MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • 60 ఏళ్లు పైబడిన వారు రోజూ నడిస్తే.. ఈ సమస్యలకు చెక్ పెట్టొచ్చు!

60 ఏళ్లు పైబడిన వారు రోజూ నడిస్తే.. ఈ సమస్యలకు చెక్ పెట్టొచ్చు!

  Walking Benefits: నడక నాలుగు విధాలుగా మేలని వైద్యులు చెబుతుంటారు.  ముఖ్యంగా 60ఏళ్లు పైబడినవారు వాకింగ్, జాగింగ్‌ చేయడం వల్ల ప్రమాదకర రోగాల నుంచి రక్షణ పొందవచ్చని పలు అధ్యయనాలు స్పష్టంచేశాయి. అయితే.. 60 ఏళ్లు పైబడిన వారు రోజూ ఎంత దూరం నడిస్తే ఉత్తమం అనే విషయాలు తెలుసుకుందాం.   

1 Min read
Author : Rajesh K
Published : May 10 2025, 12:33 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
వృద్ధులు వారానికి ఎన్ని రోజులు నడవాలి?

వృద్ధులు వారానికి ఎన్ని రోజులు నడవాలి?

నడక ఆరోగ్యానికి మాత్రమే కాదు.. మెదడు పనితీరు కూడా దోహదపడుతుంది. నడక వల్ల జ్ఞాపకశక్తి, అభ్యాసానికి అవసరమైన మెదడులోని హిప్పోకాంపస్ పనితీరు మెరుగుపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇందుకోసం ప్రతిరోజూ గంటల తరబడి నడవాలని అవసరం లేదనీ, వారంలో మూడు రోజులు కేవలం 40 నిమిషాలు నడిచినా సరిపోతుందట. ఇలా చేయడం వల్ల అభ్యాస సామర్థ్యం పెరుగుతుందట. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
అధ్యయన అంశాలు

అధ్యయన అంశాలు

నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌లో ప్రచురించబడిన అధ్యయనంలో చిత్తవైకల్యం లేని 120 మంది వృద్ధులను ఎంపిక చేశారు. వారిని రెండు గ్రూపులుగా విభజించారు. ఇందులో ఎక్కువ సేపు విశ్రాంతి తీసుకునే వారు, అధికంగా శ్రమించేవారని గ్రూపులుగా చేశారు. వీరిని  సంవత్సరం పాటు పరిశీలించినప్పుడు.. ఏరోబిక్ వ్యాయామం చేసిన వారి హిప్పోకాంపస్ పరిమాణం సగటున 2% పెరిగినట్లు కనుగొన్నారు. వ్యాయామం చేయని మరొక గ్రూపులో హిప్పోకాంపస్ పరిమాణం తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఈ అధ్యయనంలో అభ్యాసం, జ్ఞాపకశక్తికి సంబంధించిన మెదడులోని న్యూరోట్రోఫిక్ కారకం (BDNF) స్థాయిలతో హిప్పోకాంపస్ పరిమాణాలు సంబంధం కలిగి ఉన్నాయని కనుగొన్నారు.

34
మెదడు పనితీరు

మెదడు పనితీరు

వయసు పెరిగే కొద్దీ వారి జ్ఞాపకశక్తి, లో గణనీమైన మార్పులు వస్తాయి.  మెదడులోని హిప్పోకాంపస్ పరిమాణం తగ్గడం వల్ల.. వయసు పెరిగే కొద్దీ జ్ఞాపకశక్తి తగ్గుతుంది. అలాగే.. కొత్త విషయాలను గుర్తుపెట్టుకోవడంలో ఇబ్బంది పడుతుంటారు. దీనితో పాటు దీర్ఘకాలిక ఒత్తిడి, సరిగా నిద్రపోకపోవడం, వంటివి కూడా మెదడు పనితీరు ప్రభావం చూపుతాయి. కానీ క్రమం తప్పకుండా వ్యాయామం, నడక, ఏరోబిక్, ఆరోగ్యకరమైన ఆహారం, మానసిక స్థితి సమతుల్యంగా ఉండటం వంటివి హిప్పోకాంపస్ కుంచించుకుపోవడాన్ని ఆలస్యం చేస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి.

44
ఎంత సేపు నడవాలి?

ఎంత సేపు నడవాలి?

ప్రతిరోజూ 40 నిమిషాలు నడవడం వల్ల మీ మెదడు పనితీరులో మార్పులు రావచ్చు. ఇది మంచి వ్యాయామం. ఈ 40 నిమిషాలను 20 నిమిషాలుగా విభజించి ఉదయం, సాయంత్రం వేర్వేరు సెషన్‌లుగా నడవవచ్చు. వారంలో కనీసం మూడు రోజులు నడిచినా సరిపోతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. వీలుంటే.. ప్రతిరోజూ నడవగలిగితే అది మరింత మంచిది. 

About the Author

RK
Rajesh K
రాజేశ్ కారంపూరి: ఆరు సంవత్సరాలుగా ప్రముఖ ప్రింట్, డిజిటల్, వెబ్ మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రధానంగా పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, సినిమా, స్పోర్ట్స్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం ఏసియానెట్‌ తెలుగులో ఫ్రీలాన్సర్ గా పని చేస్తున్నారు.
జీవనశైలి
ఆరోగ్యం
ఏషియానెట్ న్యూస్
మహిళలు
పురుషులు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
సిగరెట్ లేకుండా మల విసర్జన కావడం లేదా? కారణం ఏంటో ఎప్పుడైనా ఆలోచించారా.?
Recommended image2
నీళ్లు తాగిన వెంటనే పరిగెత్తితే క‌డుపులో ఒక‌వైపు నొప్పి ఎందుకు వస్తుంది? దీనికి కార‌ణం ఏంటంటే?
Recommended image3
ఆల్క‌హాల్ తాగిన తర్వాత ట్యాబ్లెట్స్‌ వేసుకోవచ్చా? వైద్యులు ఏమంటున్నారంటే..
Related Stories
Recommended image1
ఉదయం వాకింగ్ కి ముందు ఈ తప్పులు చేయకండి..!
Recommended image2
Walking Benefits: రాత్రి పడుకునే ముందు ఈ ఒక్క పనిచేస్తే ఎన్ని లాభాలో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved