MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Life
  • Health
  • Mangoes: సమ్మర్‌లో మామిడి కాయలు తింటే ఆ రోగాలన్నీ తగ్గిపోతాయి

Mangoes: సమ్మర్‌లో మామిడి కాయలు తింటే ఆ రోగాలన్నీ తగ్గిపోతాయి

Mangoes: వేసవిలో మామిడి పళ్లు తినడం కామన్. కాని.. మామిడి కాయలు తినడం వల్ల చాలా లాభాలున్నాయని మీకు తెలుసా? పచ్చి మామిడి తినడం వల్ల అనేక వ్యాధులు, రోగాలు నయం అవుతాయని డాక్టర్లు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

1 Min read
Author : Naga Surya Phani Kumar
Published : Apr 21 2025, 07:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

వేసవి కాలం వచ్చిందంటే ఎక్కడ చూసినా మామిడి పళ్లు కనిపిస్తుంటాయి. ఈ సీజన్లో మామిడి పండ్లు ఎక్కువగా తింటారు. పండిన మామిడి చాలా రుచిగా ఉంటుంది. కానీ పచ్చి మామిడి కూడా అంతే రుచిగా ఉంటుంది. పుల్లపుల్లగా, తియ్యగా ఉండే పచ్చి మామిడి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని డాక్టర్లు చెబుతున్నారు. పచ్చి మామిడిని మీ డైట్ లో చేర్చుకుంటే చాలా లాభాలు పొందవచ్చు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

ఇమ్యూనిటీ పెరుగుతుంది

పచ్చి మామిడిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. దీన్ని తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. పచ్చి మామిడిలో యాంటీఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ నుండి రక్షణ కల్పిస్తాయి. 

వేడి దెబ్బల నుండి రక్షణ 

వేసవిలో వేడి దెబ్బలు ఎక్కువగా తగులుతుంటాయి. పచ్చి మామిడి తినడం వల్ల శరీరం చల్లబడుతుంది. మామిడి కాయలు డీహైడ్రేషన్ నుండి కాపాడతాయి. పచ్చి మామిడితో జ్యూస్ చేసుకుని తాగితే శరీరం చల్లబడుతుంది. 
 

35

జీర్ణక్రియకు సహాయపడుతుంది 

పచ్చి మామిడి జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తుంది. ఇందులో ఉండే ఫైబర్, పెక్టిన్ మలబద్ధకం, గ్యాస్, అజీర్తి సమస్యలను తగ్గిస్తాయి. పచ్చి మామిడిని ఉప్పు, మిరియాలతో కలిపి తింటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఆకలి కూడా పెరుగుతుంది.

45

లివర్ ను శుభ్రపరుస్తుంది 

పచ్చి మామిడి లివర్ కు చాలా మంచిది. ఇది లివర్ ను శుభ్రపరుస్తుంది. పైత్యరస ఉత్పత్తిని నియంత్రిస్తుంది. దీనివల్ల శరీరం నుండి విష పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి.

55

చర్మం, జుట్టుకు మంచిది 

పచ్చి మామిడిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు చర్మం, జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇది శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపి, చర్మానికి కాంతిని, జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది.

ఇది కూడా చదవండి మీరు స్మోకింగ్ చేస్తారా? అయితే ఈ భయంకరమైన వ్యాధి గురించి తప్పకుండా తెలుసుకోండి

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.
జీవనశైలి
ఆహారం
ఆరోగ్యం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Nail Polish: నెయిల్ పాలిష్ వాడితే నిజంగానే క్యాన్సర్ వస్తుందా? మెడికల్ ఎక్స్‌పర్ట్స్ ఏం చెబుతున్నారంటే
Recommended image2
సద్గురు హెల్త్ టిప్స్ : కిడ్నీలో రాళ్లు కరిగించే దివ్యౌషదం ఇదే
Recommended image3
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved