MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Life
  • Health
  • Ear Wax Removal Tips: చెవిలోని గులిమిని బడ్స్ లేకుండా సింపుల్ గా ఇలా తీసేయొచ్చు

Ear Wax Removal Tips: చెవిలోని గులిమిని బడ్స్ లేకుండా సింపుల్ గా ఇలా తీసేయొచ్చు

Ear Wax Removal Tips: చెవిలోని గులిమిని తీయడానికి కొంతమంది పెన్ను మూతలు, సూదులు, వేళ్లు, పిన్నులు, బడ్స్ వంటివి వాడుతుంటారు. ఇలా అస్సలు చేయకూడదు. ఇలాంటివి చేయకుండానే గులిమిని నేచరుల్ గా బయటకు తీసే టెక్నిక్స్ గురించి తెలుసుకుందాం రండి.

2 Min read
Author : Naga Surya Phani Kumar
Published : Mar 11 2025, 01:15 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

సాధారణంగా మనమందరం కాటన్ బడ్స్‌తో చెవిలోని గులిమిని తీస్తాం కదా.. కానీ అలా బడ్స్‌తో తీయడం చెవికి ప్రమాదమని మీకు తెలుసా? ఎందుకంటే మీరు బడ్స్‌ను ఉపయోగించినప్పుడు, చెవిలో ఉండే గులిమి లోపలికి వెళ్లిపోయే ప్రమాదం ఉంది. దీనివల్ల చెవులు మూసుకుపోతాయి. తర్వాత వినికిడి సమస్య వస్తుంది. కాబట్టి ఇలాంటి ఇబ్బందులు లేకుండా సులభమైన పద్ధతిలో చెవిలో ఉండే గులిమిని సులభంగా తొలగించవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

చెవిలో గులిమి ఎందుకు?

చెవిలో గులిమి ఉంటే చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. కాని గులిమి మన చెవులకు రక్షణగా నిలుస్తుందని మీకు తెలుసా? గులిమి దుమ్ము, ధూళి, బ్యాక్టీరియా నుండి మన చెవిని రక్షించడానికి, మన చెవి కాలువలోని గ్రంథుల ద్వారా ఉత్పత్తి అవుతుంది. దురద, పొడిబారకుండా ఈ చెవి కాలువను కాపాడటానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.

35

చెవి గులిమి మూసుకుపోవడానికి లక్షణాలు

చెవిలో గులిమి పేరుకుపోయిందని ఇలా తెలుస్తుంది. ముందుగా చెవిలో నొప్పి వస్తుంది. చెవి మొత్తం  నిండిపోయినట్లు అనిపిస్తుంది. బీప్ శబ్దం వినపడుతూ ఉంటుంది. మీకు వినికిడి శక్తి కూడా తగ్గుతూ ఉంటుంది. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే మీ చెవిలో గులిమి పెరిగిపోయిందని అర్థం. 

దీన్ని కూడా చదవండి: రూపాయి ఖర్చు లేకుండా మోచేతులు, మోకాళ్లలో నలుపు పోయే సింపుల్ టిప్స్ ఇవిగో

45

నూనెలు ఉపయోగించొచ్చు

ఆలివ్ నూనె, కొబ్బరి నూనె, బేబీ ఆయిల్, మినరల్ ఆయిల్, గ్లిసరిన్ వాడి గులిమిని తొలగించొచ్చు. దీనికోసం ముందుగా తలను ఒకవైపుకు వంచి, ఆ తర్వాత ఏదైనా నూనె గోరువెచ్చగా ఉన్నప్పుడు కొన్ని చుక్కలు చెవిలో వేయాలి. 15 నిమిషాలు తలను అలాగే ఉంచాలి. నూనె చెవిలో ఉండే గులిమిని మెత్తగా చేసి సహజంగా బయటకు వచ్చేలా చేస్తుంది.

దీన్ని కూడా చదవండి: హార్ట్ పేషెంట్స్ వేసవిలో రోజుకు ఇన్ని లీటర్ల నీరే తాగాలి? లేకపోతే ప్రమాదమే

55

వేడి నీరు

వేడి నీరు కూడా చెవిలో ఉండే గులిమిని బయటకు తీయడానికి సహాయపడుతుంది. దీనికోసం ఒక సిరంజిలో గది ఉష్ణోగ్రత వద్ద నీటిని నింపి, తలను వంచి ఒకవైపు చెవిలో నీటిని పోయాలి. నీరు చెవిలో ఉండే గులిమిని మెత్తగా చేస్తుంది. తర్వాత చెవిని వ్యతిరేక దిశలో వంచితే గులిమి బయటకు వస్తుంది. ఆ తర్వాత గుడ్డతో చెవిని మెల్లగా తుడవాలి.

గుర్తుంచుకోండి : చెవిలోని గులిమిని తీయడానికి పెన్ను మూతలు, సూదులు, వేళ్లు, పిన్నులు, బడ్స్ వంటి వస్తువులను ఉపయోగించకూడదు. 

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
సద్గురు హెల్త్ టిప్స్ : కిడ్నీలో రాళ్లు కరిగించే దివ్యౌషదం ఇదే
Recommended image2
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Recommended image3
ఆపరేషన్ అయిన వారికి, జ్వరం వచ్చిన వారికి బ్రెడ్ ప్యాకెట్లే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved