Weight Loss: ఉదయాన్నే పరగడుపున ఇవి తాగితే, బరువు తగ్గడం ఈజీ..!
మన శరీరంలోని రక్త నాళాలలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోవడానికి మనం తీసుకునే ఆహారమే, దానిలోని కొవ్వే ప్రధాన కారణం. ఇది చాలా ప్రమాదకరమైనది. ఎందుకంటే, అవి గుండెకు కనెక్ట్ అయి ఉండే రక్త నాళాల్లో పేరుకుపోతుంది.
- FB
- TW
- Linkdin
Follow Us
)
మనం ఆరోగ్యంగా ఉండాలన్నా, మనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండాలన్నా సరైన లైఫ్ స్టైల్ ఫాలో అవ్వడం చాలా ముఖ్యం. అయితే.. ఈ రోజుల్లో అందరూ ఫాస్ట్ ఫుడ్ కి అలవాటు పడిపోయి, జంక్ ఫుడ్స్ తినడం, శరీరానికి కనీస వ్యాయామం లేకపోవడ లాంటి కారణాల వల్ల అధిక బరువు సమస్యను ఎదుర్కొంటున్నారు. బరువు పెరగడమే కాదు, శరీరంలో చెడు కొలెస్ట్రాల్ కూడా పెరిగిపోతుంది. దీని వల్ల చాలా రకాల సమస్యలు వచ్చేస్తాయి. మీరు కూడా అధిక బరువు, శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ కరిగించాలని అనుకుంటున్నారా? అయితే, ప్రతిరోజూ ఉదయాన్నే పరగడుపున కొన్ని డ్రింక్స్ తాగితే చాలు. పది రోజుల్లో మీ బరువులో వ్యత్యాసం కనపడుతుంది. కచ్చితంగా బరువు తగ్గుతారు.
amla tea for weight loss
చెడు కొలెస్ట్రాల్ పెరగడానికి కారణాలు ఏంటి?
నిపుణుల ప్రకారం, మన శరీరంలోని రక్త నాళాలలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోవడానికి మనం తీసుకునే ఆహారమే, దానిలోని కొవ్వే ప్రధాన కారణం. ఇది చాలా ప్రమాదకరమైనది. ఎందుకంటే, అవి గుండెకు కనెక్ట్ అయి ఉండే రక్త నాళాల్లో పేరుకుపోతుంది. దీని వల్ల రక్త ప్రవాహాన్ని అడ్డుకుంటాయి. దీని వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చేస్తాయి.
కొలెస్ట్రాల్ అంటే ఏమిటి?
కొలెస్ట్రాల్ అనేది మైనపులా జిగటగా ఉండే ఒక రకమైన కొవ్వు. అయితే, శరీరంలో రెండు రకాల కొలెస్ట్రాల్ ఉన్నాయి. ఒకటి మంచి కొలెస్ట్రాల్, ఇది శరీరంలో కొత్త కణాలు , హార్మోన్లను సృష్టించడానికి పనిచేస్తుంది. మరోవైపు, చెడు కొలెస్ట్రాల్ (LDL) గుండె జబ్బులు, స్ట్రోక్ , హార్ట్ ఎటాక్స్ వంటి సమస్యలు రావచ్చు.
ఈ డ్రింక్స్ తాగితే బరువు తగ్గడానికి , చెడు కొలిస్ట్రాల్ తగ్గించుకోవడానికి సహాయపడతాయి.
1.అవిసెగింజల నీరు..
అవిసె గింజలలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు , కరిగే ఫైబర్ కూడా ఉంటాయి. వాటిలో లిగ్నాన్లు అధికంగా ఉంటాయి, ఇవి LDL కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో ప్రయోజనకరంగా ఉంటాయని భావిస్తారు. ఈ రోజుల్లో, అవిసె గింజలు విత్తనాలు, నూనెలు, పొడి, మాత్రలు, గుళికలు పిండి రూపంలో తీసుకవచ్చు. ఉదయం ఖాళీ కడుపుతో నిమ్మరసంతో కలిపి అవిసె గింజలను తాగడం అలవాటు చేసుకోవాలని నిపుణులు అంటున్నారు.
క్యారెట్ రసం
క్యారెట్ రసం బరువు తగ్గడానికి సహాయపడుతుంది. క్యారెట్ రసం పోషకాలకు సహజ వనరు. బీటా-కెరోటిన్ సమృద్ధిగా ఉంటుంది, ఇది కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది. మన గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. క్యారెట్‌లో ముఖ్యంగా ఫైబర్, పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు , విటమిన్ K1 పుష్కలంగా ఉంటాయి.
fenugreek water
మెంతుల నీరు.
మెంతి గింజలు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడే అనేక భాగాలను కలిగి ఉంటాయి. ముఖ్యంగా, ఈ చిన్న విత్తనాలలో కనిపించే అధిక ఫైబర్ కంటెంట్ ప్రేగులలో కొవ్వు శోషణను తగ్గించడంలో సహాయపడుతుంది, తద్వారా శరీరంలోని కొవ్వు స్థాయిలను తగ్గిస్తుంది. రాత్రిపూట పడుకునే ముందు కొన్ని మెంతి గింజలను నీటిలో నానబెట్టి, ఉదయం ఖాళీ కడుపుతో త్రాగాలి.
Beetroot Juice
బీట్‌రూట్-క్యారెట్ రసం
బీట్‌రూట్‌లో నైట్రేట్లు ఉంటాయి, ఇవి రక్తంతో చర్య జరిపి నైట్రిక్ ఆక్సైడ్‌గా మారుతాయి. అందువల్ల, అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడేవారు బీట్‌రూట్ , క్యారెట్ రసం తయారు చేసి త్రాగడం ద్వారా త్వరగా ఉపశమనం పొందవచ్చు. అంతే కాదు, ఈ రసం సిరల్లో రక్తం గడ్డకట్టడాన్ని నయం చేస్తుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా, ఇది అధిక రక్తపోటు సమస్యను అదుపులో ఉంచుతుంది. క్యారెట్‌లో బీటా-కెరోటిన్ ఫైబర్ పుష్కలంగా ఉంటాయి, ఇది కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది.
coriander-water
దనియాల నీరు..
రాత్రి పడుకునే ముందు కొన్ని దనియాలను నానబెట్టి, మరుసటి రోజు ఉదయం నీరు మాత్రమే త్రాగడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.ఈ విత్తనాలలో కనిపించే యాంటీఆక్సిడెంట్ భాగాలు లిపిడ్ జీవక్రియలో సహాయపడతాయి. కొలెస్ట్రాల్ , ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి.