Rice Water Benefits: బియ్యం నీటిని పారేస్తున్నారా.. వాటితో ఊహించని ప్రయోజనాలు..
Benefits of Rice Water: బియ్యం కడిగిన నీళ్ళను మనం తరచు వృధాగా పారబోస్తాం. కానీ, ఆ నీటిలో ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఇప్పటివరకూ మీకు తెలియకపోతే, తెలుసుకుని ఉపయోగించుకోండి.
- FB
- TW
- Linkdin
Follow Us
)
చర్మానికి వరం:
బియ్యం నీళ్లు సహజసిద్ధమైన చర్మ సంరక్షక టోనర్‌గా పనిచేస్తాయి. ఇందులో విటమిన్లు, ఖనిజాలు, అమైనో ఆమ్లాలు, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండటం వలన చర్మాన్ని కాంతివంతంగా మారుతుంది. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం బియ్యం నీళ్లతో ముఖాన్ని కడుకోవడం వల్ల మొటిమలు, మచ్చలు, చిన్న గాయాలు తగ్గుతాయి. ఈ నీళ్లు చర్మానికి నిగారింపు ఇవ్వడమే కాకుండా ఎండ వల్ల కలిగే నష్టాన్ని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. సహజమైన ఈ టోనర్‌ను సాధారణ రొటీన్‌లో భాగంగా వాడితే, చర్మం ఆరోగ్యంగా, తాజాగా ఉంటుంది.
జుట్టు సంరక్షణకు
బియ్యం నీళ్ళు జుట్టుకు సహజసిద్ధమైన కండిషనర్‌గా పనిచేస్తాయి. కెమికల్ కండిషనర్లకు బదులుగా ఈ నీళ్లను వాడటం ఆరోగ్యానికి మంచిది. ముఖ్యంగా బియ్యం నానబెట్టిన నీళ్లు వాడటం వల్ల జుట్టు మృదువుగా, మెరిసేలా మారుతుంది. ఈ నీళ్లు జుట్టు రాలడాన్ని తగ్గించి, జుట్టుకు అవసరమైన పోషకాలను అందిస్తాయి. వారానికి రెండు నుంచి మూడుసార్లు షాంపూ తర్వాత బియ్యం నీళ్లతో జుట్టును శుభ్రం చేయాలి. జట్టును 5–10 నిమిషాలు ఈ నీళ్లలో నానబెట్టి, సాదా నీటితో తల శుభ్రం చేసుకుంటే మంచి ఫలితాలు కనిపిస్తాయి.
మొక్కలకు పోషకాలు
మొక్కలకు బియ్యం నీళ్ళు సహజసిద్ధమైన ఎరువుగా పనిచేస్తాయి. బియ్యం నీళ్ళలో ఉండే పిండి పదార్థం, పోషకాలు మొక్కల పెరుగుదలకు చాలా అవసరం. ఈ నీళ్లు మట్టిని సారవంతం చేస్తాయి. మొక్కలను వ్యాధుల బారిన పడకుండా కాపాడుతాయి. బియ్యం నీళ్ళను మొక్కలకు నేరుగా పోయవచ్చు.
క్లీనర్ గా
బియ్యం నీళ్లలోని పిండి పదార్థానికి శుభ్రం చేసే గుణం కలిగి ఉంటుంది, అది సహజ మెరుపును ఇస్తుంది. కెమికల్ క్లీనర్లకు బదులుగా బియ్యం నీళ్లను వాడడం పర్యావరణానికి, ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కిచెన్ ప్లాట్‌ఫామ్‌లు, సింక్, పాత్రలు వంటి వాటిని శుభ్రం చేయడానికి ఉపయోగపడుతుంది. అంతేకాదు, ఇది తేలికపాటి క్రిమిసంహారిణిగా పనిచేస్తుంది. అద్దాలు, కిటికీలు, ఫర్నిచర్ లాంటి క్లీన్ చేయడానికి కూడా బియ్యం నీళ్లను ఉపయోగించవచ్చు. ఇలా బియ్యం నీళ్లను సాధారణ గృహోపయోగంలో భాగంగా చేర్చడం ద్వారా సహజమైన శుభ్రతను పొందవచ్చు.
పాత్రలు, వెండి వస్తువులను మెరిసేలా
మసకబారిన పాత్రలు, వెండి పాత్రలు లేదా వెండి నగలను బియ్యం నీళ్లలో కొంతసేపు నానబెట్టి, తర్వాత శుభ్రం చేస్తే అవి మిలమిలా మెరుస్తాయి. బియ్యం నీళ్లలోని పిండి పదార్థం మురికి, మసి, పాతపదార్థాలను మెరిసేలా చేస్తుంది. ఇవి వంటపాత్రలపై ఉండే జిడ్డు మరకలను కూడా సులభంగా తొలగిస్తాయి.
బియ్యం నీటిని ఎలా నిల్వ చేయాలి?
బియ్యం కడిగేటప్పుడు వచ్చే మొదటి నీటిని శుభ్రమైన పాత్రలో నిల్వ చేసుకోవాలి. వెంటనే వాడవచ్చు లేదా ఫ్రిజ్‌లో 1-2 రోజులు నిల్వ చేసుకోవచ్చు. చర్మం లేదా జుట్టుకు వాడే ముందు ఆ నీళ్ళలో కొద్దిగా నీరు కలిపి వాడటం మంచిది. ఇకపై బియ్యం నీళ్ళను వృధా చేయకుండా, వాటి ప్రయోజనాలను ఉపయోగించుకుని ఆరోగ్యంగా ఉండండి.