ఫ్యాటీలివర్ కూడా ఒక రకమైన లివర్ ఇన్ఫెక్షన్. కాలేయంపై అదనపు కొవ్వు పేరుకుపోతే ఈ సమస్య వస్తుంది. ఆల్కహాల్, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, జీవనశైలి వల్ల ఫ్యాటీ లివర్ రావచ్చు.
మద్యం ఎక్కువగా తాగేవారిలో ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ వస్తుంది. మద్యం తక్కువగా తాగేవారిలో లేదా తాగని వారిలో నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ ( NAFLD) వస్తుంది.
ఫ్యాటీ లివర్ ముఖ్య లక్షణాల్లో అతినీరసం ఒకటి. ఎంత విశ్రాంతి తీసుకున్నా నీరసంగానే కనిపిస్తారు. ఫ్యాటీ లివర్ ప్రారంభ ఇది.
ఫ్యాటీ లివర్ సమస్య ఉంటే కడుపు దిగువ భాగంలో భరించలేని నొప్పి ఉంటుంది. ఏ కారణం లేకుండా పదే పదే ఈ నొప్పి వస్తుంది.
ఫ్యాటీ లివర్ ఉంటే.. సడన్‌గా బరువు తగ్గుతారు. నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వ్యాధితో బాధపడేవారిలో ఈ లక్షణం కనిపిస్తుంది. ఎటువంటి కారణం లేకుండా బరువు తగ్గుతారు.
ఫ్యాటీ లివర్ వల్ల రక్తంలో చక్కెర పెరుగుతుంది. జీవక్రియ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
చర్మం, కళ్ళు పసుపు రంగులోకి మారుతాయి. ఈ సంకేతం కనిపిస్తే మీకు ఫ్యాటీ లివర్ ఉందని అర్థం చేసుకోండి. పచ్చ కామెర్లు రావడం కాలేయ సమస్యల్ని సూచిస్తుంది.