Hair care: చిన్న వయసులోనే తెల్ల వెంట్రుకలు వస్తే ఏం చేయాలో తెలుసా?
ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా అందరికీ తెల్ల వెంట్రుకలు వస్తున్నాయి. చిన్న పిల్లల్లో కూడా ఈ సమస్య మనం చూస్తూ ఉంటాం. అసలు అంత చిన్న వయసులో తెల్ల వెంట్రుకలు ఎందుకు వస్తాయి? వాటిని ఎలా నివారించుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.
- FB
- TW
- Linkdin
Follow Us
)
ప్రస్తుతం చిన్న పిల్లలు కూడా తెల్ల వెంట్రుకల సమస్యతో బాధపడుతున్నారు. పోషకాహార లోపం, ఏదైనా తీవ్రమైన వ్యాధి కారణంగా చిన్న వయసులోనే జుట్టు నెరిసిపోతుంటుంది. కొన్ని ఆహారపు అలవాట్ల కారణంగా వృద్ధాప్యంలో వచ్చే సమస్యలు చిన్నతనంలోనే వస్తున్నాయి. కంటి చూపు మందగించడం, మధుమేహం, ఊబకాయం, జుట్టు నెరవడం లాంటి సమస్యలు వస్తున్నాయి.
జుట్టు నెరవడానికి కారణం:
జుట్టులో మెలనిన్ లేకపోవడం వల్ల చిన్న వయస్సులోనే జుట్టు నెరిసిపోతుంది. తెల్ల జుట్టును సహజంగా నల్లగా మార్చడం సాధ్యం కాదని నమ్ముతారు. కానీ పోషకాహార లోపాన్ని సరిచేయడం ద్వారా ఈ సమస్యను సులభంగా నివారించవచ్చు. పిల్లల జుట్టు నెరవకుండా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పిల్లల జుట్టు నెరవకుండా ఉండాలంటే ఏం చేయాలి?
- పిల్లలకు విటమిన్ డి, విటమిన్ బి12 లోపం ఉంటే జుట్టు నెరిసిపోతుంది. కాబట్టి ఈ రెండు పోషకాలు అధికంగా ఉండే ఆహారాలను పిల్లలకు ఇవ్వండి.
- పిల్లలకు తెల్ల జుట్టు ఉంటే ఇనుము, విటమిన్ బి, సోడియం, రాగి లాంటి పోషకాలున్న ఆహారాలను వారికి అందించాలి.
- యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే పండ్లు, కూరగాయలను వారికి ఇవ్వండి. యాంటీఆక్సిడెంట్లు జుట్టు నెరవకుండా ఉండానికి సహాయపడతాయి. కాబట్టి పిల్లల ఆహారంలో యాంటీఆక్సిడెంట్లను చేర్చడం చాలా అవసరం.
తెల్ల జుట్టు సమస్య ఉంటే?
- పిల్లలకు నెరిసిన జుట్టు సమస్య ఉంటే వారి ఆహారంలో బఠానీలు, బీన్స్, గింజలు, విత్తనాలు, గుడ్లు చేర్చాలి. ఎందుకంటే వాటిలో ఫోలిక్ యాసిడ్ ఉంటుంది.
- పిల్లలకు నెరిసిన జుట్టు సమస్య ఉంటే ఉసిరికాయ ఇవ్వండి. ఉసిరికాయలో ఉండే కాల్షియం జుట్టును బలపరుస్తుంది. జుట్టు రంగును కాపాడటానికి సహాయపడుతుంది.
- అయోడిన్ అధికంగా ఉండే పదార్థాలను పిల్లల ఆహారంలో చేర్చుకోండి.
తెల్ల జుట్టు రాకుండా ఏం చేయాలి?
- పిల్లలకు ప్రాసెస్ చేసిన, జంక్ ఫుడ్ ఇవ్వకూడదు.
- కాలుష్యం కారణంగా జుట్టు నెరిసిపోవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండటం మంచిది.
- ఎక్కువసేపు ఎండలో ఉంటే జుట్టు తప్పనిసరిగా నెరిసిపోతుంది. కాబట్టి పిల్లలను ఎక్కువసేపు ఎండలో ఉండనివ్వద్దు.