Walking: ఉదయం లేదా సాయంత్రం.. వాకింగ్ ఎప్పుడు చేస్తే మంచిది?
వాకింగ్ ఎంతసేపు చేస్తున్నాం అనేది ఎంత ముఖ్యమో.. మనం ఏ సమయంలో చేస్తున్నాం అనేది కూడా ముఖ్యమే.

వాకింగ్ చేస్తున్నారా?
ఆరోగ్యంగా ఉండేందుకు ప్రతిరోజూ కనీసం గంట నడవడం చాలా అవసరం. వాకింగ్ చేయడం వల్ల మనకు చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా అధిక బరువు తగ్గించుకునేందుకు వాకింగ్ మనకు చాలా బాగా సహాయపడుతుంది. ఎటువంటి పరికరాలు లేకుండా చేయగలిగే ఏదైనా వ్యాయామం ఏదైనా ఉంది అంటే అది వాకింగ్ మాత్రమే. రెగ్యులర్ గా వాకింగ్ చేయడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అయితే.. ఈ వాకింగ్ ఎంతసేపు చేస్తున్నాం అనేది ఎంత ముఖ్యమో.. మనం ఏ సమయంలో చేస్తున్నాం అనేది కూడా ముఖ్యమే. మరి, వాకింగ్ ఎప్పుడు చేయడం మంచిది అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం...
ఉదయం లేదా సాయంత్రం..
తినడానికి ముందు ఉదయంపూట నడవడం..
ఉదయాన్నే ఎలాంటి ఆహారం తీసుకోకుండా నడవడం వల్ల శరీరంలోని కొవ్వు కరుగుతుంది. ఆ సమయంలో కడుపు ఖాళీ గా ఉండటం వల్ల, నడవడానికి శక్తి శరీరంలోని ఫ్యాట్ నుంచి లభిస్తుంది. ప్రతిరోజూ మీరు ఉదయం పూట క్రమం తప్పకుండా వాకింగ్ చేయడం వల్ల మీరు బరువు చాలా సులభంగా తగ్గడానికి సహాయం చేస్తుంది. బరువు తగ్గాలి అనుకునేవారికి ఉదయం పూట నడక చాలా మంచిది.
నడవడం వల్ల కేవలం ఆరోగ్య ప్రయోజనాలు మాత్రమే కాదు, మానసిక ప్రయోజనాలు కూడా కలుగుతాయి. రెగ్యులర్ గా వాకింగ్ చేసే వారికి మానసిక స్పష్టతను కూడా అందిస్తుంది. భోజనానికి అరగంట ముందు నడవడం మీ దృష్టిని పెంచుతుంది. పది నిమిషాలు నడవడం వల్ల మెదడుకు చేరే ఆక్సిజన్ పరిమాణం పెరుగుతుంది. ఇది ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది.
తిన్న తర్వాత నడవడం?
తిన్న తర్వాత నడవడం జీర్ణక్రియకు సహాయపడుతుంది. కడుపులో కదలిక ఆహారం జీర్ణవ్యవస్థ ద్వారా సులభంగా వెళ్ళడానికి సహాయపడుతుంది. ఇది కడుపు ఉబ్బరం, మలబద్ధకం , గుండెల్లో మంటను నివారిస్తుంది. ఎక్కువగా తిన్న తర్వాత మీకు అసౌకర్యంగా అనిపిస్తే, మీరు కాసేపు వాకింగ్ చేయవచ్చు.
ఉదయం లేదా సాయంత్రం నడక
ఉదయం ఖాళీ కడుపుతో నడవడం వల్ల శరీర కొవ్వు తగ్గుతుంది. సూర్యకాంతిలో నడవడం వల్ల మెలటోనిన్ ఉత్పత్తి పెరుగుతుంది. రాత్రి భోజనం తర్వాత నడవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రించగలం. రాత్రిపూట నడిచే వ్యక్తులు తక్కువ ఒత్తిడికి గురవుతారని అధ్యయనాలు చెబుతున్నాయి.
తినడానికి ముందు నడవడం వల్ల శరీరంలో నిల్వ ఉన్న కొవ్వు కరుగుతుంది. తినడం తర్వాత నడవడం వల్ల శరీరంలో ఇన్సులిన్ స్థాయిలు నియంత్రించవచ్చు. కొవ్వు శరీరంలో పేరుకుపోకుండా కాపాడుకోవచ్చు.కాబట్టి.. ఎవరి వీలును బట్టి వారు నడవచ్చు.