MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Health
  • సైన్యంలో వాడే 'మిలిటరీ టిక్' టెక్నిక్‌తో 2 నిమిషాల్లో నిద్ర పడటం ఎలా?

సైన్యంలో వాడే 'మిలిటరీ టిక్' టెక్నిక్‌తో 2 నిమిషాల్లో నిద్ర పడటం ఎలా?

రెండు నిమిషాల్లో నిద్ర రావాలంటే మిలిటరీ టిక్ టెక్నిక్ ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి. ఇది అమెరికన్ ఆర్మీలో పరీక్షించిన విధానం.

2 Min read
Author : Bhavana Thota
Published : Jul 18 2025, 12:37 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
బిజీ లైఫ్‌స్టైల్, మానసిక ఒత్తిడి
Image Credit : stockPhoto

బిజీ లైఫ్‌స్టైల్, మానసిక ఒత్తిడి

చాలామందికి నిద్ర సమస్యలు ఎదురవుతున్నాయి. బిజీ లైఫ్‌స్టైల్, మానసిక ఒత్తిడి, స్క్రీన్ టైమ్ అధికంగా  కారణంగా రాత్రిపూట బెడ్‌ మీదకి చేరినప్పటికీ గంటల పాటు నిద్ర రాదు. అలాంటి పరిస్థితుల్లో అమెరికా సైన్యంలో వాడే ప్రత్యేకమైన నిద్ర టెక్నిక్ చాలా మందికి ఉపశమనం ఇస్తోంది. దీనిపేరు 'మిలిటరీ టిక్'. దీని ద్వారా కేవలం రెండు నిమిషాల్లో నిద్రలోకి జారుకోవచ్చని శాస్త్రీయంగా నిరూపించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
అమెరికన్ నేవీ
Image Credit : stockPhoto

అమెరికన్ నేవీ

ఈ టెక్నిక్‌ను మొదటిగా ఉపయోగించింది అమెరికన్ ఆర్మీ. ఫిజికల్, మానసిక ఒత్తిడిలో ఉన్న సైనికులకు ఎలాగైనా త్వరగా నిద్ర రావాలన్నదే దీని ముఖ్య ఉద్దేశ్యం. ఈ పద్ధతి 1940ల సమయంలో అమెరికన్ నేవీ పైలట్ల కోసం అభివృద్ధి చేశారు.ఈ టెక్నిక్ వర్క్ అవ్వాలంటే కొన్ని రోజులపాటు ప్రాక్టీస్ చేయాలి. 6 వారాలపాటు ప్రతి రోజు దీనిని ప్రాక్టీస్ చేసిన 96 శాతం మందికి ఇది ఫలితాన్నిచ్చింది. ముఖ్యంగా రద్దీగా ఉండే వార్ జోన్‌ల్లో, బహిరంగ ప్రదేశాల్లో కూడా నిద్ర రావడానికి ఇది బాగా ఉపయోగపడుతుందని చాలా మంది చెప్పారు.

36
ఈ మిలిటరీ టిక్ టెక్నిక్ ఎలా పనిచేస్తుంది?
Image Credit : stockPhoto

ఈ మిలిటరీ టిక్ టెక్నిక్ ఎలా పనిచేస్తుంది?

ఈ టెక్నిక్‌లో నాలుగు ముఖ్యమైన దశలు ఉంటాయి. ఒక్కో దశలో శరీర భాగాలను పూర్తిగా రిలాక్స్ చేయాలి. మానసిక స్థితిని కూడా రిలాక్స్ అయ్యేలా దృష్టి పెట్టాలి.

46
మొదటి దశ:
Image Credit : Freepik

మొదటి దశ:

ముందుగా ముఖాన్ని పూర్తిగా ప్రశాంతంగా ఉంచేందుకు ప్రయత్నించాలి. కళ్లు, నాలుక, పెదవులు అన్నీ ఒక సడలింపు స్థితిలోకి తీసుకెళ్లాలి. ముక్కు, నోటి భాగంలో ఎటువంటి ఒత్తిడి లేకుండా చూసుకోవాలి.

రెండవ దశ:

ఇప్పుడు భుజాలు, చేతులు ప్రశాంతంగా ఉంచాలి. రెండు చేతులను ఫ్రీగా పెట్టి, భుజాలు బెడ్డు కి సమాంతరంగా ఉంచాలి. నెమ్మదిగా మణికట్టల నుంచి వేళ్ల వరకు పూర్తిగా రిలాక్స్ అవ్వాలి.

56
మూడవ దశ:
Image Credit : Freepik

మూడవ దశ:

తర్వాత శరీరంలోని కాళ్లను శాంతపరిచే దశ. తొడల నుంచి వేళ్ల వరకు ఒక్కొక్క భాగాన్ని విడిగా విడిగా రిలాక్స్ చేయాలి. శరీరంపై ఉండే ఒత్తిడి మెల్లగా తొలగిపోతూ ఉంటుంది.

చివరి దశ:

ఇప్పుడు మానసిక స్థితిని దృష్టిలో పెట్టుకోవాలి. మనసులో ఎలాంటి ఆలోచనలు లేకుండా చేయాలి. కొన్ని సెకన్ల పాటు “ఏదైనా వాహనంలో పడుకొని నిశ్శబ్దంగా ప్రయాణిస్తున్నాం” అన్నట్టుగా ఊహించాలి. లేకపోతే “నాలో ఏ ఆలోచన లేదు... నాలో ఏ ఆలోచన లేదు...” అని పదే పదే తలలో అనుకోవచ్చు. ఈ తరహా మానసిక స్థితిలో 10 సెకన్ల పాటు ఉంటే మైండ్ పూర్తిగా రిలాక్స్ అవుతుంది.

ఈ టెక్నిక్‌ను ప్రతిరోజూ ఉపయోగించడం వల్ల నిద్రలోకి త్వరగా వెళ్లే సామర్థ్యం మెరుగవుతుంది. మొదటి రోజుల్లో ఇది అంతగా ఫలితం ఇవ్వకపోయినా, క్రమంగా మైండ్ ట్రెయిన్ అవుతుంది. 2 నిమిషాల్లో కళ్లుమూసేంత వరకు ఈ పద్ధతిని ప్రాక్టీస్ చేయాలి.

66
ఎందుకు ఇది పని చేస్తుంది?
Image Credit : Getty

ఎందుకు ఇది పని చేస్తుంది?

ఈ టెక్నిక్‌లో శరీర భాగాలను విడిగా రిలాక్స్ చేయడం వల్ల నాడీ వ్యవస్థ శాంతిస్తుంది. అదేవిధంగా, మనసులో ఉండే ఆలోచనల ప్రవాహాన్ని నిలిపివేసే ప్రయత్నం వల్ల బ్రెయిన్ అలర్ట్ మోడ్ నుంచి రిలాక్స్ మోడ్‌కి మారుతుంది. ఇది నిద్రకు అవసరమైన స్థితికి తేలికగా తీసుకెళ్తుంది.

ఈ టెక్నిక్‌ను ఎవరైనా ప్రయత్నించవచ్చా?

ఈ పద్ధతి ఆరోగ్యవంతమైనది. మందులు అవసరం లేకుండా నిద్రకు సహాయం చేయడమే దీని ప్రత్యేకత. కానీ ఎప్పుడూ గాఢ నిద్ర రావడం లేదంటే ఒకసారి నిద్ర నిపుణుడిని సంప్రదించడం మంచిది.

About the Author

BT
Bhavana Thota
భావన మహిళా జర్నలిస్ట్. ఈమె 10 ఏళ్లుగా పాత్రికేయరంగంలో ఉన్నారు. స్థానిక వార్తలు మొదలుకుని అంతర్జాతీయ వార్తల దాకా ఏ అంశంపై అయినా సులభంగా అర్థం అయ్యేలా కథనాలు రాయగలగడం భావన ప్రత్యేకత. ఈమె ఈనాడులో దాదాపు ఆరేళ్లు పని చేశారు. తొలివెలుగు, ఆర్టీవీలోనూ ఈమె పలు కేటగిరీలకు సబ్ ఎడిటర్ గా వ్యవహరించారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఆమె ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేస్తున్నారు.
ఆరోగ్యం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
నీళ్లు తాగిన వెంటనే పరిగెత్తితే క‌డుపులో ఒక‌వైపు నొప్పి ఎందుకు వస్తుంది? దీనికి కార‌ణం ఏంటంటే?
Recommended image2
ఆల్క‌హాల్ తాగిన తర్వాత ట్యాబ్లెట్స్‌ వేసుకోవచ్చా? వైద్యులు ఏమంటున్నారంటే..
Recommended image3
Blood Pressure: బీపీ మిష‌న్ ఎలా ప‌నిచేస్తుంది.? దీని వెన‌కాల ఉన్న మెకానిజం ఏంటో తెలుసా?
Related Stories
Recommended image1
Health tips: ఈజీగా బరువు తగ్గాలి అనుకుంటున్నారా? ఈ ఒక్క డ్రింక్ తాగితే చాలు..!
Recommended image2
Health Tips: బాదాం పప్పును ఎలా తినాలి? తొక్కతో సహా తింటే ఏమవుతుంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved