- Home
- Life
- Health
- Heart Patients: హార్ట్ పేషెంట్స్ వేసవిలో రోజుకు ఇన్ని లీటర్ల నీరే తాగాలి? లేకపోతే ప్రమాదమే
Heart Patients: హార్ట్ పేషెంట్స్ వేసవిలో రోజుకు ఇన్ని లీటర్ల నీరే తాగాలి? లేకపోతే ప్రమాదమే
Heart Patients: నీరు ఎక్కువగా తాగితే మంచిదే. కాని హార్ట్ పేషెంట్లు ఎక్కువగా నీరు తాగితే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. గుండె సంబంధిత వ్యాధులతో బాధపడే వారు వేసవిలో ఎంత నీరు తాగాలన్న విషయం గురించి డాక్టర్ల సూచనలు ఇక్కడ తెలుసుకుందాం.
- FB
- TW
- Linkdin
Follow Us
)
శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు తగినంత నీరు తాగడం చాలా అవసరం. ముఖ్యంగా వేసవిలో నీరు తాగడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. నీరు అలసటను తగ్గిస్తుంది. మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. ఇలా ఎన్నో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి ఒక వ్యక్తి రోజుకు మూడు నుండి నాలుగు లీటర్ల నీరు తాగాలని నిపుణులు సూచిస్తున్నారు.
శరీరంలో నీరు లేకపోతే డీహైడ్రేషన్ వంటి తీవ్రమైన సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి పిల్లల నుండి వృద్ధుల వరకు అందరూ ప్రతిరోజు తగినంత నీరు తప్పకుండా తాగాలి. కానీ హార్ట్ పేషెంట్స్ ఎక్కువగా నీరు తాగడం వారి ఆరోగ్యానికి మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. దానికి కారణాలు, హార్ట్ పేషెంట్స్ ఎక్కువగా నీరు తాగితే వచ్చే సమస్యలు? ఎంత నీరు తాగాలన్న విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
హార్ట్ పేషెంట్లు ఎందుకు నీరు తక్కువగా తాగాలి?
హార్ట్ పేషెంట్లు తమ శరీరంలో సోడియం, పొటాషియం, ఎలక్ట్రోలైట్స్ వంటి ఖనిజాలను బ్యాలెన్సింగ్ గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఒకవేళ వారు ఎక్కువగా నీరు తాగితే ఈ బ్యాలెన్స్ దెబ్బతినే ప్రమాదం ఉంది. ఇదే జరిగితే నీరు గుండెకు పట్టేస్తుంది. దీంతో గుండెల్లో నొప్పి, హార్ట్ ఎటాక్ కూడా రావొచ్చు.
ఇది కూడా చదవండి: రాత్రిపూట ఈ 5 పండ్లు అస్సలు తినొద్దు! మీ నిద్ర చెడిపోతుంది
గుండెకు కలిగే నష్టాలు
హార్ట్ పేషెంట్లు ఎక్కువగా నీరు తాగితే గుండె పంపింగ్ దెబ్బతింటుంది. గుండెపై ఒత్తిడి పెరుగుతుంది. ఇంకా ధమనులు బలహీనపడతాయి. దీని ఫలితంగా గుండె వేగం బాగా పెరుగుతుంది. దీనివల్ల గుండెపోటు, ఛాతీ నొప్పి, పక్షవాతం వంటివి రావచ్చు. ఇది కాకుండా కిడ్నీలపై కూడా ఒత్తిడి పెరుగుతుంది.
ఇది కూడా చదవండి: ఈ 5 జపనీస్ టెక్నిక్స్ తో మానసిక ఒత్తిడి పరార్. జీవితం చాలా కొత్తగా ఉంటుంది
హార్ట్ పేషెంట్లు వేసవిలో ఎంత నీరు తాగాలి?
హార్ట్ పేషెంట్లు ఎక్కువగా నీరు తాగడం మంచిది కాదు కాబట్టి వేసవిలో వారు రోజుకు 8 గ్లాసులు లేదా 2 లీటర్ల కంటే ఎక్కువ నీరు తాగకూడదని వైద్యులు సూచిస్తున్నారు. ఇంకా హార్ట్ పేషెంట్లు నీటితో పాటు ఇతర డ్రింక్స్ తాగే ముందు వైద్యుడిని సంప్రదించడం మంచిది.