- Home
- Business
- Smart watch: మీకు ఈ బ్యాంకులో అకౌంట్ ఉందా? స్మార్ట్‌వాచ్‌తో డిజిటల్ పేమెంట్స్ చేయొచ్చు.. ట్యాప్ చేస్తే చాలు.
Smart watch: మీకు ఈ బ్యాంకులో అకౌంట్ ఉందా? స్మార్ట్‌వాచ్‌తో డిజిటల్ పేమెంట్స్ చేయొచ్చు.. ట్యాప్ చేస్తే చాలు.
ఒకప్పుడు కార్డుతో పేమెంట్స్ చేయడం అంటేనే వింతగా భావించే వారు. కానీ డిజిటల్ పేమెంట్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత లావాదేవీల విధానం పూర్తిగా మారిపోయింది. అయితే తాజాగా డిజిటల్ చెల్లింపులో మరో ముందడుగు పడింది.

వేవ్ ఫార్చూన్ స్మార్ట్‌వాచ్‌తో టాప్ టు పే
భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల రంగంలో మరో కీలక ముందడుగు పడింది. ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్, దేశీయ వేరబుల్స్ బ్రాండ్ బోట్ (boAt), అంతర్జాతీయ పేమెంట్ నెట్‌వర్క్ మాస్టర్‌కార్డ్ కలిసి కొత్తగా ‘వేవ్ ఫార్చూన్ (Wave Fortune)’ పేరుతో స్మార్ట్‌వాచ్‌ను ఆవిష్కరించాయి. ఈ వాచ్ ద్వారా వినియోగదారులు తమ చేతి మణికట్టుతోనే కాంటాక్ట్‌లెస్ చెల్లింపులు చేయవచ్చు.
స్మార్ట్‌వాచ్ ద్వారా చెల్లింపులకు మార్గం
వేగవంతమైన, సురక్షితమైన చెల్లింపుల కోసం ఈ స్మార్ట్‌వాచ్‌ను రూపొందించారు. యాక్సిస్ బ్యాంక్ వినియోగదారులు తమ క్రెడిట్ లేదా డెబిట్ కార్డులను 'క్రెస్ట్ పే (Crest Pay)' అనే ప్రత్యేక boAt యాప్‌లో టోకెనైజ్ చేసి వాచ్‌లోకి సురక్షితంగా యాడ్ చేసుఓకవచ్చు. దీని వెనక మాస్టర్‌కార్డ్ టోకెనైజేషన్ టెక్నాలజీ, టాపీ టెక్నాలజీస్ వంటివి ఉపయోగిస్తారు.
దీంతో యూజర్లు POS మిషన్ వద్ద పిన్ అవసరం లేకుండానే రూ. 5,000 వరకు చెల్లింపులు చేసుకోవచ్చు. ఇది సాధ్యపడేలా టాప్ టు పే టెక్నాలజీ పని చేస్తుంది.
దీని ఉద్దేశం ఏంటంటే.?
యాక్సిస్ బ్యాంక్ ప్రెసిడెంట్ ఆర్నికా దీక్షిత్ మాట్లాడుతూ, “సురక్షితమైన డిజిటల్ చెల్లింపులను వినియోగదారులకు అందించేందుకు ఈ కొత్త భాగస్వామ్యం ఎంతో ముఖ్యమైంది. ఈ స్మార్ట్‌వాచ్ వినియోగదారుల బార్డర్‌లెస్ లావాదేవీలకు దోహదపడుతుంది,” అని చెప్పారు.
బోట్ సహ వ్యవస్థాపకుడు సమీర్ మెహతా మాట్లాడుతూ, “టెక్నాలజీని ప్రతిరోజూ వినియోగదారుల జీవితాల్లో భాగం చేయడమే మా లక్ష్యం. చక్కని డిజైన్‌తో పాటు సురక్షిత చెల్లింపులకు సపోర్ట్‌గా వేవ్ ఫార్చూన్ నిలుస్తుంది,” అన్నారు.
మాస్టర్‌కార్డ్ దక్షిణాసియా అధ్యక్షుడు గౌతమ్ అగర్వాల్ మాట్లాడుతూ, “పేమెంట్స్ భవిష్యత్తులో పూర్తిగా వేరబుల్స్ ఆధారంగా మారతాయి. వీటివల్ల చెల్లింపులు మరింత సురక్షితంగా, వేగవంతంగా మారతాయి,” అన్నారు.
వేవ్ ఫార్చూన్ ప్రత్యేకతలు
* టోకెనైజ్డ్ చెల్లింపులు
* బోట్ క్రెస్ట్ పే యాప్ ద్వారా కార్డులను టోకెనైజ్ చేయవచ్చు
* పిన్ అవసరం లేకుండా ఒకే ట్యాప్‌తో చెల్లింపు
* యాక్సిస్ బ్యాంక్ కార్డ్ రివార్డ్స్ పొందొచ్చు.
వాచ్ విషయానికొస్తే..
పని, ప్రయాణం, వర్కౌట్ ఇలా అన్ని సందర్భాల్లో వాడటానికి ఉపయోగపడేలా వాచ్‌ను డిజైన్ చేశారు. టాప్ టు పేతో ఆన్-ది-గో ట్రాన్సాక్షన్స్‌కు ఇది సపోర్ట్ చేస్తుంది. ఫీచర్ల విషయానికొస్తే ఈ వాచ్‌లో 240x282 పిక్సెల్స్‌తో కూడిన 1.96 ఇంచ్ హెచ్‌డీ స్క్రీన్‌ను అందించారు. 550 nits బ్రైట్‌నెస్ ఈ వాచ్ స్క్రీన్ సొంతం. దీంతో సూర్యకాంతిలోనూ స్పష్టంగా కనిపిస్తుంది.
ఆకట్టుకునే ఫీచర్లు
ఈ వాచ్‌లో బ్లూటూత్ కాలింగ్‌తో పాటు ఫిట్‌నెస్ ఫీచర్లను అందించారు. ఇంటరాక్టివ్ డయల్ ప్యాడ్, కాంటాక్ట్ లిస్టు సేవింగ్ వంటి ఫీచర్లను అందించారు. 'క్రెస్ట్ పే' యాప్‌కు డైరెక్ట్ యాక్సెస్ ఉంటుంది. ధర విషయానికొస్తే బోట్ అధికారిక వెబ్‌సైట్‌లో రూ. 3,299కి లభిస్తోంది. లాంచింగ్ ఆఫర్‌లో భాగంగా ఈ వాచ్‌ను రూ. 2,599కి సొంతం చేసుకోవచ్చు. ఈ వాచ్ యాక్టివ్ బ్లాక్ కలర్‌లో అందుబాటులో ఉంది.