Pregnancy River Visit గర్భిణులు నది దగ్గరకు వెళ్తే ఏమవుతుంది? సైన్స్ ఏం చెబుతోంది??
గర్భధారణ నుంచి డెలివరీ అయ్యేవరకు ఎంతో జాగ్రత్తగా ఉంటేనే తల్లీ, బిడ్డ ఆరోగ్యం ఉంటారు. వైద్యపరంగా తీసుకునే సలహాలు సరే.. గర్భిణులు కొన్ని నియమాలు పాటించాలని శాస్త్రాల్లో పేర్కొన్నారు. ముఖ్యంగా ఏడు నెలల గర్భిణీ నది దగ్గరకు వెళ్లకూడదని చెబుతారు. దీనిలో నిజమెంతో చూద్దాం!

గర్భం (pregnancy) దాల్చడం అనేది చాలా సున్నితమైన సమయం. అందుకే ఇంట్లో పెద్దలు, అమ్మమ్మలు గర్భిణీ స్త్రీకి రకరకాల సలహాలు ఇస్తుంటారు. తల్లీ, బిడ్డ ఇద్దరూ సురక్షితంగా ఉండాలని కోరుకుంటారు. ఈ సమయంలో గర్భిణులు రాత్రిపూట బయటకు వెళ్లకూడదు.
7వ నెల తర్వాత గర్భిణీ (7 month pregnancy) నది దగ్గరకు వెళ్లకూడదు లేదా నదిని దాటకూడదు. దీనివల్ల తల్లి, బిడ్డ ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని పెద్దలు చెబుతారు. వైద్యులు చెప్పేదాని ప్రకారం ఇది కేవలం మూఢనమ్మకం మాత్రమే. గర్భిణులు నది దగ్గరకు వెళ్లడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు.
నదుల వల్ల ఇన్ఫెక్షన్లు పెరిగే అవకాశం
సైన్స్ ప్రకారం చూస్తే నదులు, చెరువులు, బావుల్లో ఉండే బ్యాక్టీరియాల వల్ల ప్రెగ్నెంట్ మహిళలకు ఇన్ఫెక్షన్ (bacteria infection) వచ్చే ప్రమాదం ఉంది. అందుకే మన పూర్వీకులు ఈ నియమం శాస్త్రాల్లో చేర్చారు.
ఈత ప్రయోజనకరం
కానీ వైద్య శాస్త్రం వేరేరకంగా చెబుతోంది. వైద్యపరంగా చూస్తే గర్భధారణ సమయంలో ఈత కొట్టడం మంచిది. ఇది దంపతుల ఒత్తిడిని తగ్గించడమే కాకుండా, ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.