Health Care: పేపర్ కప్స్ లో టీ, కాఫీ తాగితే ఏమౌతుంది?
ప్లాస్టిక్ వాడకం ఆరోగ్యానికి మంచిది కాదు. ఈ మధ్యకాలంలో చాలా మంది ప్లాస్టిక్ బదులు.. పేపర్ కప్స్ వాడుతూ ఉంటారు. కానీ, ఈ పేపర్ కప్స్ వాడకం ఆరోగ్యానికి మంచిదేనా? నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం..

paper cup tea
పర్యావరణ పరిరక్షణ కోసం ప్రపంచం మొత్తం కలిసి అడుగులు వేస్తున్న సమయం ఇది. వీలైనంత వరకు ప్లాస్టిక్ వాడకుండా ఉండేందుకే అందరూ ప్రయత్నిస్తున్నారు. దీనిలో భాగంగానే ప్లాస్టిక్ కప్పులకు బదులు చాలా మంది పేపర్ కప్పులు ప్రత్యామ్నాయంగా వాడుతున్నారు. ఇవి పర్యావరణ హితం అయినప్పటికీ.. ఆరోగ్యానికి మాత్రం హాని తెచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది.పేపర్ కప్స్ లో వేడి వేడిగా టీ, కాఫీ లు తాగడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..
tea cups
పేపర్ కప్పుల నుండి తాగడం వల్ల కలిగే 5 ఆరోగ్య ప్రమాదాలు
పేపర్ కప్పులు కంప్లీట్ గా పేపర్ తోనే తయారు చేస్తారు అనుకోవడం మన పొరపాటు. ఈ కప్పుల్లోనూ మైక్రోప్లాస్టిక్ కలుస్తుంది. లీకేజ్ అవ్వగుండా ఉండేందుకు ఆ కప్పులను కూడా పాలిథిన్ తో కవర్ చేసి ఉంచుతారు. ఇలాంటి కప్పుల్లో మనం వేడి వేడి టీ, కాఫీలు పోసినప్పుడు.. ఆ వేడికి కప్పులో ఉణ్న మైక్రో ప్లాస్టిక్స్ విచ్చిన్నమౌతాయి. అప్పుడు దానిలో నుంచి కొన్ని రకాల కెమికల్స్ విడుదల అయ్యి.. ఆ పానియంలో కలుస్తాయి.ఆ టీ, కాఫీ మనం తాగినప్పుడు అవి మానవ శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఉంది.
ప్రింటింగ్ ఇంక్‌లు ,డైల ప్రమాదం
అనేక పేపర్ కప్పులు రంగుల ఇంక్‌లతో ప్రింట్ చేసి, ఆకర్షణీయమై డిజైన్లను కలిగి ఉంటాయి. ఆ సిరాలు కూడా ఆరోగ్యానికి మంచివి కావు. కప్పులో వేడి పానియం పోసినప్పుడు ఈ ఇంక్ అందులో కలిసే అవకాశం ఉంది.
3. హానికర లోహాల ముప్పు
కొన్ని చౌక కప్పుల్లో సీసం, క్రోమియం వంటి హానికర లోహాలు ఉండే అవకాశం ఉంది. దీని వల్ల ఈ లోహాలు శరీరంలో పేరుకుపోయి అనేక రకాల ఆరోగ్య సమస్యలు తీసుకురాగలవు.
4. హార్మోన్లలో గందరగోళం
పేపర్ కప్పులలోని ప్లాస్టిక్ పూతలు ఎండోక్రైన్ అంతరాయం కలిగించే కెమికల్స్ కలిగి ఉంటాయి. ఇవి శరీరంలోని సహజ హార్మోన్లను దెబ్బతీస్తాయి. దీర్ఘకాలంగా ఈ కెమికల్స్ ప్రభావితమైతే ఫెర్టిలిటీ, మెటబాలిజం, రోగనిరోధక వ్యవస్థపై ప్రభావం చూపే ప్రమాదం ఉంది.
5. జీర్ణ సమస్యలు
చిన్న మోతాదులో అయినా మైక్రోప్లాస్టిక్ శరీరంలోకి వెళ్లితే, అది జీర్ణతంత్రాన్ని దెబ్బతీస్తుంది. ఇది గట్ మైక్రోబయోమ్‌పై ప్రభావం చూపి, జీర్ణ సంబంధిత సమస్యలు, పోషకాలు చక్కగా శోషించుకోలేకపోవడం వంటివి జరగవచ్చు.
సరైన మార్గం ఏంటి?
పేపర్ కప్పులు వాడటం పర్యావరణానికి మంచిదే అయినా, ఆరోగ్య పరంగా రిస్క్ తీసుకోవడం అవసరం లేదు. అందుకే, స్టెయిన్‌లెస్ స్టీల్, గాజు లేదా సిరామిక్ కప్పులను ఉపయోగించడం ఉత్తమమైన ఎంపిక. ఇవి సురక్షితంగా ఉంటాయి, దీర్ఘకాలం ఉపయోగించవచ్చు కూడా.