MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Life
  • Health
  • Walking: ప్రతిరోజూ 7వేల అడుగులు నడిస్తే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

Walking: ప్రతిరోజూ 7వేల అడుగులు నడిస్తే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

Walking: నడక ఆరోగ్యానికి ఎంత మంచిదో అందరికీ తెలుసు. నడకతో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. గుండె ఆరోగ్యం మెరుగుపడడం, బరువు తగ్గడం, మానసిక ఆరోగ్యం మెరుగవుతుంది. అయితే.. ప్రతి రోజూ 7వేల అడుగులు నడిస్తే  ఎన్నో ప్రయోజనాలో తెలుసా?

1 Min read
Author : Rajesh K
Published : Jul 28 2025, 03:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
నడవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు
Image Credit : Getty

నడవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు

నడక వల్ల శరీరానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయన్న విషయం అందరికీ తెలిసిందే. ఇది శరీరానికి మేలు చేసే సాధారణ కార్డియో వ్యాయామం. ఇటీవల జరిగిన ఓ అధ్యయనం ప్రకారం, రోజుకు కనీసం 7,000 అడుగులు నడవడం ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయట. ఆ అధ్యయనం ఫలితాల గురించి వివరంగా తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
రోజుకు 7,000 అడుగులు
Image Credit : Getty

రోజుకు 7,000 అడుగులు

10,000 అడుగులు నడవడం ఆరోగ్యానికి మంచిదని భావించబడుతున్నప్పటికీ, ఇటీవల జరిగిన అధ్యయనం ప్రకారం రోజుకు 7,000 అడుగులు నడవడం కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వృద్ధులలో ఇది డిమెన్షియా ప్రమాదాన్ని 38 శాతం తగ్గించగలదని, డిప్రెషన్‌ను 22 శాతం వరకు తగ్గించగలదని వెల్లడైంది. అంతేకాదు.. దీర్ఘకాలిక వ్యాధి అయిన టైప్-2 డయాబెటిస్ ప్రమాదాన్ని 14 శాతం వరకు తగ్గించగలదని పరిశోధనలో తేలింది.  

34
7000 అడుగుల ప్రయోజనాలు
Image Credit : Getty

7000 అడుగుల ప్రయోజనాలు

జ్ఞాపకశక్తి కోల్పోవడం, మానసిక ఒత్తిడి, డయాబెటిస్, గుండె జబ్బులు వంటి అనేక ఆరోగ్య సమస్యలతో పాటు క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని కూడా రోజుకు 7,000 అడుగులు నడవడం తగ్గిస్తుందని పరిశోధకులు తెలిపారు. పదివేల అడుగులు నడిస్తేనే ఆరోగ్య ప్రయోజనం ఉంటుందని భావించడం అపోహ మాత్రమే. నిజానికి, మీరు నడిచే ప్రతి అడుగు శరీరంలో కొన్ని మార్పులను తీసుకురావడంలో సహాయపడుతుంది. మితమైన నడక శరీరానికి శక్తిని, మెదడుకు ప్రశాంతతను అందించి, దీర్ఘకాలిక ఆరోగ్యానికి దోహదం చేస్తుంది.

44
ఎలా నడవాలి?
Image Credit : Getty

ఎలా నడవాలి?

మీరు ప్రతిరోజూ 2,000 నుండి 3,000 అడుగులు మాత్రమే నడుస్తుంటే, అదనంగా మరో 1,000 అడుగులు నడవడం  మీ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. నడకను సమర్థవంతంగా చేసుకోవాలంటే, మొదటి 10 నుంచి 15 నిమిషాలు నెమ్మదిగా నడవాలి. ఆ తర్వాత వేగాన్ని పెంచాలి. నెమ్మదిగా – వేగంగా మారుతూ నడవడం వల్ల ఇది మంచి కార్డియో వ్యాయామంగా మారుతుంది. ఈ విధంగా నడకను అలవాటు చేసుకుంటే బరువు తగ్గడంలో కూడా ఇది ఉపయోగపడుతుంది.

About the Author

RK
Rajesh K
రాజేశ్ కారంపూరి: ఆరు సంవత్సరాలుగా ప్రముఖ ప్రింట్, డిజిటల్, వెబ్ మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రధానంగా పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, సినిమా, స్పోర్ట్స్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం ఏసియానెట్‌ తెలుగులో ఫ్రీలాన్సర్ గా పని చేస్తున్నారు.
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
మహిళలు
ఆరోగ్యం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
సద్గురు హెల్త్ టిప్స్ : కిడ్నీలో రాళ్లు కరిగించే దివ్యౌషదం ఇదే
Recommended image2
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Recommended image3
ఆపరేషన్ అయిన వారికి, జ్వరం వచ్చిన వారికి బ్రెడ్ ప్యాకెట్లే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.?
Related Stories
Recommended image1
Walking: ఉదయం లేదా సాయంత్రం.. వాకింగ్ ఎప్పుడు చేస్తే మంచిది?
Recommended image2
Walking: 30 ఏళ్లు దాటిన మహిళలు రోజూ 15 నిమిషాలు వాకింగ్ చేస్తే ఏమౌతుంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved