MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Life
  • Health
  • Breakfast: 15 రోజులు బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేస్తే శరీరంలో ఎలాంటి మార్పులుంటాయో తెలుసా?

Breakfast: 15 రోజులు బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేస్తే శరీరంలో ఎలాంటి మార్పులుంటాయో తెలుసా?

ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తప్పనిసరిగా తినాలని ఆరోగ్య నిపుణులు ఎప్పుడూ చెబుతూనే ఉంటారు. కానీ ఈ మధ్య చాలామంది బరువు తగ్గాలని లేదా టైమ్ లేక బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేస్తున్నారు. 15 రోజులపాటు బ్రేక్‌ఫాస్ట్ మానేస్తే శరీరంలో ఎలాంటి మార్పులుంటాయో ఇక్కడ చూద్దాం.

2 Min read
Author : Kavitha G
Published : Feb 16 2026, 06:52 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Skipping Breakfast Effects
Image Credit : gemini AI

Skipping Breakfast Effects

మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ మానేయడం మంచిదా? కాదా? అనే సందేహం చాలామందిలో ఉంటుంది. ఆరోగ్య నిపుణుల ప్రకారం ఉదయం నిద్రలేచిన తర్వాత శరీరం గ్లూకోజ్‌ను శక్తిగా ఉపయోగించుకుంటుంది. రాత్రంతా ఏం తీసుకోరు కాబట్టి, ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేయడం ద్వారా మెదడు, శరీరానికి అవసరమైన శక్తి అందుతుంది. కానీ వరుసగా 15 రోజులు బ్రేక్‌ఫాస్ట్ మానేస్తే మొదటగా అలసట వస్తుంది. కొందరిలో తలనొప్పి, చిరాకు, ఏకాగ్రత లోపం వంటివి కూడా కనిపించవచ్చు. ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగులు వంటి మానసిక శ్రమ ఎక్కువగా చేసే వారికి ఉదయం ఆహారం లేకపోవడం వల్ల వారి పనితీరుపై ప్రభావం పడుతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
బరువు పెరిగే అవకాశం..
Image Credit : Getty

బరువు పెరిగే అవకాశం..

నిపుణుల ప్రకారం ఉదయం అల్పాహారం తీసుకోకపోతే మధ్యాహ్నం లేదా సాయంత్రం ఎక్కువగా తినే అవకాశాలు ఉంటాయి. దానివల్ల మొత్తం రోజులో తీసుకునే కేలరీలు తగ్గకపోగా మరింత పెరిగే ప్రమాదం ఉంది. రక్తంలో చక్కెర స్థాయిలు అస్థిరంగా మారవచ్చు. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారు బ్రేక్‌ఫాస్ట్ మానేయడం వల్ల గ్లూకోజ్ స్థాయిల్లో హెచ్చుతగ్గులు ఉంటాయి. అయితే నియంత్రిత పద్ధతిలో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేస్తే శరీరంలో ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగుపడవచ్చని కొందరు నిపుణులు చెబుతున్నారు. 

35
ఈ సమస్యలు వచ్చే అవకాశం..
Image Credit : Getty

ఈ సమస్యలు వచ్చే అవకాశం..

15 రోజుల పాటు బ్రేక్‌ఫాస్ట్ మానేసినప్పుడు శరీరం మొదట గ్లైకోజన్ నిల్వలను వినియోగిస్తుంది. తర్వాత కొవ్వు నిల్వలను శక్తిగా మార్చడం ప్రారంభిస్తుంది. ఇది కొంతమందిలో బరువు తగ్గడానికి సహాయపడవచ్చు. అయితే ప్రోటీన్ తక్కువగా తీసుకుంటే కండరాల మాస్ తగ్గే ప్రమాదం కూడా ఉంది. ఉదయం ఆకలి ఎక్కువగా ఉన్నవారు ఆ ఆకలిని నిరోధించడానికి కాఫీ లేదా టీపై ఆధారపడితే అసిడిటి, గ్యాస్ట్రిక్ సమస్యలు రావచ్చు. 

దీర్ఘకాలంగా అల్పాహారం మానేయడం వల్ల జీవక్రియ మందగించవచ్చని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా మహిళల్లో హార్మోన్ సమతుల్యతపై ప్రభావం పడవచ్చని నిపుణులు చెబుతున్నారు. పీసీఓఎస్ లేదా థైరాయిడ్ సమస్యలు ఉన్నవారు ఆహార పద్ధతుల్లో మార్పులు చేయడానికి ముందు వైద్యుల సలహా కచ్చితంగా తీసుకోవాలని సూచిస్తున్నారు.

45
వీరు తప్పక టిఫిన్ చేయాలి
Image Credit : Gemini AI

వీరు తప్పక టిఫిన్ చేయాలి

ఉదయం సరైన పోషకాహారం లేకపోతే చిరాకు, ఆందోళన పెరిగే అవకాశముంది. పిల్లలు, గర్భిణీలు, వృద్ధులు బ్రేక్‌ఫాస్ట్ తప్పక తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. పిల్లల మెదడు అభివృద్ధికి, చదువులో ఏకాగ్రతకు ఉదయం ఆహారం చాలా అవసరం. గర్భిణీలు ఎక్కువసేపు ఖాళీ కడుపుతో ఉండడం వల్ల బలహీనత రావచ్చు. అయితే ఆరోగ్యవంతులైన పెద్దవారు సమతుల్య ఆహారంతో, సరైన పద్ధతిలో ఉపవాసం పాటిస్తే పెద్ద సమస్యలు లేకపోవచ్చు. 

55
ఈ సమస్యలు వస్తే..
Image Credit : Getty

ఈ సమస్యలు వస్తే..

నిపుణుల ప్రకారం బ్రేక్‌ఫాస్ట్ అందరికీ తప్పనిసరి కాదు. కానీ అది చాలామందికి ప్రయోజనకరం. బ్రేక్‌ఫాస్ట్ మానేయాలి అనుకుంటే ముందుగా ఆరోగ్య పరిస్థితిని అంచనా వేయాలి. అలసట, తలనొప్పి, అధిక ఆకలి, గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తే వెంటనే ఆ పద్ధతిని ఆపాలి. ఒకవేళ బరువు తగ్గడం లక్ష్యమైతే, కేవలం బ్రేక్ ఫాస్ట్ మానేయడం కంటే ఆహార నియంత్రణ, వ్యాయామం, నిద్ర, ఒత్తిడి నియంత్రణపై దృష్టి పెట్టడం మంచిది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
ఆహారం
ఆరోగ్యం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Nail Polish: నెయిల్ పాలిష్ వాడితే నిజంగానే క్యాన్సర్ వస్తుందా? మెడికల్ ఎక్స్‌పర్ట్స్ ఏం చెబుతున్నారంటే
Recommended image2
సద్గురు హెల్త్ టిప్స్ : కిడ్నీలో రాళ్లు కరిగించే దివ్యౌషదం ఇదే
Recommended image3
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Related Stories
Recommended image1
Chia Seeds: 11 రోజులపాటు ఖాళీ కడుపుతో చియా సీడ్స్ వాటర్ తాగితే కలిగే 5 లాభాలు ఇవే!
Recommended image2
Ginger Water: 7 రోజులపాటు పరగడుపున అల్లం నీరు తాగితే శరీరంలో జరిగే 5 మార్పులు ఇవే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved