- Home
- Life
- Health
- Weight Loss Drinks: ఉదయాన్నే వీటిలో ఏ ఒక్క డ్రింక్ తాగినా హెల్తీగా బరువు తగ్గడం పక్కా!
Weight Loss Drinks: ఉదయాన్నే వీటిలో ఏ ఒక్క డ్రింక్ తాగినా హెల్తీగా బరువు తగ్గడం పక్కా!
చాలామంది బరువు తగ్గడానికి రకరకాల చిట్కాలు ఫాలో అవుతుంటారు. అయితే ఆరోగ్యకరమైన రీతిలో బరువు తగ్గాలనుకునే వారికోసం బెస్ట్ డ్రింక్స్ ఇక్కడ ఉన్నాయి. ఓసారి ట్రై చేయండి.

బరువు తగ్గించే డ్రింక్స్
ప్రస్తుతం చాలామంది అధిక బరువుతో బాధపడుతున్నారు. బరువు తగ్గడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. సరిగ్గా అలాంటి వారికోసమే ఈ డ్రింక్స్. హెల్తీగా బరువు తగ్గడానికి కొన్ని డ్రింక్స్ సహాయపడతాయి. ఉదయాన్నే ఈ డ్రింక్స్ తాగితే ఆరోగ్యంగా ఉండడంతోపాటు బరువు కూడా ఈజీగా తగ్గవచ్చు. మరి ఆ డ్రింక్స్ ఏంటో ఓసారి చూద్దామా..
జీలకర్ర నీరు :
జీలకర్ర నీటిలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. జీలకర్ర జీవక్రియను పెంచడంలో సహాయపడుతుంది. ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో జీలకర్ర నీరు తాగితే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. కొవ్వు కరుగుతుంది. బరువు తగ్గడానికి జీలకర్ర నీరు చక్కగా సహాయపడుతుంది.
మెంతుల నీరు
మెంతుల్లో కరిగే ఫైబర్ అధికంగా ఉండటం వల్ల ఇది కడుపును ఎక్కువసేపు నిండుగా ఉంచుతుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఆకలిని అదుపులో ఉంచుతుంది. దీనివల్ల బరువు తగ్గడం సులభం అవుతుంది.
అందుకోసం ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు కొద్దిగా మెంతులను నీటిలో నానబెట్టి, మరుసటి రోజు ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఆ నీటిని తాగాలి. కావాలనుకుంటే మెంతులను కూడా తినవచ్చు.
వాము వాటర్
వాము జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఉబ్బరాన్ని నివారిస్తుంది. వాము నీరు శరీరంలోని వ్యర్థ పదార్థాలను బయటకు పంపి.. జీవక్రియను మెరుగుపరుస్తుంది. క్రమంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. కాబట్టి ప్రతిరోజూ ఉదయం లేవగానే ఒక గ్లాసు వేడి వాము వాటర్ తాగితే.. ఈజీగా బరువు తగ్గవచ్చు.
సబ్జా గింజలు :
సబ్జా గింజల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. అతిగా తినకుండా నిరోధిస్తుంది. ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో నానబెట్టిన సబ్జా గింజల నీటిని తాగితే.. శరీరానికి చలువ చేయడమే కాకుండా, ఉబ్బరం కూడా తగ్గుతుంది.
బెండకాయ నీరు :
బెండకాయ నీరు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఆకలిని తగ్గిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. అంతేకాదు ఈ నీరు కడుపును ఎక్కువసేపు నిండుగా ఉంచుతుంది. దీనివల్ల అనవసరమైన ఆహారం తినకుండా ఉంటారు.
రాత్రి పడుకునే ముందు బెండకాయను నీటిలో నానబెట్టి, మరుసటి రోజు ఉదయం ఖాళీ కడుపుతో తాగాలి.
అల్లం, నిమ్మరసం
నిమ్మరసం, అల్లం కలిపిన నీరు జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. జీవక్రియను పెంచుతుంది. కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. ఉదయం ఖాళీ కడుపుతో ఈ నీటిని తాగితే ఆకలి తగ్గుతుంది. శరీరంలోని వ్యర్థ పదార్థాలు బయటకుపోతాయి.