MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Life
  • Health
  • Chicken Biryani: 30 నిమిషాల్లో ఘుమఘుమలాడే పొట్లం బిర్యానీ.. ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే..

Chicken Biryani: 30 నిమిషాల్లో ఘుమఘుమలాడే పొట్లం బిర్యానీ.. ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే..

Chicken Biryani: రెగ్యూలర్ గా చేసే దమ్ బిర్యానీ కాకుండా ఇలా చేసుకుని తినండి. బిర్యానీని సగం కుక్ చేసి చేసే పొట్లం బిర్యానీ ఇది. దీని అరోమాకే సగం కడుపునిండిపోద్ది. ఈజీగా ఎలా చేయాలో ఇక్కడ రెసిపీ చూద్దాం. 

2 Min read
Author : Nandini Arava
Published : Jun 09 2026, 02:23 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ఎప్పుడూ అదే బిర్యానీ ఏం తింటారు?
Image Credit : vismai food/ youtube

ఎప్పుడూ అదే బిర్యానీ ఏం తింటారు?

ఎప్పుడూ అదే బిర్యానీ ఏం తింటారు? రుచిగా, జ్యూసీగా, చూడగానే తినబుల్ అనేపించేలా ఉండే ఈ బిర్యానీ ట్రై చేసి ఉండండి. మిగతా బిర్యానీలకు గుడ్ బై చెప్పేస్తారు. అంత బాగుంటుంది. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ తినాలనిపించే రుచి, అరోమా, ఘుమఘుమ. బిర్యానీ ఎవరైనా చేస్తారు. కానీ నోటికి రుచిగా చేయడంలోనే ఆ కిక్ ఉంది. అయితే ఈ పొట్లం బిర్యానీ ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ ఉంది. లాగించేయండి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
కావాల్సిన పదార్థాలు
Image Credit : vismai food/ youtube

కావాల్సిన పదార్థాలు

ఆయిల్, టేబుల్ స్పూన్ షాజీరా, 3-4 యాలకులు, 4-5 లవంగాలు, చిన్న ముక్క దాల్చినచెక్క, ఒకటి బిర్యానీ ఆకు. అరకప్పు ఉల్లిపాయ ముక్కలు, 3 పచ్చిమిర్చి, అల్లంవెల్లుల్లి పేస్ట్., రెండున్నర కప్పుల నీళ్లు, రుచికి సరిపడా ఉప్పు. కొంచెం కొత్తిమీర, పుదీనా. కప్పున్నర బాస్మతీ రైస్, స్టార్ పువ్వు, మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకులు, చిన్న ముక్క దాల్చినచెక్క, 4-5 లవంగాలు, 4-5 యాలకులు, కప్ ఉల్లి తరుగు, టేబుల్ స్పూన్ అల్లంవెల్లుల్లి పేస్ట్, అరకేజీ చికెన్, పెరుగు, జీడిపప్పు, కొబ్బరి పాలు, బనానా ఆకు, నెయ్యి. 

36
బిర్యానీ రైస్
Image Credit : visamai food/youtube

బిర్యానీ రైస్

ముందుగా పాన్ లో నూనె వేసి 3-4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడెక్కాక..అందులో టేబుల్ స్పూన్ షాజీరా, 3-4 యాలకులు, 4-5 లవంగాలు, చిన్న ముక్క దాల్చినచెక్క, ఒకటి బిర్యానీ ఆకు వేసి వేయించండి, ఆ తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు, 3 పచ్చిమిర్చి, అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి వేయించండి. అందులో రెండూ ముప్పావు కప్పుల వేడి నీళ్లు వేయండి. ఉప్పు కూడా వేసి మరిగించాక అందులో ఒక్కటిన్నర కప్పు నానబెట్టిన బియ్యం వేసుకోండి. అన్నం పొడపొడిగా ఉండేలా చూసుకోవాలి.

46
చికెన్ గ్రేవీ కోసం
Image Credit : vismai food/ youtube

చికెన్ గ్రేవీ కోసం

పాన్ లో నూనె వేసి స్టార్ పువ్వు, మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకులు, చిన్న ముక్క దాల్చినచెక్క, 4-5 లవంగాలు, 4-5 యాలకులు ఇవన్నీ వేసి పొంగించండి. కప్ ఉల్లి తరుగు, టేబుల్ స్పూన్ అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి వేయించండి. అందులో అరకిలో చికెన్ వేసి కాస్త ఉప్పు వేసి పెద్ద మంట మీద వేపాలి. నీరు ఇగిరి నూనె తేలాక అరకప్పు పెరుగు, పుదీనా, కొత్తిమీర తరుగు, 3-4 పచ్చిమిర్చి వేసి కలపండి. బిర్యానీ మసాలా లేదా గరం మసాలా వేసుకోండి. పక్కన మరో మిక్సీజార్ లో జీడిపప్పు, నీళ్లు వేసి పేస్ట్ చేయండి. ఆ పేస్ట్ వేసి చికెన్ లో వేసి ఉడికించండి.ముప్పావు కప్పు నీళ్లు వేస్తే అంటకుండా ఉడుకుతుంది. అప్పుడు చికెన్ గ్రేవీ అయిపోయాక స్టవ్ కట్టేయండి. ఇప్పుడు అందులో కొబ్బరి పాలు వేసుకుని పక్కన పెట్టుకోండి. 

56
పొట్లం కట్టేయండి
Image Credit : vismai food/ youtube

పొట్లం కట్టేయండి

ఇప్పుడు అరటి ఆకుని కాస్త వేడి చేస్తే మెత్తగా అవుతుంది. అప్పుడు ఎలా అంటే అలా పొట్లం కట్టుకోవడానికి వీలు పడుతుంది. ఇప్పుడు అందులో కాస్త బిర్యానీ రైస్, దానిపై చికెన్ గ్రేవీ, మరో బిర్యానీ రైస్ వేసి ఆపైన వేయించిన ఉల్లిపాయలు, పుదీనా, కొత్తిమీర తరుగు, నెయ్యి వేసి తాడుతో పొట్లం కట్టేయండి.

66
స్టీమర్ లో 10 నిమిషాలు స్టీమ్
Image Credit : vismai food/ youtube

స్టీమర్ లో 10 నిమిషాలు స్టీమ్

వాటిని స్టీమర్ లో 10 నిమిషాలు స్టీమ్ చేయండి. ఆ తర్వాత 10 నిమిషాలు అలానే వదిలేయండి. ఘుమఘుమలాడే పొట్లం బిర్యానీ రెడీ, వేడివేడిగా తింటుంటే ఎంత బాగుంటుందో. ట్రై చేసేయండి. 

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
ఆహారం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Nail Polish: నెయిల్ పాలిష్ వాడితే నిజంగానే క్యాన్సర్ వస్తుందా? మెడికల్ ఎక్స్‌పర్ట్స్ ఏం చెబుతున్నారంటే
Recommended image2
సద్గురు హెల్త్ టిప్స్ : కిడ్నీలో రాళ్లు కరిగించే దివ్యౌషదం ఇదే
Recommended image3
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Related Stories
Recommended image1
Lemon Pickle: లెమన్ పికిల్ ఇలా ఒకసారి ట్రై చేయండి..ఒక్క ముద్దతోనే ఫిదా
Recommended image2
Chandramukhi Chicken Fry: నార్మల్ చికెన్ ఫ్రై బోర్ కొట్టిందా? ఈ చంద్రముఖి చికెన్ ఫ్రై ట్రై చేయండి.. టేస్ట్ అదిరిపోద్ది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved