Telugu

ఆరోగ్యమైన పళ్లు, చిగుళ్ల కోసం 7 చిట్కాలు

పళ్లు, చిగుళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని విషయాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu

రోజుకు రెండుసార్లు బ్రష్ చేయండి

దంతాలను ఆరోగ్యంగా ఉంచుకోవడంలో ఇది మొదటి మెట్టు. రోజూ రెండు పూటలా బ్రష్ చేయడం వల్ల నోరు శుభ్రంగా ఉంటుంది.

 

Image credits: Getty
Telugu

పళ్లతో వస్తువులు తెరవొద్దు

కూల్ డ్రింక్ బాటిళ్లు లేదా ఇతర ప్యాకెట్లను పళ్లతో కొరికి తెరవకూడదు. ఇలా చేయడం వల్ల పళ్లు విరిగిపోయే ప్రమాదం ఉంది.

Image credits: Getty
Telugu

చక్కెర పానీయాలకు దూరంగా ఉండండి

చక్కెర ఎక్కువగా ఉండే పానీయాలు, సోడాలు పళ్ల ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయి. కాబట్టి వీటికి దూరంగా ఉండటం చాలా మంచిది.

Image credits: Getty
Telugu

ఐస్ ముక్కలు నమలొద్దు

చాలామందికి ఐస్ ముక్కలను నోట్లో వేసుకుని నమిలే అలవాటు ఉంటుంది. ఇది పళ్ల ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు.

Image credits: Getty
Telugu

ఫ్లాసింగ్ చేయడం మర్చిపోవద్దు

రోజుకు ఒక్కసారైనా పళ్లను ఫ్లాస్ చేయాలి. దీనివల్ల పళ్ల మధ్య, చిగుళ్లలో ఇరుక్కుపోయిన ఆహార పదార్థాలు తొలగిపోతాయి.

Image credits: Getty
Telugu

పొగతాగడం తగ్గించండి

పొగతాగడం వల్ల పళ్లు, చిగుళ్ల ఆరోగ్యం పాడవుతుంది. పొగాకు ఉత్పత్తుల వాడకం వల్ల పళ్లపై మరకలు కూడా ఏర్పడతాయి. అందుకే స్మోకింగ్ మానేయాలి.

Image credits: our own
Telugu

మౌత్ వాష్ వాడండి

మధ్యమధ్యలో మౌత్ వాష్ ఉపయోగించి నోటిని పుక్కిలించడం చాలా మంచిది. ఇది నోటి దుర్వాసనను తగ్గించి, చిగుళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది.

Image credits: Getty

Black Coffee: మీ డే బ్లాక్ కాఫీతో మొదలవుతుందా? అయితే ఈ విషయం మీకు తెలుసా?

Spinach: రోజూ పాలకూర తింటే ఏమవుతుంది?

Papaya: బొప్పాయిని రెగ్యులర్ గా తింటే ఎన్ని లాభాలో తెలుసా?

Amla Benefits: రోజూ ఉసిరికాయలు తింటే ఏమవుతుంది?