MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Forecast
Bigg Boss Agnipariksha 2
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
Donald Trump Strait of Hormuz
India Skills Report
KL Rahul Love Story
India Geographic Extent
Rocking Star Yash
Agadha Movie 4 Days Collection
Telangana Food Safety
VAS vs Makutam Box Office
Yashasvi Jaiswal
Korean Kanakaraju Collections
  • Home
  • Life
  • Men Psychology: మగవాళ్లు నిజంగా దేన్ని ఇష్టపడతారు? సైకాలజీ ఏం చెబుతోంది?

Men Psychology: మగవాళ్లు నిజంగా దేన్ని ఇష్టపడతారు? సైకాలజీ ఏం చెబుతోంది?

సాధారణంగా చాలామంది ఆడవాళ్లు బట్టలు, బంగారం, మేకప్ వంటి వాటిని ఎక్కువగా ఇష్టపడుతుంటారు. మరి మగవాళ్లు దేన్ని ఎక్కువగా ఇష్టపడతారు. వాళ్లు ఏం కోరుకుంటారు? ఈ డౌట్ మీకు కూడా ఉందా? అయితే పదండి. దీని గురించి సైకాలజీ నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం. 

2 Min read
Author : Kavitha G
Published : Feb 04 2026, 04:21 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Men Psychology
Image Credit : AI Meta

Men Psychology

సైకాలజీ ప్రకారం.. చాలా మంది మగవాళ్లు "ఇది నేను సాధించాను" అనే ఫీలింగ్ ని అత్యంతగా విలువైందిగా చూస్తారు. చిన్న వయసు నుంచే “నువ్వు ఏం సాధించావు?” అనే ప్రశ్నకు అబ్బాయిలు అలవాటుపడతారు. చదువు, ఉద్యోగం, ప్రమోషన్, ఆర్థిక స్థిరత్వం వంటివి వారి అవసరాల కోసమే కాదు, వారి విలువను నిరూపించుకునే సాధనాలుగా మారతాయి. ఒక లక్ష్యాన్ని చేరుకున్నప్పుడు కలిగే సంతృప్తి, ప్రశంస, గౌరవమే చాలా మంది మగవాళ్లకు అసలైన ఆనందాన్ని ఇస్తుందని సైకాలజీ నిపుణులు చెబుతున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ప్రేమ, గౌరవం
Image Credit : AI Meta

ప్రేమ, గౌరవం

సైకాలజీ ప్రకారం, మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే.. మగవాళ్లకు ప్రేమతో పాటు గౌరవం కూడా సమానంగా అవసరం. “నువ్వు చాలా విలువైనవాడివి”, “నీ అభిప్రాయాలకు ప్రాధాన్యం ఉంది” అనే భావన వారికి భావోద్వేగ భద్రతను ఇస్తుంది. అందుకే కొందరు మగవాళ్లు ఖరీదైన వస్తువులకన్నా, తమ మాటకు, నిర్ణయాలకు గౌరవం దక్కే వాతావరణాన్ని ఎక్కువగా ఇష్టపడతారు.

Related Articles

Related image1
Relationship Psychology: కొందరు అబ్బాయిలు ఆంటీలను ఎందుకు ఇష్టపడతారు? సైకాలజీ ఏం చెబుతోంది?
Related image2
Relationship Tips: గరికపాటి చెప్పిన ఈ ట్రిక్స్ ఫాలో అయితే భార్యా భర్తల మధ్య గొడవలే రావు!
35
స్వేచ్ఛగా ఉండడానికి..
Image Credit : istockphoto

స్వేచ్ఛగా ఉండడానికి..

అదే విధంగా, మగవాళ్లలో స్వేచ్ఛ పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. తమ సమస్యలను తామే పరిష్కరించుకోవడం, తమ దారిని తామే ఎంచుకోవడం వారికి మానసిక బలాన్ని ఇస్తుంది. సైకాలజీ ప్రకారం, ఇది వారి ఐడెంటిటీతో ముడిపడి ఉంటుంది. అందుకే కొందరు మగవాళ్లు ట్రావెల్, స్పోర్ట్స్, వాహనాలు లేదా టెక్నాలజీ వంటి వాటి వైపు ఆకర్షితులవుతారు. అవి వారికి స్వేచ్ఛ, ఉత్సాహం వంటి అనుభూతిని ఇస్తాయి.

45
అంగీకారం కోసం..
Image Credit : istockphoto

అంగీకారం కోసం..

మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, చాలా మంది మగవాళ్లు తమ భావాలను బహిర్గతంగా చెప్పకపోయినా.. అంగీకారం, గుర్తింపు కోసం లోలోపల తపిస్తుంటారు. “నేను ఎలా ఉన్నానో అలా నన్ను అర్థం చేసుకునే వారు ఉన్నారా?” అనే ప్రశ్న తెలియకుండానే వారి లోపల ఉంటుంది. సైకాలజీ నిపుణుల ప్రకారం, మగవాళ్లు ప్రేమను మాటలకన్నా పనుల ద్వారా చూపిస్తారు. అయితే ఆ ప్రయత్నాలను ఎదుటి వ్యక్తి గుర్తిస్తే వారు మానసికంగా మరింత బలపడతారు.

55
అర్థం చేసుకోవడం ముఖ్యం..
Image Credit : istockphoto

అర్థం చేసుకోవడం ముఖ్యం..

సైకాలజీ నిపుణుల ప్రకారం.. వ్యక్తుల స్వభావం, పెంపకం, అనుభవాలపై ఆధారపడి అభిరుచులు మారుతుంటాయి. కొందరు మగవాళ్లు కూడా బట్టలు, ఆభరణాలు, లగ్జరీని ఇష్టపడవచ్చు. అలాగే కొందరు ఆడవాళ్లు కెరీర్, గుర్తింపును కోరుకోవచ్చు. వాటిని సరిగ్గా అర్థం చేసుకుంటే ఆడ- మగ మధ్య ఉన్న అపోహలు తగ్గి, సంబంధాలు మరింత బలపడతాయి.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
బంధుత్వం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
వంటింట్లో స్టవ్ పక్కనే సింక్ ఉండొచ్చా? వాస్తు నిపుణులు ఏం చెబుతున్నారు?
Recommended image2
వాషింగ్ మెషీన్లో దుస్తులు ఉతికేటప్పుడు ఈ 7 తప్పులు చేస్తే మెషీన్ పోతుంది
Recommended image3
Potato Face Pack: బంగాళదుంప ఫేస్ ప్యాక్ తో ముఖంపై నల్లమచ్చలు మాయం!
Related Stories
Recommended image1
Relationship Psychology: కొందరు అబ్బాయిలు ఆంటీలను ఎందుకు ఇష్టపడతారు? సైకాలజీ ఏం చెబుతోంది?
Recommended image2
Relationship Tips: గరికపాటి చెప్పిన ఈ ట్రిక్స్ ఫాలో అయితే భార్యా భర్తల మధ్య గొడవలే రావు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved