MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Life
  • Health
  • Joint Pain relief tips: 30 ఏళ్లకే కీళ్ల నొప్పులా? ఇలా చేస్తే వెంటనే రిలీఫ్!

Joint Pain relief tips: 30 ఏళ్లకే కీళ్ల నొప్పులా? ఇలా చేస్తే వెంటనే రిలీఫ్!

ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా అందరూ కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. అసలు అంత చిన్న వయసులోనే కీళ్ల నొప్పులు రావడానికి కారణాలు ఏంటి? వాటి ప్రారంభ లక్షణాలు ఏంటీ? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇక్కడ చూద్దాం.  

2 Min read
Author : Kavitha G
Published : Jul 12 2025, 02:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
30 ఏళ్లకే కీళ్ల నొప్పులా?
Image Credit : Getty

30 ఏళ్లకే కీళ్ల నొప్పులా?

కీళ్ల నొప్పులు వృద్ధులకే వస్తాయనుకునే రోజులు పోయాయి. ఇప్పుడు 30 ఏళ్ల వయసులోనే చాలా మంది కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. ఈ విషయంపై ఫిన్లాండ్‌లోని ఒయులు యూనివర్సిటీలో ఇటీవల ఒక అధ్యయనం జరిగింది. 30 ఏళ్ల వయసున్న వారి కీళ్లలో దెబ్బతినే సంకేతాలు ఉన్నట్లు అధ్యయనంలో తేలింది.

అధ్యయనంలో పాల్గొన్న ముగ్గురిలో ఇద్దరికి కీళ్లల్లో దెబ్బతిన్నట్లు గుర్తించారు. దీనికి ప్రధాన కారణం అధిక బరువు, అధిక రక్తపోటు, జన్యువులు అని పరిశోధకులు చెబుతున్నారు. అయితే.. ప్రారంభ లక్షణాలను గుర్తించి తగిన చికిత్స తీసుకుంటే కీళ్లు దెబ్బతినడాన్ని నివారించవచ్చు. 30 ఏళ్లకే కీళ్ల నొప్పులు రావడానికి గల కారణాలు, ప్రారంభ లక్షణాలు, నివారణ చర్యల గురించి వివరంగా తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
30 ఏళ్లకే కీళ్లు దెబ్బతినడానికి కారణాలు:
Image Credit : stockPhoto

30 ఏళ్లకే కీళ్లు దెబ్బతినడానికి కారణాలు:

  • అధిక బరువు కీళ్లపై ఒత్తిడిని కలిగించి, మృదులాస్థి విచ్ఛిన్నానికి, దెబ్బతినడానికి దారితీస్తుంది.
  • శరీరంలో యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటే లేదా అధిక రక్తపోటు సమస్య ఉంటే కీళ్లలో వాపు వస్తుంది. ఈ సమస్యలు మొత్తం కీళ్ల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి.
  • తాత, అమ్మమ్మ లేదా తల్లిదండ్రులకు కీళ్ల సమస్యలు ఉంటే పిల్లలకు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ.
  • ఒకే చోట కూర్చోవడం, కాళ్లను అస్సలు కదపకుండా ఉండటం లేదా ఎక్కువగా కదపడం వల్ల కూడా కీళ్ల నొప్పులు వస్తాయి.
  • గాయాల వల్ల కూడా కొన్నిసార్లు కీళ్ల నొప్పులు వస్తాయి.

Related Articles

Related image1
Health Tips: ఈ పండ్లు తిన్న తర్వాత వాటర్ అస్సలు తాగద్దు.. ఎందుకో తెలుసా?
Related image2
Health tips: చక్కెరకు బదులు దీన్ని వాడితే రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం!
34
ప్రారంభ లక్షణాలు:
Image Credit : unsplash

ప్రారంభ లక్షణాలు:

1. గట్టిదనం - ఎక్కువసేపు ఒకే చోట కూర్చొని, కాళ్లను అస్సలు కదపకుండా ఉంటే కాళ్లలో ఒకరకమైన గట్టిదనం వస్తుంది. 

2. వాపు - అప్పుడప్పుడు కీళ్లలో వాపు లేదా లావుగా మారడం

3. శబ్దం - నడుస్తున్నప్పుడు లేదా మోకాలిని వంచినప్పుడు, నిలబెట్టినప్పుడు ఏదైనా శబ్దం వస్తే మీ మృదులాస్థి అరిగిపోయిందని అర్థం.

4. మెట్లు ఎక్కడంలో ఇబ్బంది - మెట్లు ఎక్కుతున్నప్పుడు లేదా కూర్చుని లేచేటప్పుడు నొప్పి లేదా అసౌకర్యంగా అనిపిస్తే కీళ్లలో సమస్య ఉందని అర్థం.

5. నిరంతర నొప్పి - నడక, జాగింగ్ లేదా ఎక్కువసేపు నిలబడిన తర్వాత మోకాళ్లలో నొప్పి వస్తే మృదులాస్థి బలహీనపడిందని అర్థం

44
నివారణ మార్గాలు:
Image Credit : Getty

నివారణ మార్గాలు:

- ఆరోగ్యకరమైన బరువు చాలా ముఖ్యం

- నడక, సైక్లింగ్, ఈత వంటి వ్యాయామాలు కీళ్లపై ఎక్కువ ఒత్తిడిని కలిగించవు. బదులుగా, అవి కండరాలను బలోపేతం చేసి, శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి.

- నిలబడి ఉన్నప్పుడు ఒక కాలిపై మరొక కాలు ఎప్పుడూ వేయకండి. అలాగే ఏదైనా వస్తువును ఎత్తేటప్పుడు వీపును ఎప్పుడూ వంచకండి. దానివల్ల మోకాళ్లపై ఒత్తిడి కలుగుతుంది.

- విటమిన్ డి, కాల్షియం, యాంటీఆక్సిడెంట్లు, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు వంటి పోషకాలు అధికంగా ఉండే ఆహారాలను రెగ్యులర్ గా తీసుకోండి. ఇవి కీళ్లను బలోపేతం చేస్తాయి.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
ఆరోగ్యం
ఆహారం
చిట్కాలు మరియు ఉపాయాలు
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
సద్గురు హెల్త్ టిప్స్ : కిడ్నీలో రాళ్లు కరిగించే దివ్యౌషదం ఇదే
Recommended image2
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Recommended image3
ఆపరేషన్ అయిన వారికి, జ్వరం వచ్చిన వారికి బ్రెడ్ ప్యాకెట్లే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.?
Related Stories
Recommended image1
Health Tips: ఈ పండ్లు తిన్న తర్వాత వాటర్ అస్సలు తాగద్దు.. ఎందుకో తెలుసా?
Recommended image2
Health tips: చక్కెరకు బదులు దీన్ని వాడితే రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved