Teeth Whitening: బొగ్గుతో పళ్లను తోమితే ఏమౌతుంది?
ఇప్పుడైతే రకరకాల కంపెనీల పేరుతో టూత్ పేస్ట్ లు వచ్చాయి. కానీ ఒకప్పుడు బొగ్గుతోనే పళ్లను తోముకునే వారు. పళ్లు కూడా తెల్లగా తలతలా మెరిసిపోయేవ. అసలు పళ్లను బొగ్గుతో తోమితే ఏమౌతుందో తెలుసా?

బొగ్గు
కొంతమంది పళ్లు ఎంత తోమినా పసుపు పచ్చగానే ఉంటాయి. మరికొంతమంది పళ్లు తలతలా తెల్లగా మెరిసిపోతుంటాయి. నిజానికి పళ్లు పచ్చగా కావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా టీ ఎక్కువగా తాగడం, సరిగ్గా పళ్లను తోమకపోవడం, స్మోకింగ్ చేయడం వల్ల దంతాలను గీతలు ఏర్పడటం, పచ్చగా మారడం వంటి సమస్యలు వస్తాయి. ఒకప్పుడైతే పళ్లను తెల్లగా చేయడానికి బొగ్గును వాడేవారు. ఇప్పటికైనా మన అమ్మమ్మలు, నానమ్మలు బొగ్గుతోనే పళ్లను తోముతుంటారు. కానీ మనం మార్కెట్ లో ఉన్న టూత్ పేస్ట్ లను ఉపయోగిస్తున్నాం.
బొగ్గు
ప్రస్తుతం బొగ్గుతో చేసిన టూత్ పేస్ట్ లు కూడా మార్కెట్ లో దొరుకుతున్నాయి. నిజానికి బొగ్గుతో పళ్లను తోముకోవడం వల్ల ఎన్నో లాభాలున్నాయి. దీనివల్ల పళ్లు తెల్లగా కావడమే కాకుండా.. మరెన్నో ప్రయోజనాలు కలుగుతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
దంతాల్లో బ్యాక్టీరియా తొలగిపోతుంది
మీకు తెలుసా? బొగ్గులో మంచి పోషకాలుంటాయి. అలాగే ఇది వర్ణద్రవ్యం, పళ్ల మచ్చలను పోగొట్టడానికి సహాయపడుతుంది. అంతేకాదు బొగ్గుతో పళ్లు తోమితే నోట్లో నుంచి విషాన్ని, బ్యాక్టీరియాను తొలగించడానికి కూడా ఇది గొప్పగా సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
తెల్లని దంతాలు
కొన్ని రకాల ఆహార పదార్థాలను, పానీయాలను రోజూ తీసుకోవడం వల్ల పళ్లపై మరకలు ఏర్పడతాయి. మీరు గనుక దీనికి చికిత్స తీసుకోకపోతే మీ దంతాలు పచ్చగా అవుతాయి. అలాగే దంతాల ఎనామిల్ పై పేరుకుపోతుంది. అయితే బొగ్గు ఈ మరకలను పోగొట్టడానికి సహాయపడుతుంది. అలాగే పళ్లను తెల్లగా చేస్తుంది.
ఎక్కడ దొరుకుతాయి
మీరు ఆఫ్ లైన్ లేదా ఆన్ లైన్ లో ప్రాసెస్ చేసిన బొగ్గును కొనుక్కోవచ్చు. దీనితో మీరు రెండు నిమిషాలు తోమితే సరిపోతుంది. అయితే దీన్ని మీ చిగుళ్లకు అంటుకోనివ్వకండి. ఎదుకంటే ఇది రాపిడిని కలిగిస్తుంది. ఇకపోతే పళ్లను తోమి నీళ్లతో బాగా శుభ్రం చేసుకోవాలి. పేస్ట్ కాకుండా మీరు బొగ్గుపొడిని కూడా ఉపయోగించొచ్చు. మీ దంతాలు సున్నితగా ఉన్నటైతే నేరుగా పొడిని వాడకండి. దీనిని మీరు నీళ్లతో కలిపి మౌత్ వాష్‌గా ఉపయోగించండి. అలాగే రెండు నిమిషాలు బ్రష్ చేయడం, ఉమ్మి వేయడం ద్వారా మౌత్ వాష్‌గా కూడా దీన్ని ఉపయోగించొచ్చు. కానీ తర్వాత మీ నోటిని బాగా కడగడం మర్చిపోకండి. కానీ వెంటనే ఇది మీ పళ్లను తెల్లగా చేస్తునడానికి ఎలాంటి పరిశోధనలు వెల్లడించలేదు.