MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Forecast
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
Donald Trump Strait of Hormuz
India Skills Report
KL Rahul Love Story
India Geographic Extent
  • Home
  • Life
  • Health
  • షుగర్ పేషెంట్స్ కి బంపరాఫర్.. ఇక వారానికి ఒక్కసారే..

షుగర్ పేషెంట్స్ కి బంపరాఫర్.. ఇక వారానికి ఒక్కసారే..

ప్రముఖ ఫార్మా సంస్థ నోవో నార్డిస్క్ వారానికి ఒకసారి తీసుకునే బేసల్ ఇన్సులిన్ 'అవిక్లీ' (ఇన్సులిన్ ఐకోడెక్)ని ఇండియాలో విడుదల చేసింది. ఈ నూతన ఆవిష్కరణ మధుమేహ రోగులకు రోజువారీ ఇంజెక్షన్ల బాధను తప్పించి, చికిత్సను సరళతరం చేస్తుంది. 

2 Min read
Author : Arun Kumar P
Published : Jul 10 2026, 06:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
వీక్లీ ఇన్సులిన్ ఇంజెక్షన్ వచ్చేసింది
Image Credit : Gemini AI

వీక్లీ ఇన్సులిన్ ఇంజెక్షన్ వచ్చేసింది

మధుమేహ చికిత్సలో గణనీయమైన ముందడుగు పడింది. ప్రముఖ ఫార్మా సంస్థ నోవో నార్డిస్క్ కేవలం వారానికి ఒకసారి తీసుకునే బేసల్ ఇన్సులిన్ 'అవిక్లీ' (ఇన్సులిన్ ఐకోడెక్)ని భారత్‌లో విడుదల చేసింది. 

ప్రస్తుతం మధుమేహ బాధితులు తమ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడానికి రోజుకు ఒకటి లేదా రెండుసార్లు ఇన్సులిన్ ఇంజెక్షన్లు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది రోగులకు శారీరకంగా, మానసికంగా ఇబ్బందికరంగా మారుతోంది. ఈ క్రమంలోనే సంవత్సరానికి 365 సార్లు సూదులు గుచ్చుకునే బాధ నుండి ఈ అవిక్లీ ఇన్సులిన్ విముక్తి కల్పిస్తుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఈ వీక్లీ ఇన్సులిన్ ఎలా పనిచేస్తుందో తెలుసా?
Image Credit : Getty

ఈ వీక్లీ ఇన్సులిన్ ఎలా పనిచేస్తుందో తెలుసా?

ఏడు రోజుల పాటు పనిచేసే ఈ సరికొత్త వీక్లీ ఇన్సులిన్ ఇంజెక్షన్ శరీరంలో ప్రత్యేకంగా పనిచేస్తుంది. ఇంజెక్షన్ తీసుకున్న తర్వాత అది రక్తంలో ఉండే ఆల్బుమిన్ అనే ప్రొటీన్‌తో బంధాన్ని ఏర్పరచుకుంటుంది. ఈ బంధం కారణంగా ఇన్సులిన్ శరీరంలో చాలా నెమ్మదిగా, క్రమ పద్ధతిలో ఏడు రోజుల పాటు నిరంతరాయంగా విడుదల అవుతుంది. ఫలితంగా వారం పొడుగునా బ్లడ్ షుగర్ స్థాయిలు అకస్మాత్తుగా పెరగకుండా స్థిరంగా నియంత్రించబడతాయి.

Related Articles

Related image1
Blood Sugar: ఇదొక్కటి తింటే బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ లో ఉంటుంది
Related image2
Sugar: శరీరంలో చక్కెర మోతాదు పెరిగితే పేగుల్లో జరిగేది ఇదే!
34
వీక్లీ ఇన్సులిన్ ప్రయోజనాలు..
Image Credit : Pinterest

వీక్లీ ఇన్సులిన్ ప్రయోజనాలు..

అంతర్జాతీయ క్లినికల్ ట్రయల్స్‌ ప్రకారం... ఈ వీక్లీ ఇన్సులిన్ ముఖ్యంగా టైప్-1, టైప్-2 డయాబెటిస్ ఉన్న పెద్దవారికి అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇది రోజువారీ ఇన్సులిన్‌తో పోలిస్తే HbA1c స్థాయిలను మెరుగ్గా తగ్గిస్తుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువసేపు లక్ష్య పరిధిలో ఉండేలా చేస్తుంది

క్లినికల్ పరీక్షల్లో రక్తంలో చక్కెర నియంత్రణలో ఇది రోజువారీ ఇన్సులిన్‌తో పోలిస్తే మెరుగైన ఫలితాలను ఇచ్చినట్లు తెలుస్తోంది. భద్రతలోనూ ఇదే స్థాయి ఫలితాలు నమోదయ్యాయి. ఇది హైపోగ్లైసీమియా ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

44
వీక్లీ ఇన్సులిన్ ఇంజెక్షన్ షుగర్ పేషెంట్స్ కి వరమే..
Image Credit : Getty

వీక్లీ ఇన్సులిన్ ఇంజెక్షన్ షుగర్ పేషెంట్స్ కి వరమే..

ఆఫీసు పనుల వల్ల లేదా ప్రయాణాల వల్ల రోజువారీ ఇన్సులిన్ తీసుకోవడం మర్చిపోయే వారికి, వృద్ధులకు ఈ వీక్లీ ఇన్సులిన్ ఒక వరంగా మారబోతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీనివల్ల చికిత్సను మధ్యలో ఆపేసే సమస్యలు తగ్గుతాయి, తద్వారా మధుమేహ నియంత్రణ మరింత సులభతరం అవుతుంది.

ఈ వీక్లీ ఇన్సులిన్ సాంకేతికంగా ఎంతో అధునాతనమైనది అయినప్పటికీ, దీనిని రోగులు సొంతంగా మెడికల్ షాపుల నుండి కొనుగోలు చేసి వాడకూడదు. రోగి ప్రస్తుత ఆరోగ్య స్థితిని బట్టి డోసేజీని వైద్యులే నిర్ణయించాల్సి ఉంటుంది. ఈ కొత్త ఇన్సులిన్ లభ్యత భారతదేశంలో మధుమేహ నియంత్రణలో ఒక కీలకమైన మైలురాయిగా నిలవనుంది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఆరోగ్యం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Recommended image2
ఆపరేషన్ అయిన వారికి, జ్వరం వచ్చిన వారికి బ్రెడ్ ప్యాకెట్లే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.?
Recommended image3
Street Food: రోడ్డు మీద సమోసాలు, బజ్జీలు ఫాస్ట్ ఫుడ్ తింటున్నారా? నూనె బాగుందో లేదో 10 సెకన్లలో ఎలా గుర్తించాలి?
Related Stories
Recommended image1
Blood Sugar: ఇదొక్కటి తింటే బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ లో ఉంటుంది
Recommended image2
Sugar: శరీరంలో చక్కెర మోతాదు పెరిగితే పేగుల్లో జరిగేది ఇదే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved