Hair Growth: జుట్టు నల్లగా, పొడవుగా, ఆరోగ్యంగా ఉండాలంటే పసుపును ఇలా వాడితే చాలు!
జుట్టు నల్లగా, పొడుగ్గా, ఆరోగ్యంగా ఉండాలని అందరూ కోరుకుంటారు. అందుకు అవసరమైన చిట్కాలు ఫాలో అవుతుంటారు. అయితే జుట్టు ఆరోగ్యానికి పసుపు చాలా బాగా పనిచేస్తుందనే విషయం మీకు తెలుసా? పసుపును ఎలా వాడితో జుట్టుకు మంచిదో ఇక్కడ తెలుసుకుందాం.
- FB
- TW
- Linkdin
Follow Us
)
పసుపులో ఔషధ గుణాలు ఎక్కువ. ఇందులో ఉండే కర్కుమిన్, యాంటీ బాక్టీరియల్, యాంటీ సెప్టిక్ గుణాలు ఆరోగ్యానికి చాలా మంచిది. పసుపును వంటకే కాదు, చర్మ సౌందర్యానికి కూడా ఉపయోగిస్తారు. కానీ పసుపును జుట్టుకు కూడా ఉపయోగించవచ్చనే విషయం మీకు తెలుసా? పసుపును జుట్టుకు ఎలా వాడాలి? దానివల్ల కలిగే ప్రయోజనాలెంటో ఇక్కడ చూద్దాం.
జుట్టుకు పసుపుతో లాభాలు:
- జుట్టు త్వరగా తెల్లగా మారుతుంటే పసుపు వాడండి. దీనిలో ఉండే కర్కుమిన్ తెల్ల జుట్టు సమస్యను నివారిస్తుంది.
- చుండ్రు సమస్య ఉంటే జుట్టుకు పసుపు వాడండి. పసుపులో ఉండే యాంటీ బాక్టీరియల్ గుణాలు చుండ్రు సమస్య నుంచి విముక్తి కలిగిస్తాయి.
- పసుపులో ఉండే చాలా అంశాలు జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. జుట్టు చివర్లు చిట్లకుండా చేస్తాయి.
- తలపై దురద అనేక సమస్యలకు దారితీస్తుంది. పసుపు వాడటం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. పసుపులో ఉండే అలర్జీ వ్యతిరేక గుణాలు తలలో దురదను తగ్గిస్తాయి.
జుట్టుకు పసుపు వాడే విధానం:
గుడ్లు, తేనె, పసుపు
2 గుడ్లు, తేనె, పసుపు పొడి తీసుకుని బాగా కలపండి. తర్వాత దాన్ని జుట్టుకు పట్టించి 30 నిమిషాలు ఆగి షాంపూతో స్నానం చేయండి. దీనివల్ల జుట్టు సమస్యలు తగ్గుతాయి.
కొబ్బరి నూనె, పసుపు
కొబ్బరి నూనెలో పసుపు కలిపి దాన్ని జుట్టుకు పట్టించి మసాజ్ చేయండి. తర్వాత షాంపూతో స్నానం చేస్తే చుండ్రు సమస్య ఉండదు. జుట్టు పొడవుగా పెరగడానికి ఇది సహాయపడుతుంది.
ఆలివ్ ఆయిల్, పెరుగు, పసుపు
ఒక చెంచా పసుపు, 2 చెంచాల ఆలివ్ ఆయిల్, పావు కప్పు పెరుగు తీసుకుని బాగా కలపండి. దాన్ని జుట్టుకు పట్టించి 30 నిమిషాలు ఆగి తర్వాత షాంపూతో స్నానం చేయండి. దీనివల్ల జుట్టు మెరుపు పెరుగుతుంది. దీంట్లో తేనెను కూడా కలపవచ్చు.
వేడి కొబ్బరి నూనె, పసుపు
పావు కప్పు కొబ్బరి నూనెను వేడి చేసి దించేటప్పుడు దానికి అర చెంచా పసుపు పొడి కలపండి. దాన్ని రాత్రి పడుకునే ముందు మీ జుట్టుకు పట్టించి మరుసటి రోజు ఉదయం షాంపూతో స్నానం చేస్తే పొడి జుట్టు మృదువుగా మారుతుంది.