MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Life
  • Health
  • Hypnic Jerk: నిద్రలో సడెన్ గా జారిపడ్డట్టు అనిపిస్తుందా? ఉలిక్కిపడి లేస్తున్నారా? ఏందుకిలా జరుగుతుంది?

Hypnic Jerk: నిద్రలో సడెన్ గా జారిపడ్డట్టు అనిపిస్తుందా? ఉలిక్కిపడి లేస్తున్నారా? ఏందుకిలా జరుగుతుంది?

Hypnic Jerk:నిద్రలో ఒక్కసారిగా ఉలిక్కిపడి లేస్తున్నారా? ఎత్తులో నుంచి కింద పడ్డట్టు ఫీల్ అవుతున్నారా? ఎందుకు ఇలా జరుగుతుంది. దానికి కారణం ఏంటి? నివారించడానికి ఏం చేయాలి అసలు ఈ పరిస్థితిని ఏమని పిలుస్తారు?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jul 31 2026, 11:12 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
రాత్రి వేళ ఉలిక్కి పడి లేస్తున్నారా?
Image Credit : Gemini AI

రాత్రి వేళ ఉలిక్కి పడి లేస్తున్నారా?

రాత్రి వేళ ప్రశాంతంగా నిద్రపోతున్న సమయంలో హఠాత్తుగా ఎత్తు నుండి కింద పడిపోతున్నట్లు అనిపించి ఉలిక్కిపడి లేచారా? కాలు లేదా చేయి సడన్‌గా కదలడంతో మెలకువ వచ్చిందా? వైద్య పరిభాషలో ఈ పరిస్థితిని 'హిప్నిక్ జర్క్' (Hypnic Jerk) లేదా 'స్లీప్ స్టార్ట్' అని పిలుస్తారు. అసలు ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది. దాని నుంచి బయటపడటానికి ఏం చేయాలి అనే విషయాలను ప్రముఖ వైద్యురాలు డాక్టర్ మల్లిక (Dr. Mallika) తన వీడియో ద్వారా ఈ సమస్యకు గల కారణాలు, నివారణా మార్గాలను స్పష్టంగా వివరించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
హిప్నిక్ జర్క్ అంటే ఏమిటి? ఎందుకు జరుగుతుంది?
Image Credit : Gemini AI

హిప్నిక్ జర్క్ అంటే ఏమిటి? ఎందుకు జరుగుతుంది?

మనం పడుకుని నిద్రపోయినప్పుడు మన మెదడు శరీర కండరాలకు విశ్రాంతి తీసుకోమని (Relax) సంకేతాలను పంపుతుంది. అయితే కొన్నిసార్లు మెదడు కన్ఫ్యూజ్ అయి, శరీరం కింద పడిపోతోందేమోనని భావించి కండరాలను ఒక్కసారిగా సంకోచింపజేస్తుంది (Muscle Contraction). అప్పుడే ఈ సడన్ జర్క్ లేదా జంప్ వస్తుంది. సాధారణంగా ఇది భయపడాల్సిన విషయం కాదు. అయితే కొందరిలో ఇది తరచుగా పునరావృతమవుతుంది.

Related Articles

Related image1
Chicken Egg: కోడి కడుపులో గుడ్డు ఎలా తయారవుతుందో తెలుసా? ఒక్క ఎగ్ కోసం ఎంత టైమ్ పడుతుంది?
Related image2
Sai Pallavi: సీతగా సాయి పల్లవి 3 లుక్స్ వైరల్, అభిమానులు ఏమంటున్నారంటే?
34
తరచుగా రావడానికి ప్రధాన కారణాలు
Image Credit : Chatgpt

తరచుగా రావడానికి ప్రధాన కారణాలు

ఈ ఉలిక్కిపడే సమస్య కొందరిలో ఎక్కువగా రావడానికి ముఖ్యమైన కారణాలు కొన్ని ఉన్నాయి. అందులో మరీ ముఖ్యమైనది అధిక మానసిక ఒత్తిడి (Stress). రోజూవారీ జీవితంలో ఒత్తిడి ఎక్కువగా ఉండటం. సరైన వేళల్లో Lack of Sleep తగినంత సేపు నిద్రపోకపోవడం కారణం కావచ్చు. అంతే కాదు దీనికి మరో ముఖ్య కారణం అయితే.. టీ, కాఫీలు అతిగా తాగడం. మెగ్నీషియం లోపం (Magnesium Deficiency) శరీరానికి మెగ్నీషియం అందకపోవడం కూడా ఇందుకు కారణం.

44
ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలి
Image Credit : Gemini AI

ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలి

ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి డాక్టర్లు కొన్ని సులభమైన చిట్కాలను పాటించాలని సూచిస్తున్నారు. అందులో మరీ ముఖ్యమైనది టీ/కాఫీలు తగ్గించడం. సాయంత్రం 5 గంటల (5 PM) తర్వాత టీ లేదా కాఫీ తాగడం కంప్లీట్‌గా అవాయిడ్ చేయాలి. శరీరంలో మెగ్నీషియం పెంచే అరటిపండ్లు (Bananas), ఆకుకూరలు (Green Leafy Vegetables), గుమ్మడి గింజలు (Pumpkin Seeds) వంటి వాటిని రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి. మరీ ముఖ్యంగా ఒత్తిడి తగ్గించుకోవాలి. ప్రశాంతమైన నిద్ర వాతావరణాన్ని ఏర్పరచుకుని క్రమబద్ధమైన సమయానికి పడుకోవాలి. మానసిక ఒత్తిడిని తగ్గించుకుని, టీ/కాఫీలను అదుపులో ఉంచుకుంటూ మెగ్నీషియం కలిగిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల నిద్రలో వచ్చే ఈ 'హిప్నిక్ జర్క్' సమస్య నుండి సులభంగా ఉపశమనం పొందవచ్చు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
జీవనశైలి
ఆరోగ్యం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Recommended image2
ఆపరేషన్ అయిన వారికి, జ్వరం వచ్చిన వారికి బ్రెడ్ ప్యాకెట్లే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.?
Recommended image3
Street Food: రోడ్డు మీద సమోసాలు, బజ్జీలు ఫాస్ట్ ఫుడ్ తింటున్నారా? నూనె బాగుందో లేదో 10 సెకన్లలో ఎలా గుర్తించాలి?
Related Stories
Recommended image1
Chicken Egg: కోడి కడుపులో గుడ్డు ఎలా తయారవుతుందో తెలుసా? ఒక్క ఎగ్ కోసం ఎంత టైమ్ పడుతుంది?
Recommended image2
Sai Pallavi: సీతగా సాయి పల్లవి 3 లుక్స్ వైరల్, అభిమానులు ఏమంటున్నారంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved