్స్, గిడ్డంగుల సదుపాయాలు

ఈ ప్రాజెక్ట్ పూర్తయితే జహీరాబాద్ ప్రాంతం హైదరాబాద్‌కు ప్రత్యామ్నాయ పారిశ్రామిక కేంద్రంగా ఎదగనుంది.

66
భారీ పెట్టుబడులు, ఉద్యోగావకాశాలు
Image Credit : Generated by google gemini AI

భారీ పెట్టుబడులు, ఉద్యోగావకాశాలు

జహీరాబాద్ స్మార్ట్ సిటీ, NIMZ ప్రాజెక్ట్‌ల ద్వారా వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. పెద్ద కంపెనీలు, అంతర్జాతీయ సంస్థలు ఈ ప్రాంతంలో తమ యూనిట్లను స్థాపించే అవకాశాలు ఉన్నాయి. దీనివల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది ఉద్యోగాలు సృష్టించబడతాయి. స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు పెరగడంతో పాటు చిన్న వ్యాపారాలు, సేవారంగం కూడా అభివృద్ధి చెందుతుంది. మొత్తం ప్రాంతం ఆర్థికంగా బలపడుతుంది.

జహీరాబాద్ స్మార్ట్ సిటీ, NIMZ ప్రాజెక్ట్‌లు తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే ప్రముఖ ఇండస్ట్రియల్ హబ్‌గా మార్చే సామర్థ్యం కలిగివున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ ఐటీ హబ్‌గా ఉన్న నేపథ్యంలో, ఈ ప్రాజెక్ట్‌ల ద్వారా తయారీ రంగం కూడా వేగంగా అభివృద్ధి చెందుతుంది. మొత్తంగా చూస్తే జహీరాబాద్ ప్రాంతం భవిష్యత్తులో భారీ పారిశ్రామిక కేంద్రంగా మారి తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు కీలకంగా మారనుంది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
తెలంగాణ
స్థిరాస్తి
హైదరాబాద్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వ్యాపారం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bank Holidays : సెప్టెంబర్ 25 నుంచి 30 వరకు బ్యాంకులు బంద్‌.. ఏరోజు, ఎందుకు సెలవు?
Recommended image2
Farmer ID: రైతులకు బిగ్ అలర్ట్.. పీఎం కిసాన్, రైతు భరోసా ఆగిపోవద్దంటే వెంటనే ఇలా చేయండి
Recommended image3
Heavy Rains Alert: బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. ఈ ప్రాంతాల్లో వారం రోజులు వర్షాలే వర్షాలు
Related Stories
Recommended image1
Real estate: హైద‌రాబాద్‌లోని ఈ శివారు ప్రాంతం మ‌రో కూక‌ట్‌ప‌ల్లి కావ‌డం ఖాయం.. ఇప్పుడే కొనేయండి
Recommended image2
Real estate: ఏపీలోని ఈ ప్రాంతం మ‌రో సైబ‌ర్ సిటీ కావ‌డం ఖాయం.. ఇవే సాక్ష్యాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved