HIV: కండోమ్ వాడినా హెచ్ఐవీ వస్తుందా.? అసలేందుకిలా జరుగుతుంది.
Condom Safety Facts: కండోమ్ వాడకాన్ని ప్రభుత్వాలు సైతం ప్రోత్సహిస్తుంటాయి. సురక్షిత సంభోగం గురించి అవగాహన కల్పిస్తుంటాయి. అయితే కొన్ని సందర్భాల్లో కండోమ్ ఉపయోగించినా హెచ్ఐవీ వస్తుంది. అసలు ఎందుకలా జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

కండోమ్ 100 శాతం సురక్షితం కాదా.?
చాలా మంది కండోమ్ వాడుతున్నాం కాబట్టి ఏం కాదన్న ధీమాతో ఉంటారు. అయితే ఇది నిజం కాదు. 20 శాతం కండోమ్ ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే 100 సార్లు కండోమ్ ఉపయోగిస్తే 20 సార్లు అది ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే కండోమ్ ఉపయోగించే సమయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి.
KNOW
ఫెయిల్ కావడానికి కారణాలు ఏంటి.?
కండోమ్ ఫెయిల్ కావడానికి చాలా కారణాలు ఉన్నాయి. వీటిలో ప్రధానమైనవి కండోమ్‌ను ఎలా ఉపయోగించుకోవాలో తెలియకపోవడం ఒకటి. అలాగే కొన్ని సందర్భాల్లో కండోమ్ జారిపోవడం, లేదా చిరిగిపోవడం వంటి సందర్భాలు ఉంటాయి. ఎంత జాగ్రత్తగా ఉపయోగించినా ఇలాంటి తప్పిదాలు జరుగుతాయి. కండోమ్ 100 శాతం సేఫ్టీ అని కచ్చితంగా చెప్పలేం.
హెచ్ఐవీ నుంచి బయటపడొచ్చా
హెచ్ఐవీ పాజిటివ్ అని తెలిసిన వెంటనే జాగ్రత్తలు తీసుకుంటే ఆ వ్యాధి నుంచి బయటపడొచ్చనే సందేహం వస్తుంది. అయితే ఒక్కసారిగా హెచ్ఐవీ పాజిటివ్ వచ్చిందంటే దాని నుంచి పూర్తిగా బయటపడడం కష్టం. అయితే జీవన విధానంలో మార్పులు చేసుకోవడం, రోగ నిరోధక శక్తిని పెంచుకునే ప్రయత్నాలు చేయడం వల్ల వ్యాధి ప్రభావం నుంచి కాస్తొ కూస్తో తప్పించుకోవచ్చు.
భర్త హెచ్ఐవీ భార్యకు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి.?
ఒకవేళ భర్తకు హెచ్ఐవీ ఉంటే భార్యతో శారీరకంగా కలిస్తే కచ్చితంగా వ్యాధి సోకుతుందని తెలిసిందే. అయితే ప్రిఎక్స్‌ప్లోజర్ ప్రొఫ్లాక్స్ ట్యాబ్లెట్స్ వాడి సంభోగంలో పాల్గొంటే వ్యాధి వచ్చే అవకాశాలు తగ్గుతాయి. అలాగే హెచ్ఐవీ ఉన్న భర్త.. ట్యాబ్లెట్స్ ఉపయోగించినా వ్యాధి క్రీములకు ఇన్ఫెక్షన్ కలిగించే శక్తి తగ్గుతుంది. ఇలా ఇద్దరూ ట్యాబ్లెట్స్ వాడితే వ్యాధి వచ్చే అవకాశాలు తగ్గుతాయి.
పూర్తి వీడియో ఇక్కడ చూడండి..
(ఇక్కడ డాక్టర్ గొపరాజు సమరం గారు తెలిపిన వైద్య సమాచారం, అభిప్రాయాలు, ఆయన వైద్య అనుభవం, ప్రజారోగ్య రంగంలో చేసిన సేవల ఆధారంగా అందించాము. దీనిని కేవలం ప్రాథమిక సమాచారంగానే భావించాలి. ఇది వైద్యుల సలహాకు బదులుగా భావించకండి. దయచేసి మీ ఆరోగ్య పరిస్థితులకు సరైన నిర్ధారణ, చికిత్స కోసం అర్హత గల వైద్యులను సంప్రదించండి.)