Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Life
  • Health
  • రూపాయి ఖర్చు లేకుండా మోచేతులు, మోకాళ్లలో నలుపు పోయే సింపుల్ టిప్స్ ఇవిగో

రూపాయి ఖర్చు లేకుండా మోచేతులు, మోకాళ్లలో నలుపు పోయే సింపుల్ టిప్స్ ఇవిగో

Home Remedies: మీ మోచేతులు, మోకాళ్లు నల్లగా మారిపోయాయా? రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉండే కొన్ని వస్తువులతో ఆ నలుపును పోగొట్టవచ్చు. ఆ టెక్నిక్స్ గురించి తెలుసుకుందాం రండి. 

Naga Surya Phani Kumar | Published : Mar 08 2025, 05:55 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
15
Asianet Image

మనలో చాలామంది ఫేస్ అందం, ఆరోగ్యంపై మాత్రమే ఎక్కువ శ్రద్ధ పెడతారు. అంటే ముఖం చూడటానికి కలర్‌గా, మెరిసేలా ఉండటానికి సాధ్యమైన అన్ని ప్రయత్నాలు చేస్తాం. కానీ చాలా మోకాళ్లు, చేతుల గురించి పెద్దగా పట్టించుకోరు. అందుకే అవి చాలా నల్లగా ఉంటాయి. దీని కారణంగా మహిళలు పొట్టి, కట్స్ లీవ్ దుస్తులు వేసుకోవడం మానేస్తారు. మీ మోచేతులు, మోకాళ్లు నల్లగా ఉంటే ఇంట్లో ఉండే కొన్ని వస్తువులతో వాటిని సులభంగా తొలగించవచ్చు. అవేంటో ఇప్పుడు ఇక్కడ చూద్దాం.

25
Asianet Image

ఆవనూనెతో మర్ధన

ఆవనూనె చర్మంలో ఉండే చనిపోయిన కణాలను తొలగించి, చర్మాన్ని ప్రకాశవంతం చేస్తుంది. మోకాళ్లు, చేతుల్లో ఉండే నలుపును పోగొట్టడానికి ఆవనూనెను కొద్దిగా వేడి చేసి మీ చేతులు, కాళ్ళకు మర్దన చేయాలి. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఇలా చేసి, మరుసటి రోజు ఉదయం చల్లటి నీటితో స్నానం చేయాలి లేదా కడిగినా సరిపోతుంది.

మరొక చిట్కా ఏమిటంటే ఆవాలను పొడి చేసి, అందులో కొద్దిగా పచ్చి పాలు వేసి బాగా కలిపి, దానిని చేతులు, కాళ్ళ మోకాళ్ళకు రాసి స్క్రబ్‌లా రుద్దాలి. ఇలా రోజూ చేస్తూ ఉంటే ఒక వారంలోనే మంచి ఫలితాలు కనిపిస్తాయి.

35
Asianet Image

కలబంద రాస్తే చాలు

కలబందతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. మోచేతులు, మోకాళ్ళలో ఉండే నలుపును పోగొట్టడానికి కలబంద జెల్‌ను నలుపు ఉన్న చోట రాస్తూ ఉంటే నలుపు కొంచెం కొంచెంగా మాయం కావడం మీరే గమనిస్తారు.  

ఇది కూడా చదవండి: రాత్రిపూట ఈ 5 పండ్లు అస్సలు తినొద్దు! మీ నిద్ర చెడిపోతుంది

45
Asianet Image

నిమ్మకాయ, చక్కెర

నిమ్మకాయలో ఉండే ఆమ్లం చర్మంలో ఉండే చనిపోయిన కణాలను తొలగించడానికి సహాయపడుతుంది. కాబట్టి మీ మోచేతులు, మోకాళ్ళలో ఉండే నలుపును పోగొట్టడానికి కొద్దిగా చక్కెరతో నిమ్మరసం కలిపి నెమ్మదిగా స్క్రబ్ చేయాలి. తర్వాత చల్లటి నీటితో కడిగి విటమిన్ ఇ నూనెతో మర్దన చేయాలి. ఇలా తరచూ చేస్తూ ఉంటే మోకాళ్ళలో ఉండే నలుపు పోయి మీ చర్మం చూడటానికి బాగుంటుంది.

 

55
Asianet Image

పెరుగు, పసుపు పేస్ట్

మోకాళ్ళు, మోచేతుల్లో ఉండే నలుపును పోగొట్టడానికి పచ్చి పెరుగులో కొద్దిగా పసుపు, తేనె కలిపి ఆ పేస్ట్‌ను మీ మోకాళ్ళకు రాసి బాగా ఆరనివ్వండి. బాగా ఆరిన తర్వాత చల్లటి నీటితో కడితే మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి.

ఇది కూడా చదవండి: పాలకూరతో కూడా ఇడ్లీ చేయొచ్చని మీకు తెలుసా? ఎముకలు ఐరన్ రాడ్స్‌లా తయారవుతాయి

Naga Surya Phani Kumar
About the Author
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది. Read More...
జీవనశైలి
 
Recommended Stories
Top Stories