MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Kitchen Hacks: ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందని అన్నీ పెట్టుస్తున్నారా? ఇవి పెడితే చాలా డేంజర్!

Kitchen Hacks: ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందని అన్నీ పెట్టుస్తున్నారా? ఇవి పెడితే చాలా డేంజర్!

ప్రస్తుత కాలంలో దాదాపు అన్నీ ఇళ్లల్లో ఫ్రిడ్జ్ ని వాడుతున్నారు. చాలామంది మార్కెట్ నుంచి కూరగాయలు తేగానే ఫ్రిడ్జ్ లో పెట్టేస్తుంటారు. కానీ కొన్ని రకాల కూరగాయలను ఫ్రిడ్జ్ లో పెట్టడం మంచిది కాదంటున్నారు నిపుణులు. అవేంటో, పెడితే ఏమవుతుందో ఇక్కడ చూద్దాం.

2 Min read
Author : Kavitha G
Published : Apr 25 2026, 02:32 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఫ్రిడ్జ్ లో పెట్టకూడని కూరగాయలు
Image Credit : Asianet News

ఫ్రిడ్జ్ లో పెట్టకూడని కూరగాయలు

మార్కెట్ నుంచి కూరగాయలు తేగానే ఫ్రిజ్‌లో పెట్టడం చాలామందికి అలవాటు. చల్లటి వాతావరణంలో ఉంటే ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయని అనుకుంటారు. కానీ నిపుణుల ప్రకారం.. అన్ని రకాల కూరగాయలకు చల్లటి వాతావరణం సెట్ కాదు. కొన్నింటిని ఫ్రిజ్‌లో పెడితే వాటి రుచి, వాసన, పోషకాలు తగ్గి త్వరగా పాడవుతాయి. అందుకే ఏ కూరగాయలను ఫ్రిజ్‌లో పెట్టకూడదో ఇక్కడ తెలుసుకుందాం. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
దోసకాయ
Image Credit : Asianet News

దోసకాయ

దోసకాయను చల్లగా తింటే బాగుంటుందని చాలామంది ఫ్రిడ్జ్ లో పెడతారు. కానీ 10°C కంటే తక్కువ ఉష్ణోగ్రతలో 2-3 రోజులు ఉంచితే దోసకాయ పసుపు రంగులోకి మారి పాడవుతుంది. ముఖ్యంగా టమాటా, పుచ్చకాయ, అవకాడోతో పాటు ఉంచితే, వాటి నుంచి వచ్చే ఇథిలీన్ గ్యాస్ వల్ల దోసకాయ త్వరగా పాడవుతుంది. అందుకే దీన్ని నేరుగా ఎండ తగలని చోట, సాధారణ ఉష్ణోగ్రతలో పెట్టడం మంచిది.

35
వెల్లుల్లి
Image Credit : Asianet News

వెల్లుల్లి

ఫ్రిడ్జ్ లోని చల్లదనానికి వెల్లుల్లి సువాసన, ఘాటైన రుచి, ఔషధ గుణాలు తగ్గిపోతాయి. ఫ్రిడ్జ్ లోని తేమ వల్ల వెల్లుల్లికి త్వరగా మొలకలు వస్తాయి, మెత్తబడి పాడవుతుంది. ప్లాస్టిక్ కవర్‌లో లేదా మూతపెట్టిన డబ్బాలో పెడితే తేమ ఇంకా పెరుగుతుంది. దానికి బదులు.. చల్లగా, గాలి తగిలే పొడి ప్రదేశంలో ఉంచితే వెల్లుల్లి ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది.

45
ఉల్లిపాయ
Image Credit : Generated by google gemini AI

ఉల్లిపాయ

ఉల్లిపాయ కూడా ఫ్రిజ్‌కు సరిపడదు. చల్లని వాతావరణంలో ఉంచితే దానిలోని పిండిపదార్థం చక్కెరగా మారి, ఉల్లిపాయ మెత్తబడుతుంది. తేమ వల్ల మొలకలు రావడం మొదలవుతుంది. చీకటిగా, గాలి తగిలే చోట ఉంచితే 1-2 నెలల వరకు ఉల్లిపాయలు పాడుకావు. అలాగే, టమాటాను కూడా ఫ్రిజ్‌లో పెట్టకపోవడమే మంచిది. ఫ్రిడ్జ్ లోని చల్లదనం టమాటాను చప్పగా, రుచిలేకుండా చేస్తుంది. సాధారణ ఉష్ణోగ్రతలో ఉంచితే దాని సహజ రుచి, వాసన నిలిచి ఉంటాయి.

55
బంగాళదుంప
Image Credit : Getty

బంగాళదుంప

బంగాళదుంపను ఫ్రిడ్జ్ లో పెట్టడం ఆరోగ్యానికి ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చల్లగా ఉంచితే పిండిపదార్థం చక్కెరగా మారి, వండినప్పుడు తీపిగా అవుతుంది. రంగు కూడా మారుతుంది. అంతేకాదు, ఇలా ఉంచిన బంగాళదుంపను ఎక్కువ వేడి మీద వేయిస్తే 'యాక్రిలమైడ్' అనే రసాయనం ఉత్పత్తి అయ్యే ప్రమాదం ఉంది. అందుకే దీన్ని చీకటిగా, పొడిగా, గాలి తగిలే చోట ఉంచడం మంచిది. 

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జీవనశైలి
ఆరోగ్యం
చిట్కాలు మరియు ఉపాయాలు
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Printed Saree: ఆఫీస్ వేర్ కి పర్ఫెక్ట్ గా సూటయ్యే ప్రింటెడ్ చీరలు
Recommended image2
Chapati Dough: చపాతీ పిండి కలిపిన కాసేపటికే నల్లగా ఎందుకు మారుతుంది? తాజాగా ఉండాలంటే ఏం చేయాలి?
Recommended image3
Silver Anklet:భారత్ లో కాకుండా ఏదేశంలో మహిళలు పట్టీలు ధరిస్తారో తెలుసా
Related Stories
Recommended image1
Fridge Buying Tips: సింగిల్ డోర్ vs డబుల్ డోర్ ఫ్రిడ్జ్.. ఎవరికి ఏది బెస్ట్?
Recommended image2
Summer Fashion: సమ్మర్‌లో కాటన్ కాకుండా ఏ దుస్తులు బెటర్? కంఫర్ట్, స్టైల్ కోసం బెస్ట్ ఫ్యాబ్రిక్స్..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved