MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Feature
  • Chicken Egg: కోడి కడుపులో గుడ్డు ఎలా తయారవుతుందో తెలుసా? ఒక్క ఎగ్ కోసం ఎంత టైమ్ పడుతుంది?

Chicken Egg: కోడి కడుపులో గుడ్డు ఎలా తయారవుతుందో తెలుసా? ఒక్క ఎగ్ కోసం ఎంత టైమ్ పడుతుంది?

Chicken Egg: గుడ్డు (EGG)వెరీ గుడ్.. చిన్నా పెద్దా ఎవరైనా సరే గుడ్డు తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిదని డాక్టర్లు చెపుతుంటారు. అంత మంచి గుణాలు ఉన్న గుడ్డు ఎలా తయారవుతుంది? కోడి కడుపులో గుడ్డు రెడీ అవ్వడానికి ఎంత సమయం పడుతుంది?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jul 30 2026, 01:38 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
అద్భుతమైన జీవ ఇంజనీరింగ్ ప్రక్రియ..
Image Credit : Asianet News

అద్భుతమైన జీవ ఇంజనీరింగ్ ప్రక్రియ..

ప్రస్తుతం కాలంలో కోడిగుడ్డు వినియోగం భారీగా పెరిగిపోయింది. గుడ్డు ఆరోగ్యానికి ఎంతో మంచిది కావడంతో చిన్నా పెద్దా అంతా గుడ్డు తినాలన్న అవేర్నెస్ పెరిగిపోతుంది. ఫిట్ గా ఉండాలనుకునే వారు, డైట్ ప్లాన్ లో ఉన్నవారు చాలామంది తమ ఆహారంలోగుడ్డును చేర్చుకుంటున్నారు. అందుకు తగ్గట్టుగా గుడ్డు రేట్లు కూడా ఆకాశాన్నిఅంటుతున్నాయి. గుడ్డు వెరీ గుడ్డు సరే మరి ఈ గుడ్డు ఎలా తయారవుతుంది.

 కోడి కడుపులో గుడ్డు తయారా ప్రక్రియ ఎలా జరుగుతుంది. కోడి శరీరంలో గుడ్డు రూపాంతరం చెందడం అనేది ప్రకృతి ప్రసాదించిన ఒక అద్భుతమైన జీవ ఇంజనీరింగ్ ప్రక్రియ. చాలామంది ఇది మందులు లేదా రసాయనాల వల్ల జరుగుతుందని భావిస్తారు. కానీ నిజానికి ఇది సంపూర్ణంగా రూపుదిద్దుకున్న ఒక సహజమైన శారీరక వ్యవస్థ.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
గుడ్డు తయారీ ప్రక్రియ దశలు
Image Credit : Gemini Ai

గుడ్డు తయారీ ప్రక్రియ దశలు

కోడి ప్రత్యుత్పత్తి వ్యవస్థ ప్రధానంగా అండాశయం (Ovary) , అండనాళం (Oviduct) అనే భాగాలపై ఆధారపడి ఉంటుంది. గుడ్డు తయారీ ప్రక్రియ క్రమబద్ధంగా దశలవారీగా జరుగుతుంది.

అండాశయం (Ovary) - పసుపు సొన రూపకల్పన

కోడి శరీరంలోని అండాశయంలో చిన్న చిన్న పసుపు రంగు సొనలు (Yolks) విడివిడిగా ఎదుగుతాయి. వీటిలో బాగా పరిపక్వం చెందిన ఒక సొన విడుదలయ్యి అండనాళం (Oviduct) లోకి ప్రవేశించడంతో అసలైన గుడ్డు తయారీ ప్రక్రియ ప్రారంభమవుతుంది.

Related Articles

Related image1
America Food: అమెరికాలో ఆడవారు ప్రతిరోజూ వంట చేయరా? అమెరికన్ లైఫ్‌స్టైల్ తో పాటు ఇండియన్స్ ఏం తింటారో తెలుసా?
Related image2
UK: యూకేలో కూరగాయలు, బియ్యం మరీ ఇంత ఖరీదా? కిలో ఎంతో తెలుసా? పాపం అక్కడ ఇండియన్స్ పరిస్థితి ఏంటి?
36
మాగ్నం (Magnum) - తెల్ల సొన (అల్బుమిన్) పొర
Image Credit : Gemini Ai

మాగ్నం (Magnum) - తెల్ల సొన (అల్బుమిన్) పొర

పసుపు సొన అండనాళంలోని మొదటి ప్రాథమిక భాగమైన 'మాగ్నం' గుండా ప్రయాణిస్తుంది. ఇక్కడ దాని చుట్టూ ద్రవ రూపంలో ఉండే తెల్ల సొన (అల్బుమిన్) చేరుతుంది. ఈ ప్రక్రియకు సుమారు 3 గంటల సమయం పడుతుంది.

46
ఇస్తమస్ (Isthmus) - కవచ పొరలు
Image Credit : Gemini Ai

ఇస్తమస్ (Isthmus) - కవచ పొరలు

ఆ తర్వాత ఇది 'ఇస్తమస్' అనే భాగానికి చేరుకుంటుంది. ఇక్కడ గుడ్డు తెల్ల సొన చుట్టూ రెండు పల్చని అంతర్గత పొరలు (Shell Membranes) ఏర్పడతాయి. ఇవి గుడ్డుకు ప్రాథమిక ఆకృతిని ఇవ్వడమే కాకుండా లోపలి భాగానికి క్రిమి సంహారక రక్షణగా నిలుస్తాయి.

56
షెల్ గ్లాండ్ (Shell Gland) - గట్టి పెంకు నిర్మాణం
Image Credit : Gemini Ai

షెల్ గ్లాండ్ (Shell Gland) - గట్టి పెంకు నిర్మాణం

ఈ వ్యవస్థలోనే అత్యంత కీలకమైన భాగం 'షెల్ గ్లాండ్' లేదా గర్భాశయం. ఇక్కడే గుడ్డు దాదాపు 20 గంటల పాటు ఉండిపోతుంది. ఈ సమయంలో రక్తప్రసరణ ద్వారా అందే కాల్షియం కార్బోనేట్ క్రమంగా పేరుకుపోయి, గుడ్డుపై గట్టి పెంకును (Egg Shell) తయారు చేస్తుంది.

66
ఒక గుడ్డు తయారవ్వడానికి ఎంత టైమ్ పడుతుంది?
Image Credit : Gemini AI

ఒక గుడ్డు తయారవ్వడానికి ఎంత టైమ్ పడుతుంది?

ఒక సంపూర్ణ గుడ్డు రూపాంతరం చెంది బయటకు రావడానికి కోడికి 24 నుండి 26 గంటల సమయం (దాదాపు ఒక రోజు) పడుతుంది . గుడ్డు బయటకు వచ్చిన 30-40 నిమిషాల వ్యవధిలోనే తదుపరి పసుపు సొన అండనాళంలోకి విడుదలవుతుంది. అందుకే ఒక ఆరోగ్యకరమైన కోడి దాదాపు ప్రతి రోజూ ఒక గుడ్డును పెట్టగలుగుతుంది. పెంపకం కేంద్రాల్లో లేదా మనం రోజువారీ ఆహారంలో తీసుకునే గుడ్లు అత్యధిక ఫలదీకరణం చెందనివి. అంటే వీటి తయారీకి పుంజు (Rooster) తో సంబంధం ఉండదు, వీటి నుండి పిల్లలు బయటకు రావు. వాణిజ్య పెంపకంలో గుడ్ల ఉత్పత్తి క్రమాన్ని క్రమబద్ధీకరించడానికి కాంతి, (Light) సమతుల్య ఆహారాన్ని ఉపయోగిస్తారు, కానీ ఇది సంపూర్ణ సహజ జీవక్రియే తప్ప ఎటువంటి కృత్రిమ మందుల ఫలితం కాదు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Gas Cylinder Safety : గ్యాస్ సిలిండర్‌పై ఉండే A, B, C, D కోడ్ ఏంటో తెలుసా? దీనిలో ఇంత అర్థం దాగుందా?
Recommended image2
Prime Ministers Favorite Food : నెహ్రూ నుండి మోదీ వరకు.. ఏ ప్రధాని, ఏ ఫుడ్ ఇష్టంగా తినేవారో తెలుసా?
Recommended image3
America: అమెరికాలో ఇండియన్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల జీతాలు ఎంత ఉంటాయి? నెలకు ఎంత మిగులుతుంది?
Related Stories
Recommended image1
America Food: అమెరికాలో ఆడవారు ప్రతిరోజూ వంట చేయరా? అమెరికన్ లైఫ్‌స్టైల్ తో పాటు ఇండియన్స్ ఏం తింటారో తెలుసా?
Recommended image2
UK: యూకేలో కూరగాయలు, బియ్యం మరీ ఇంత ఖరీదా? కిలో ఎంతో తెలుసా? పాపం అక్కడ ఇండియన్స్ పరిస్థితి ఏంటి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved