MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Feature
  • స‌మరం... స‌రికొత్త‌గా : ఏసియానెట్ తెలుగు పాఠకులకు డాక్టర్ సమరం సలహాలు

స‌మరం... స‌రికొత్త‌గా : ఏసియానెట్ తెలుగు పాఠకులకు డాక్టర్ సమరం సలహాలు

లైంగిక విద్యకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చిన డాక్టర్ సమరం సలహాలు, సూచనలు ఈ తరం వారికి కూడా ఎంతో అవసరం. ఇలాంటి ఉద్దేశంతోనే ఏసియా నెట్ తెలుగు వినూత్న ప్రయత్నం చేస్తోంది. 

2 Min read
Author : Venugopal Bollampalli
| Updated : Jul 31 2025, 03:31 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఈ పేరు తెలియని వారుండరు
Image Credit : Asianet News

ఈ పేరు తెలియని వారుండరు

డాక్ట‌ర్ జీ స‌మ‌రం.. బ‌హుశా ఈ పేరు తెలియని తెలుగువారు ఉండ‌ర‌ని చెప్ప‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఎన్నో అపోహ‌లు, మ‌రెన్నో అనుమానాల‌పై స‌మ‌ర శంఖం పూరించిన గొప్ప మాన‌వ‌తావాది ఈయ‌న‌. లైంగిక విద్య అనే పేరు విన‌గానే ముఖం తిప్పుకునే ఆ రోజుల్లోనే పాఠ‌శాల స్థాయిలో ఈ విద్య ఉండాల‌న్న‌ ఆవ‌శ్య‌క‌త‌ను చాటి చెప్పారు. మ‌నిషి జీవితంలో స‌హ‌జ క్రియ అయిన శృంగారానికి సంబంధించిన సందేహాల‌ను నివృత్తి చేయ‌డానికి ర‌క‌ర‌కాల మార్గాల ద్వారా స‌ల‌హాలు ఇస్తున్నారు. ఈయన సలహాలతో జీవితాలను ఆనంద ప్రదంగా మార్చుకున్న వారు కో కొల్లలు.

స‌మ‌రం అన‌గానే చాలా మంది కేవ‌లం లైంగిక విద్యకే ప‌రిమితం అనుకుంటారు. కానీ ఆయ‌న మూఢ న‌మ్మ‌కాల‌ను ప‌టాపంచ‌లు చేసే గొప్ప వైద్యుడు, మాన‌సిక ఆరోగ్యాన్ని ఎలా పెంపొందించుకోవాలో చెప్పే గొప్ప సైకాల‌జిస్ట్‌.

ఆధునిక జీవన శైలితో సంతాన‌లేమి, మానసిక స‌మ‌స్య‌లు పెరుగుతోన్న ప్ర‌స్తుత త‌రుణం స‌మ‌రం అవ‌స‌రం మ‌రింత పెరిగింది. అందుకే ఏసియా నెట్ న్యూస్ తెలుగు స‌మ‌రాన్ని స‌రికొత్త‌గా చూపించే ప్ర‌య‌త్నం చేస్తోంది. నేటి జెన్ జీ త‌రానికి అర్థ‌మ‌య్యేలా డాక్టర్ స‌మరం ద్వారా ఆరోగ్య విష‌యాల‌ను వివ‌రిస్తోంది. మీ ప్ర‌తీ సందేహానికి ఈ స‌మ‌రం సరికొత్త వెర్షన్ లో క‌చ్చితంగా స‌మాధానం దొరుకుతుంది.

DID YOU
KNOW
?
21 పుస్తకాలు
డా. సమరం 217కి పైగా వైద్య, ఆరోగ్య, లైంగిక విద్యపై పుస్తకాలు రాశారు. స్వాతంత్ర సమరయోధుడు గోరా కుమారుడిగా, ప్రజల్లో శాస్త్రీయ ఆలోచన కల్పించారు.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
సమరం గురించి నేటి తరానికి తెలియని విషయాలు
Image Credit : gsamaram.com

సమరం గురించి నేటి తరానికి తెలియని విషయాలు

డా. గోపరాజు సమరం.. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 1939 జూలై 30న జన్మించారు. చిన్నప్పటి నుంచే ప్రజా సమస్యలపై సున్నితమైన దృక్కోణం కలిగి ఉన్నారు. నాస్తిక ఉద్యమాన్ని ముందుకు నడిపిన గోరా, సరస్వతి గోరాల కుమారుడు సమరం. ఈయన శాస్త్రీయ ఆలోచన, సమానత్వ భావనలను వారసత్వంగా పొందారు.

Related Articles

Related image1
Andhra Pradesh: ఆసియాలోనే అతి పెద్ద డేటా సెంట‌ర్‌.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఎక్క‌డ రానుందంటే
Related image2
High Security Number Plate: మీ నెంబ‌ర్ ప్లేట్ మార్చారా, లేదా? లేదంటే ఫైన్ చెల్లించాల్సిందే. లాస్ట్ డేట్ ఎప్పుడంటే
35
వైద్య వృత్తి – ప్రజల మధ్యే ప్రారంభం
Image Credit : gsamaram.com

వైద్య వృత్తి – ప్రజల మధ్యే ప్రారంభం

కాకినాడలోని రంగరాయ వైద్య కళాశాల నుంచి ఎం.బీ.బీ.ఎస్. పూర్తి చేసిన సమరం, 1970లో విజయవాడలో వైద్యవృత్తిని మొదలుపెట్టారు. వైద్యునిగా పనిచేస్తూనే వందలాది ఉచిత వైద్య శిబిరాలు, నేత్ర శస్త్రచికిత్సలు, రక్తదాన శిబిరాలు, పోలియో శస్త్రచికిత్సా శిబిరాలు నిర్వహించారు. ఎయిడ్స్ వ్యాధి ప్రమాదాలపై ప్రజల్లో అవగాహన కల్పిండంలో ఆయన చేసిన కృషి విశేషం.

45
మూఢనమ్మకాలపై పోరాటం చేసిన సమరం
Image Credit : gsamaram.com

మూఢనమ్మకాలపై పోరాటం చేసిన సమరం

సమాజంలో ఇప్పటికీ బాణామతి, చేతబడి వంటి మూఢనమ్మకాలు ప్రభావం చూపుతున్నాయి. ఈ సమస్యలను సమరం చాలా ముందుగానే గుర్తించారు. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, నల్లగొండ జిల్లాల్లో మూఢనమ్మకాల నిర్మూలన కోసం వైద్యులు, శాస్త్రజ్ఞులు, మంత్రజాలికులు, మిమిక్రీ కళాకారులతో బృందాలు ఏర్పాటు చేసి పర్యటించారు. జిల్లాస్థాయి అధికారుల ఆహ్వానంపై ఈ కార్యక్రమాలు నిర్వహించి సమాజానికి శాస్త్రీయ దృక్కోణాన్ని అందించారు.

55
భారతీయ వైద్య సంఘంలో నాయకత్వం
Image Credit : gsamaram.com

భారతీయ వైద్య సంఘంలో నాయకత్వం

డా. సమరం భారతీయ వైద్య సంఘం (IMA)లో కీలక పాత్ర పోషించారు. స్థానిక, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో అనేక పదవులు చేపట్టారు. 1980-81లో ఉత్తమ రాష్ట్రాధ్యక్షునిగా సత్కారం పొందారు. 1996-97లో IMA ఉపాధ్యక్షుడిగా పనిచేశారు.అంతేకాకుండా డాక్టర్ సమరం చేసిన మానవతా సేవలకు గాను రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రెసిడెంట్ మెడల్ కూడా అందుకున్నారు. ఆయన భార్య డా. రష్మీ కూడా ఈ సేవలో భాగమై, పలు కార్యక్రమాల్లో పక్కన నిలిచారు. ప్రస్తుతం తన యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా ఎంతో మంది సందేహాలను తీర్చుతున్నారు. 

రచనలు – శాస్త్రీయ ఆలోచనల వారధి

సమరం తెలుగు పాఠకులకు వైద్య శాస్త్రాన్ని సులభంగా అర్థమయ్యేలా పలు పుస్తకాలు రాశారు. ఆయన రచనలు నేటి యువతకు కూడా మార్గదర్శకం అవుతాయి. ముఖ్యమైన రచనలు:

సైన్సు – నాస్తికత్వం (1981), సైన్సు – మనస్సు (1982), ముప్పు తెచ్చే మూఢనమ్మకాలు (1993),

కుటుంబ నియంత్రణ పద్ధతులు, ఆధునిక ఆరోగ్య రక్షణ గ్రంథావళి (హార్ట్ ఎటాక్, వ్యాధులు-భయాలు)

ఈ పుస్తకాలు ఆరోగ్యంపై అవగాహన పెంచడమే కాకుండా, మూఢనమ్మకాలను తొలగించడానికి ఉపయోగపడుతున్నాయి.

About the Author

VB
Venugopal Bollampalli
Venugopal Bollampalli is a senior journalist currently serving as the Editor of Asianet News Telugu & Asianet News Tamil. With over 20 years of experience in the Telugu and Tamil media industry, he has held key roles across renowned organizations such as Eenadu, BBC, Big TV, and Microsoft News. He brings deep expertise in digital media leadership, YouTube and social media content strategy, content management, national and regional news analysis, and data-driven editorial planning. He is also proficient in integrating artificial intelligence into content workflows, enabling more efficient and scalable news production.
ఆరోగ్యం
జీవనశైలి
వైరల్ న్యూస్
ఆంధ్ర ప్రదేశ్
తెలంగాణ
హైదరాబాద్
విజయవాడ

Latest Videos
Recommended Stories
Recommended image1
Income Tax Rules : ఓ ఫ్యామిలీ ఇంట్లో ఎంత డబ్బు దాచుకోవచ్చు? ఎక్కువుంటే ఏమైనా ప్రాబ్లమా?
Recommended image2
Facts : ఏ జంతువుకు ఎన్నిపళ్ళు ఉంటాయి? నోట్లో ఒక్క పన్ను లేని జీవి 14 వేల పళ్లుండే జీవిని తినేస్తుందా..!
Recommended image3
Longest Lifespan Animals: బాబోయ్.. ఏకంగా 4300 ఏళ్లు బతుకుతుందా? భూమిపై అత్యంత ఎక్కువ ఆయుష్షు ఉన్న జీవి ఇదే !
Related Stories
Recommended image1
Andhra Pradesh: ఆసియాలోనే అతి పెద్ద డేటా సెంట‌ర్‌.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఎక్క‌డ రానుందంటే
Recommended image2
High Security Number Plate: మీ నెంబ‌ర్ ప్లేట్ మార్చారా, లేదా? లేదంటే ఫైన్ చెల్లించాల్సిందే. లాస్ట్ డేట్ ఎప్పుడంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved