MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
  • Home
  • Life
  • Health
  • Watermelon: పుచ్చకాయను గింజలతో తినాలా? గింజలు లేకుండా తినాలా? ఎలా తింటే మంచిది?

Watermelon: పుచ్చకాయను గింజలతో తినాలా? గింజలు లేకుండా తినాలా? ఎలా తింటే మంచిది?

వేసవికాలంలో ఎక్కువగా తినే ఫ్రూట్స్ లో పుచ్చకాయ ముందువరుసలో ఉంటుంది. అయితే పుచ్చకాయ తినేటప్పుడు చాలా మందికి ఒక డౌట్ వస్తుంది. దీన్ని గింజలతో తినాలా.. లేక వాటిని తీసేసి తినాలా? అని. అసలు గింజలను తింటే ఏమవుతుంది? నిపుణులు ఏం చెబుతున్నారో ఇక్కడ చూద్దాం. 

2 Min read
Author : Kavitha G
Published : Mar 11 2026, 05:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
పుచ్చకాయను ఎలా తింటే మంచిది?
Image Credit : Getty

పుచ్చకాయను ఎలా తింటే మంచిది?

వేసవికాలం వచ్చిందంటే చాలు పుచ్చకాయలు విరివిగా దొరుకుతాయి. చిన్నా, పెద్ద వీటిని ఇష్టంగా తింటారు. తక్కువ ధరలో వస్తాయి, కాబట్టి వీటిని ఎక్కువమంది కొనుగోలు చేస్తుంటారు. పుచ్చకాయ శరీరానికి చల్లదనం ఇవ్వడమే కాకుండా దాహాన్ని తగ్గించడంలో కూడా సహాయపడతుంది. అయితే పుచ్చకాయ తినేటప్పుడు గింజలతో తినాలా? లేక గింజలు తీసేసి తినాలా? అనే డౌట్ చాలామందిలో ఉంటుంది. కొందరైతే గింజలు మింగితే ఆరోగ్యానికి హానికరం అనుకుంటారు. ఈ విషయంపై నిపుణులు ఏం చెబుతున్నారో ఇక్కడ తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
పుచ్చ గింజల్లోని పోషకాలు
Image Credit : Getty

పుచ్చ గింజల్లోని పోషకాలు

నిపుణుల ప్రకారం పుచ్చకాయ గింజలు పూర్తిగా హానికరమైనవి కావు. నిజానికి వాటిలో కూడా కొన్ని ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. పుచ్చ గింజల్లో ప్రోటీన్, మెగ్నీషియం, ఐరన్, మంచి కొవ్వులు ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని అందించడంలో, కండరాల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. అయితే గింజలను అలాగే మింగడం కంటే వాటిని నమిలి తినడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

Related Articles

Related image1
Summer Tips: ఎండాకాలంలో ఇంట్లో చల్లగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు!
Related image2
Iran Israel War: తెలుగు రాష్ట్రాల్లో దారుణంగా పడిపోయిన గుడ్ల ధరలు.. ట్రే ఎంతంటే?
36
ఎక్కువ గింజలు తింటే..
Image Credit : Getty

ఎక్కువ గింజలు తింటే..

నిపుణుల ప్రకారం ఒకేసారి చాలా ఎక్కువ గింజలు మింగితే కొంతమందికి జీర్ణక్రియలో అసౌకర్యం కలిగే అవకాశం ఉంది. ముఖ్యంగా చిన్నపిల్లలు లేదా జీర్ణ సమస్యలు ఉన్నవారు గింజలు ఎక్కువగా మింగకుండా జాగ్రత్త పడటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

46
ఎండబెట్టిన గింజలు
Image Credit : unsplash

ఎండబెట్టిన గింజలు

పుచ్చకాయ గింజలను ప్రత్యేకంగా ఎండబెట్టి తినే అలవాటు కూడా కొందరికి ఉంటుంది. ఎండబెట్టిన గింజలను వేయించి తినడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఈ విధంగా తింటే గింజల్లో ఉండే పోషకాలు శరీరానికి మరింతగా అందుతాయంటున్నారు. ముఖ్యంగా మెగ్నీషియం, జింక్ వంటి ఖనిజాలు శరీరానికి మేలు చేయడంతోపాటు.. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచడంలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయని చెబుతున్నారు.

56
గింజలు తీసేసి తింటే..
Image Credit : unsplash

గింజలు తీసేసి తింటే..

సాధారణంగా చాలామంది పుచ్చకాయ తినేటప్పుడు గింజలు తీసేసి తినడానికి ఇష్టపడతారు. దానికి ప్రధాన కారణం రుచి లేదా సౌకర్యం. గింజలు ఉండడం వల్ల తినేటప్పుడు ఇబ్బంది కలుగుతుందని భావించి చాలామంది వాటిని తొలగిస్తారు. అయితే దానివల్ల పెద్దగా నష్టం కూడా ఏంలేదు. పుచ్చకాయలో ప్రధానంగా ఉండే విటమిన్ A, విటమిన్ C, యాంటీఆక్సిడెంట్లు వంటివి పండులోనే ఎక్కువగా ఉంటాయి. కాబట్టి గింజలు తీసేసి తిన్నా కూడా ఆరోగ్య ప్రయోజనాలు చాలా వరకు అలాగే ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

66
పుచ్చకాయను ఎలా తినాలంటే?
Image Credit : Freepik

పుచ్చకాయను ఎలా తినాలంటే?

పుచ్చకాయను సరైన విధంగా తినడం కూడా ముఖ్యం. ఫ్రిజ్‌లో పెట్టి వెంటనే ఎక్కువగా తినడం కొంతమందికి గొంతు సమస్యలు లేదా జీర్ణ సమస్యలు కలిగించవచ్చు. అలాగే భోజనం చేసిన వెంటనే ఎక్కువగా పుచ్చకాయ తినడం కంటే కొంత సమయం గ్యాప్ ఇచ్చి తినడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
ఆహారం
ఆరోగ్యం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
సద్గురు హెల్త్ టిప్స్ : కిడ్నీలో రాళ్లు కరిగించే దివ్యౌషదం ఇదే
Recommended image2
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Recommended image3
ఆపరేషన్ అయిన వారికి, జ్వరం వచ్చిన వారికి బ్రెడ్ ప్యాకెట్లే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.?
Related Stories
Recommended image1
Summer Tips: ఎండాకాలంలో ఇంట్లో చల్లగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు!
Recommended image2
Iran Israel War: తెలుగు రాష్ట్రాల్లో దారుణంగా పడిపోయిన గుడ్ల ధరలు.. ట్రే ఎంతంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved