డాక్టర్ల రాతను, భాషను అర్థంచేసుకోవడం ఇక చాలా సింపుల్... ఎలాగో తెలుసా?
మీకు డాక్టర్లు రాసే మెడికల్ రిపోర్ట్ అర్థంకావడంలేదా? ఇప్పుడు AI టూల్ సాయంతో ఈ రిపోర్ట్ ని సింపుల్ తెలుగులో అర్థం చేసుకోవచ్చు. ప్రతి మెడికల్ టర్మ్ ఈజీగా తెలుస్తుంది.
- FB
- TW
- Linkdin
Follow Us
)
ఇక డాక్టర్ రిపోర్ట్ ను ఈజీగా అర్థం చేసుకొండి
Understand Doctor Writing Easily : డాక్టర్ రాత లేదా మెడికల్ రిపోర్ట్ అర్థం చేసుకోవడం చాలా కష్టం. మీకు కూడా ఇలాగే మెడికల్ లాంగ్వేజ్ అర్థం కావడంలేదా? అయినా చింతించాల్సిన అవసరం లేదు. ఈ సమస్యకి పరిష్కారంగా AI బేస్డ్ మెడికల్ రిపోర్ట్ ఇంటర్ప్రిటర్ వచ్చేసింది. ఇది మీ రిపోర్ట్ ని సింపుల్ తెలుగులో ఎవరికైనా అర్థమయ్యేలా చెబుతుంది. దీని సాయంతో సకాలంలో చికిత్స తీసుకోవడం సాధ్యమవుతుంది. ఈ టూల్స్ గురించి, వాటిని ఎలా వాడాలో తెలుసుకుందాం...
AI మెడికల్ రిపోర్ట్ ట్రాన్స్లేటర్ టూల్ అంటే ఏమిటి?
ఇది ఒక స్మార్ట్ AI టూల్. ఇది మీ ల్యాబ్ రిపోర్ట్ ని స్కాన్ చేసి, అందులోని ప్రతి పదాన్ని సింపుల్ గా అర్థమయ్యేలా తెలుగులో చెబుతుంది. దీనికి మెడికల్ డిగ్రీ అవసరం లేదు, గూగుల్ లో వెతకాల్సిన పనిలేదు. రిపోర్ట్ అప్లోడ్ చేస్తే చాలు, మీ శరీరంలో ఏం జరుగుతుందో అర్థం అవుతుంది.
ఏ మెడికల్ రిపోర్ట్స్ ని ఈ AI టూల్ అర్థం చేసుకోగలదు?
బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ (CBC, LFT, KFT)
షుగర్ రిపోర్ట్ (HbA1c, ఫాస్టింగ్/PP)
థైరాయిడ్ రిపోర్ట్ (T3, T4, TSH, Anti-TPO)
యూరిన్ రిపోర్ట్
విటమిన్స్, మినరల్స్ రిపోర్ట్
హార్మోన్స్ రిపోర్ట్ (PCOD, టెస్టోస్టిరాన్, ప్రోలాక్టిన్)
లిపిడ్ ప్రొఫైల్ (కొలెస్ట్రాల్, LDL, HDL)
AI టూల్ ఎలా పనిచేస్తుంది?
మీ రిపోర్ట్ ని PDF లేదా ఫోటో రూపంలో అప్లోడ్ చేయండి.
టూల్ మీ రిపోర్ట్ ని OCR టెక్నాలజీతో చదువుతుంది.
ప్రతి టెస్ట్ ఫలితం అర్థం సులభమైన భాషలో చెబుతుంది.
ఫలితం నార్మల్ గా ఉందా... సీరియస్ గా ఉందా అని కూడా చెబుతుంది.
కొన్ని టూల్స్ డైట్, డాక్టర్ ని కలవమని సలహా కూడా ఇస్తాయి.
మెడికల్ రిపోర్ట్ కోసం ఏ AI టూల్స్ వాడాలి?
1. HealthGPT.AI
GPT బేస్డ్ రిపోర్ట్ ఇంటర్ప్రిటర్
తెలుగు, ఇంగ్లీష్ రెండూ సపోర్ట్ చేస్తుంది.
మొబైల్, డెస్క్ టాప్ రెండింటిలోనూ పనిచేస్తుంది.
2. Explain My Report (HealthifyMe)
యాప్ లో రిపోర్ట్ అప్లోడ్ చేయండి.
వెంటనే సింపుల్ టెక్స్ట్ లో సమాధానం వస్తుంది.
కొన్ని టూల్స్ డైట్ సలహా కూడా ఇస్తాయి.
3. Google Lens, ChatGPT కాంబో
రిపోర్ట్ ఫోటో తీయండి
Google Lens తో కాపీ చేయండి.
ChatGPT లో పేస్ట్ చేసి, సింపుల్ తెలుగులో అర్థం చెప్పమని అడగండి.
గమనిక: AI టూల్ ఆరోగ్య సమాచారానికి సహాయం చేస్తుంది, ప్రత్యామ్నాయం కాదు. రిపోర్ట్ అర్థం చేసుకున్నాక డాక్టర్ సలహా తప్పనిసరిగా తీసుకోవాలి. రోగ నిర్ధారణ, చికిత్స నిర్ణయం డాక్టర్ తోనే తీసుకోవాలి.