60 ఏళ్లు దాటిన వాళ్లు ఇలా నడిస్తే.. ఆయుష్షు పెరుగుతుంది!
వాకింగ్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ప్రతిరోజూ కచ్చితంగా వాకింగ్ చేయాలని నిపుణులు చెబుతుంటారు. 60 ఏళ్లు దాటిన వారు ఎలా వాకింగ్ చేస్తే ఆరోగ్యానికి మరింత మేలు జరుగుతుందో ఇక్కడ చూద్దాం.
- FB
- TW
- Linkdin
Follow Us
)
వేగంగా నడవడం..
వేగంగా నడవడం అందరికీ సాధ్యం కాదు. కొందరికి నెమ్మదిగా నడవడమే ఈజీగా అనిపిస్తుంది. కానీ వేగంగా నడవడం వల్ల ఆరోగ్యానికి చాలా లాభాలున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. వేగంగా నడవడం వల్ల ఆరోగ్యం ఎలా మెరుగుపడుతుందో ఇక్కడ చూద్దాం.
ఆయుష్షు పెరగడానికి..
నడక ఆయుష్షు పెంచడంలో సహాయపడుతుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రతి రోజూ దాదాపు 8000 అడుగులు నడిస్తే అకాల మరణం ప్రమాదం సగం తగ్గుతుందని ఓ అధ్యయనంలో తేలింది.
గుండె ఆరోగ్యానికి..
మీరు నిమిషానికి 100 అడుగుల కంటే ఎక్కువ నడిస్తే ఇంకా ఎక్కువ లాభాలుంటాయి. రోజూ ఏడు నిమిషాలు వేగంగా నడిస్తే మీ గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గుండె జబ్బులు వచ్చే ప్రమాదం 14% తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఆయుష్షు పెరుగుతుంది!
60 ఏళ్ల వయసులో వేగంగా నడిస్తే ఆయుష్షు ఒక సంవత్సరం వరకు పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అంతేకాదు నెమ్మదిగా నడవడంతో పోలిస్తే.. వేగంగా నడవడం వల్ల క్యాన్సర్ ప్రమాదం తగ్గుతుంది. నడక మెదడు పనితీరుని పెంచుతుంది. నడక వల్ల డయాబెటిస్, గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. రోజూ వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది.